MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • School Holidays : అర్నబ్ తుపాను తీరందాటినా ఆగని వర్షబీభత్సం.. ఈ జిల్లాల్లో స్కూళ్ళకి సెలవులు పొడిగిస్తారా?

School Holidays : అర్నబ్ తుపాను తీరందాటినా ఆగని వర్షబీభత్సం.. ఈ జిల్లాల్లో స్కూళ్ళకి సెలవులు పొడిగిస్తారా?

ఆంధ్ర ప్రదేశ్ లో అర్నబ్ తుపాను బీభత్సం కొనసాగుతోంది.. తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు ఉంటుందనే ప్రచారం సాగుతోంది.

3 Min read
Author : Arun Kumar P
Published : Oct 28 2026, 05:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రేపు స్కూళ్లకి సెలవుందా?
Image Credit : Gemini AI

రేపు స్కూళ్లకి సెలవుందా?

Cyclone Arnab : తెలుగు రాష్ట్రాల్లో అర్నబ్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుపాను ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ తీరాన్ని తాకింది... ఇవాళ (అక్టోబర్ 28) ఉదయం యానాం-నరసాపురం మధ్య తీరం దాటినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థం (APSDMA) వెల్లడించింది. తుపాను భూమిని తాకడంతో భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్రచండమైన ఈదురుగాలులతో అల్లకల్లోలం కొనసాగుతోంది... జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాను ప్రభావంతో రెండుమూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి... అయితే ఇవాళ (అక్టోబర్ 28, బుధవారం) తీరం దాటడంతో వర్షాలు, ఈదురుగాలుల తీవ్రత మరింత పెరిగింది. రేపు (అక్టోబర్ 29, గురువారం) కూడా కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తారనే ప్రచారం జోరందుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తారా..?
Image Credit : chatgpt

ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తారా..?

అర్నబ్ తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే ఏపీ జిల్లాల్లో రెండు రోజులుగా విద్యాసంస్థలు మూతపడి ఉన్నాయి. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది... అలాగే వాగులు వంకలు ఉప్పొంగి రాకపోకలకు ఆటంకం కలిగించవచ్చు. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన ప్రభుత్వం అక్టోబర్ 27,28 (మంగళ, బుధవారాలు) స్కూళ్లకి సెలవులిచ్చింది.

అర్నబ్ తుపాను నేపథ్యంలో అనకాపల్లి, కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కొనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో స్కూల్స్ కి సెలవులిచ్చింది ప్రభుత్వం. గుంటూరు, బాపట్ల, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాలలో సెలవులున్నాయి. అయితే తుపాను, వర్ష తీవ్రతను బట్టి కొన్ని ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు అమలుచేశారు అధికారులు.

అర్నబ్ తుపాను తీరందాటి పలు జిల్లాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. కొన్నిజిల్లాల్లో ఈ వర్షాలు, ఈదురుగాలులు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో అత్యంత భారీ వర్షాలు కురుస్తూ వరద పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్న జిల్లాల్లో సెలవులను పొడిగించే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ల నుండి ఎలాంటి సెలవు ప్రకటన వెలువడలేదు. స్థానిక పరిస్థితులను బట్టి ఇవాళ రాత్రి లేదా రేపు (అక్టోబర్ 29, గురువారం) ఉదయం విద్యాసంస్థల సెలవులపై ప్రకటన వెలువడవచ్చు.

34
తెలంగాణలో సెలవుల సంగతేంటి?
Image Credit : gemini

తెలంగాణలో సెలవుల సంగతేంటి?

కేవలం ఆంధ్ర ప్రదేశ్ పైనే కాదు తెలంగాణపై కూడా అర్నబ్ తుపాను ఎఫెక్ట్ కొనసాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో ఇవాళ (అక్టోబర్ 28) భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరించింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని విద్యాసంస్థలకు ఇవాళ (అక్టోబర్ 28) సెలవు ప్రకటించారు... ఈ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు ఈ సెలవు వర్తించింది.

అయితే అర్నబ్ తుపాను తీరందాటడంతో ఏపీతో పాటు తెలంగాణలో వర్షాలు జోరందుకున్నాయి... పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన బారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు రెండుమూడు రోజులు కొనసాగే అవకాశాలున్నాయిని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది... కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.

ఈ వర్ష హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణలో కూడా రేపు అంటే అక్టోబర్ 29న విద్యాసంస్థలకు సెలవులుంటాయనే ప్రచారం సాగుతోంది... కానీ ఇప్పటివరకు అధికారికంగా సెలవుల ప్రకటన వెలువడలేదు. వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటే రాత్రిగానీ రేపు ఉదయం గానీ సెలవుల ప్రకటన వస్తుంది... లేదంటే విద్యాసంస్థలు యదావిధిగా నడుస్తాయి.

44
అర్నబ్ తుపాను బీభత్సం.. అత్యధిక వర్షపాతం ఇక్కడే..
Image Credit : Gemini AI

అర్నబ్ తుపాను బీభత్సం.. అత్యధిక వర్షపాతం ఇక్కడే..

అర్నబ్ తుపాను తీరందాటే సమయంలో కొన్నిచోట్ల గంటకు 125 నుండి 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలను ఈ తుపాను షేక్ చేసింది... ఈదురుగాలులతో పాటు క్లౌడ్ బరస్ట్ అయినట్లుగా కుండపోత వర్షం కురిసింది. ఇలా విజయనగరం జిల్లాలోని గరివిడిలో అత్యధికంగా 260 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇక అనకాపల్లి, శృంగవరపు కోట, వేపాడ, చీపురుపల్లిలో 250 మి.మీ వర్షం కురిసింది. విశాఖపట్నంలో కూడా భారీ వర్షం కురిసింది.

ప్రచండమైన ఈదురుగాలులు, భారీ వర్షాలతో తీవ్ర ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడిన ఘటనల్లో మొత్తం ఏడుగురు మరణించినట్లు తెలుస్తోంది. ఇక ఊహకందని స్థాయిలో ఆస్తినష్టం జరిగింది. గాలులు, వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
 
3rd TEST • SA vs AUS
Live
SASA
329
AUSAUS
(36.0 ov)144/2
Day 2 - Session 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
Andhra pradesh: ఏపీ ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ప‌రిష‌త్ ఎన్నిక‌ల్ షెడ్యూల్‌లో మార్పులు
Recommended image2
Now Playing
Kethireddy Venkataramireddy Sensational Comments On Localbody Elections 2026 | Asianet Telugu
Recommended image3
Cyclone Arnab: తీరం దాటిన అతి తీవ్ర అర్నబ్ తుపాను.. ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు
Related Stories
Recommended image1
Cyclone Arnab: తీరం దాటిన అతి తీవ్ర అర్నబ్ తుపాను.. ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు
Recommended image2
Cyclone Arnab: తెలంగాణలో అర్నబ్ తుపాను ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved