MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Cyclone Arnab: తీరం దాటిన అతి తీవ్ర అర్నబ్ తుపాను.. ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు

Cyclone Arnab: తీరం దాటిన అతి తీవ్ర అర్నబ్ తుపాను.. ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు

Cyclone Arnab: అతి తీవ్ర అర్నబ్ తుపాను నరసాపురం-యానాం మధ్య తీరం దాటింది. తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలులు, భారీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ అలర్ట్ చేసింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 28 2026, 08:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అర్నబ్ తుపాను బీభత్సం: 1996 నాటి ప్రళయం రిపీట్
Image Credit : Asianet News

అర్నబ్ తుపాను బీభత్సం: 1996 నాటి ప్రళయం రిపీట్

ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను అర్నబ్ అతి తీవ్ర తుపాను గజగజ వణికిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రూపుదిద్దుకున్న ఈ తీవ్ర తుపాను యానానికి దక్షిణంగా, నరసాపురానికి సమీపంలో పూర్తిగా తీరం దాటింది. తీరం దాటే సమయంలో వేగంగా కదులుతూ తీరప్రాంత గ్రామాలను అతలాకుతలం చేసింది. అర్నబ్ ప్రభావంతో ఒకవైపు విపరీతమైన ఈదురుగాలులు, మరోవైపు కుండపోత వర్షాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కోనసీమలో కుండపోత, భారీ ఈదురు గాలులు
Image Credit : Asianet News

కోనసీమలో కుండపోత, భారీ ఈదురు గాలులు

కోనసీమ ప్రాంత ప్రజలకు అర్నబ్ దాటికి 1996 నాటి పెను తుపాను ఘోర జ్ఞాపకాలు మళ్లీ కళ్లముందు మెదిలాయి. పోలవరం, ఉప్పలగుప్తం, అల్లవరం, కాట్రేనికోన, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాలపై ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపింది. సాయంత్రం కాగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ప్రచండ గాలులు వీచడం ప్రారంభించాయి.

సముద్రం ఉగ్రరూపం దాల్చడంతో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు గోదావరి నదీ పాయల ద్వారా లోపలికి చొచ్చుకువచ్చాయి. మురుగునీటి కాలువలు పొంగిపొర్లుతున్నాయి. వందలాది కొబ్బరిచెట్లు, భారీ వృక్షాలు, హోర్డింగులు, ఇళ్ల పైకప్పులు గాలుల ధాటికి నేలమట్టమయ్యాయి. ఎప్పుడు ఏ విద్యుత్ స్తంభం విరిగిపడుతుందో అని జనాలు ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని గడుపుతున్నారు.

35
ఆక్వా, కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ
Image Credit : ai

ఆక్వా, కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ

తుపాను విరుచుకుపడటంతో ఏపీలోని తీరప్రాంత రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. రొయ్యల రైతుల ఆందోళన: కోనసీమ జిల్లాలో దాదాపు 10,800 ఎకరాల్లో రొయ్యల చెరువులు ఉండగా, పంట నష్టపోతామనే భయంతో ఆక్వా రైతులు ముందస్తుగా పట్టుబడులు పట్టారు. అయితే ఇదే ఆసరాగా భావించిన కొనుగోలుదారులు ధరలను తగ్గించడంతో కేజీకి రూ.30 నుంచి రూ.40 వరకు రైతులు కోల్పోవాల్సి వచ్చింది.

కొబ్బరి తోటలకు నష్టం: 1996 నాటి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కొబ్బరి రైతులు తోటల్లో బరువు తగ్గించేందుకు దింపులు తీయడం, రాశులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి ముందస్తు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ గాలుల తీవ్రతకు అనేక తోటలు నేలకూలాయి.

45
కోస్తాంధ్రలో అలర్ట్‌లు.. అస్తవ్యస్తంగా జనజీవనం
Image Credit : Asianet News

కోస్తాంధ్రలో అలర్ట్‌లు.. అస్తవ్యస్తంగా జనజీవనం

కాకినాడ, పశ్చిమ గోదావరి, ఉమ్మడి విశాఖ జిల్లాల్లో కుండపోత వర్షాల వల్ల రోడ్ల రవాణా దెబ్బతింది. కాకినాడ జిల్లా కాజులూరులో మౌలిక వసతులు, విద్యుత్ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయాయి. ఉప్పాడ బీచ్ రోడ్డు అలల ఉధృతికి ధ్వంసమైంది. పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున స్తంభాలు కూలిపోవడంతో చీకట్లు అలుముకున్నాయి.

విశాఖ, అనకాపల్లి, కాకినాడ, గోదావరి జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేశారు.

55
తెలంగాణకూ వ్యాపించిన అర్నబ్ తుపాను ఎఫెక్ట్
Image Credit : Gemini AI

తెలంగాణకూ వ్యాపించిన అర్నబ్ తుపాను ఎఫెక్ట్

ఆంధ్రప్రదేశ్ సరిహద్దు దాటిన ఈ తుపాను ప్రభావం తెలంగాణపైనా స్పష్టంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం అక్టోబరు 29న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముంది. హనుమకొండ, వరంగల్, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లోనూ ఈదురుగాలులతో కూడిన వర్ష సూచనలు ఉన్నాయి.

దీనికి తోడు తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గి చలి వణుకు పుట్టిస్తోంది. పటాన్‌చెరులో అత్యల్పంగా 13.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, వాగులు-వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు స్పష్టం చేశారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
విశాఖపట్నం
అమరావతి
విజయవాడ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
జగన్ ఇలాకాలో టీడీపీ ప్రభంజనం.. స్థానిక ఎన్నిక‌లో సైకిల్ పార్టీ హ‌వా
Recommended image2
Bats Village : తలకిందులుగా వేలాడే గబ్బిలాలను పూజించే వింత గ్రామం.. ఎక్కడుందో తెలుసా?
Recommended image3
ఆరోజు పులివెందులలోనే ఉంటా, చూసుకుందాం.. జగన్ మాస్ వార్నింగ్
Related Stories
Recommended image1
Stock Market: రూ.7 షేరుతో ఏడాదినాటికే కోటీశ్వరులయ్యారు.. రూ.1 లక్ష ఇన్వెస్ట్‌మెంట్‌ రూ.80 లక్షలైంది !
Recommended image2
Insurance: కేవలం 45 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. పూర్తి వివరాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved