MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Andhra Pradesh
  • మొంథా తుపాను అలర్ట్: కల్లోలంగా తీర ప్రాంతాలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

మొంథా తుపాను అలర్ట్: కల్లోలంగా తీర ప్రాంతాలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Cyclone Montha : మొంథా తుపాను ప్రభావంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు, గాలుల తీవ్రత ఉన్న ప్రాంతాల్లో రెస్క్యూ, పునరుద్ధరణ చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 28 2025, 05:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తుపాను పరిస్థితిపై ఆర్టీజీఎస్ నుంచి చంద్రబాబు, పవన్ సమీక్ష
Image Credit : Pixabay

తుపాను పరిస్థితిపై ఆర్టీజీఎస్ నుంచి చంద్రబాబు, పవన్ సమీక్ష

మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వర్షాల ప్రభావంతో ఆకస్మిక వరదలు, వాగులు పొంగే ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

మంగళవారం ఆర్టీజీఎస్ నుంచి మొంథా తుపాను ప్రభావంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గతంలో వచ్చిన తుపాన్ల నష్టాన్ని పరిశీలించి, అదే విధమైన తీవ్రమైన పరిణామాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తీరం దాటే అవకాశం ఉన్న కాకినాడలో అప్రమత్తం
Image Credit : X/AndhraPradeshCM

తీరం దాటే అవకాశం ఉన్న కాకినాడలో అప్రమత్తం

ప్రస్తుతం మొంథా తుపాను కోస్తా ఆంధ్ర తీరానికి అత్యంత సమీపంగా ఉందని, ఈ అర్ధరాత్రికి కాకినాడకు దక్షిణంగా తీరం దాటే అవకాశముందని అధికారులు నివేదించారు. కాకినాడ, మచిలీపట్నం, విశాఖ ప్రాంతాల్లో ఇప్పటికే గాలులు, వర్ష తీవ్రత ఎక్కువగా ఉందని వారు వివరించారు.

దీనిపై స్పందించిన సీఎం, తుపాను తీరం దాటే అవకాశం ఉన్న ప్రాంతాల్లో మరిన్ని రెస్క్యూ బృందాలను, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని ఆదేశించారు. అత్యవసర యంత్రసామాగ్రి, సమాచార వ్యవస్థలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.

35
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు
Image Credit : X/AndhraPradeshCM

వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు

రెండు రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే పరిస్థితులను అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. సచివాలయ వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయి సమాచారం సేకరించి విశ్లేషించాలని ఆయన సూచించారు.

గతంలో హుద్ హుద్ తుపాను సమయంలో తీసుకున్న చర్యలను గుర్తుచేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షాలు నమోదవడంతో ఎర్రకాలువ పరిసర ప్రాంతాల్లో అప్రమత్తం అవసరమని తెలిపారు.

45
నీట మునిగిన వేల హెక్టార్ల పంటలు.. డ్రోన్లతో నష్టం గుర్తింపు
Image Credit : X/AndhraPradeshCM

నీట మునిగిన వేల హెక్టార్ల పంటలు.. డ్రోన్లతో నష్టం గుర్తింపు

గడచిన 24 గంటల్లో విశాఖ, కోనసీమ, శ్రీకాకుళం, అనకాపల్లి, పశ్చిమగోదావరి, నెల్లూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయని అధికారులు వివరించారు. తుపాను ప్రభావిత జిల్లాల్లోని 1.92 కోట్ల మందికి వర్షాలపై హెచ్చరిక సందేశాలు పంపించామన్నారు.

2,703 జనరేటర్లు, 81 వైర్‌లెస్ కమ్యూనికేషన్ టవర్లు, యాప్ ద్వారా పర్యవేక్షణలో ఉన్న యంత్ర పరికరాలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. డ్రోన్ల ద్వారా ముంపు ప్రాంతాలు, చెట్లు, టవర్లు, హోర్డింగ్‌లు పడిపోయిన ప్రాంతాలను గుర్తించి వెంటనే పునరుద్ధరణ చేపట్టాలని సీఎం ఆదేశించారు.

వర్షాలతో 43 వేల హెక్టార్ల పంట నీట మునిగిందని అధికారులు తెలిపారు. కోనసీమ, ప్రకాశం, నంద్యాల, కడప, తూర్పు గోదావరి జిల్లాల్లో పంట నష్టాలు నమోదయ్యాయని చెప్పారు. రైతులు నష్టం వివరాలు యాప్ ద్వారా పంపేలా మార్పులు చేయాలని సీఎం సూచించారు.

55
ప్రజల రాకపోకలకు అంతరాయం రాకుండా చర్యలు
Image Credit : X/AndhraPradeshCM

ప్రజల రాకపోకలకు అంతరాయం రాకుండా చర్యలు

తుపాను కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు రోడ్లపై పడితే రాకపోకలకు ఇబ్బంది కలగవచ్చు. అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, క్షేత్రస్థాయి సిబ్బంది అందరూ ఫీల్డులో ఉన్నారని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

రాయలసీమలో వర్షాలు లేకపోవడంతో కృష్ణా నది ఎగువ ప్రవాహాల నీటితో చెరువులు నింపే ప్రక్రియ చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఒక్క టీఎంసీ నీరు కూడా వృథా కాకుండా చూసుకోవాలని సూచించారు.

ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు అనిత, నారాయణ, అనగాని సత్యప్రసాద్, సీఎస్ కె. విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తదితర అధికారులు హాజరయ్యారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
వాతావరణం
అమరావతి
విజయవాడ
విశాఖపట్నం
నారా చంద్రబాబు నాయుడు
నారా లోకేష్
పవన్ కళ్యాణ్
హైదరాబాద్
తెలంగాణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
కుప్పం ఋణం తీర్చుకుంటున్న బాబు | Chandrababu Kuppam Tour | Asianet News Telugu
Recommended image2
Now Playing
మా 90's కిడ్స్ కి చంద్రబాబు అంటే ఒక ఎమోషన్ | Chandrababu fan moment | Asianet News Telugu
Recommended image3
Now Playing
అవును వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు | YS Sharmila Meets YS Jagan | Asianet News Telugu
Related Stories
Recommended image1
మొంథా తుపాను ఉగ్రరూపం : అతిభారీ వర్షాలు.. ఏపీలో అలర్ట్ ! ట్రైన్స్, ఫ్లైట్స్ రద్దు
Recommended image2
దూసుకొస్తున్న మొంథా తుపాను .. వర్ష బీభత్సం.. బయటకు రావొద్దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved