MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Andhra Pradesh
  • దూసుకొస్తున్న మొంథా తుపాను .. వర్ష బీభత్సం.. బయటకు రావొద్దు

దూసుకొస్తున్న మొంథా తుపాను .. వర్ష బీభత్సం.. బయటకు రావొద్దు

Montha cyclone : మొంథా తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా కదులుతోంది. కోనసీమ, కాకినాడ జిల్లాల్లో 12,135 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 28 2025, 04:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మొంథా తుపాను: కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
Image Credit : X

మొంథా తుపాను: కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్రమైన తుపానుగా కొనసాగుతోంది. వేగంగా తీరంవైపు దూసుకొస్తోంది. గడిచిన గంటలో తుపాన్ 10 కి.మీ వేగంతో ముందుకు కదిలింది. ప్రస్తుతం తుపాను మచిలీపట్నంకు 100 కి.మీ, కాకినాడకు 180 కి.మీ, విశాఖపట్ననానికి 270 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

తీరానికి మరింత దగ్గరపడే కొద్దీ తుపాను ప్రభావం పెరుగుతుందని అధికారులు తెలిపారు. కోస్తా జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరందాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు హెచ్చరించారు. ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కోనసీమలో అత్యవసర సమీక్ష
Image Credit : X and Getty

కోనసీమలో అత్యవసర సమీక్ష

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తీర ప్రాంతాల వద్ద మంగళవారం రాత్రికి మొంథా తుపాను తీరం దాటే అవకాశాలు ఉన్నాయని జిల్లాలో తుపాను సహాయక చర్యల ప్రత్యేక అధికారి వి. విజయ రామరాజు తెలిపారు.

జిల్లా కలెక్టరేట్‌ నుండి గ్రామ సచివాలయం వరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పునరావాస చర్యల పురోగతిని సమీక్షించారు. సముద్ర తీరానికి ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న కచ్చా గృహాలలో నివసించే ప్రజలను తప్పనిసరిగా పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. పోలీసుల సహకారంతో త్వరగా తరలింపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

35
పునరావాస కేంద్రాలు, అత్యవసర వసతులు
Image Credit : X/@Indiametdept

పునరావాస కేంద్రాలు, అత్యవసర వసతులు

పునరావాస కేంద్రాల్లో అవసరమైన వసతులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నాణ్యమైన ఆహారం, సురక్షిత త్రాగు నీరు, మందుల సరఫరాతో మెడికల్ క్యాంపులు, శుభ్రత చర్యలు వంటివి సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

తుపాను ప్రభావం నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తీరాన్ని దాటే సమయానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు.

45
కాకినాడ జిల్లాలో విస్తృత తరలింపు, రక్షణ చర్యలు
Image Credit : Perplexity AI

కాకినాడ జిల్లాలో విస్తృత తరలింపు, రక్షణ చర్యలు

కాకినాడ జిల్లాలో తీర, లోతట్టు ప్రాంతాల నుంచి మొత్తం 12,135 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. జిల్లాలో 401 కేంద్రాలను గుర్తించగా, ఇప్పటివరకు 76 కేంద్రాలు ప్రారంభించారు. త్రాగునీటి కోసం 24 ట్యాంకర్లు, ఆహార సరఫరాకు 191 మంది సిబ్బంది, పాల సరఫరాకు సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. 21,513 ఆహార పొట్లాలు, 1313 వాటర్ క్యాన్లు పంపిణీ చేశారు.

గర్భిణులు 95 మంది, బాలింతలు 1400 మందిని 52 ఆసుపత్రులకు తరలించారు. 14,499 మంది విద్యార్థులను హాస్టళ్ల నుంచి ఇళ్లకు పంపించారు. బోట్లన్నిటినీ తీరానికి రప్పించారు. 4,573 బోట్లను క్రీక్‌లలో భద్రపరిచారు.

55
అత్యవసర బలగాలతో సమన్వయంతో విపత్తు నిర్వహణ చర్యలు
Image Credit : PTI

అత్యవసర బలగాలతో సమన్వయంతో విపత్తు నిర్వహణ చర్యలు

జిల్లాకు రెండు NDRF బృందాలు (30+24), ఒక SDRF బృందం (50 మంది) చేరాయి. గజ ఈతగాళ్లు 200 మంది, 40 బోట్లు సిద్ధంగా ఉన్నాయి. కాకినాడ అర్బన్, పిఠాపురం, తాళ్లరేవులలో హెలిపాడ్లు సిద్ధం చేశారు. 259 మెడికల్ క్యాంపులు, 185 మంది వైద్యులు, 1710 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. 108 ఆంబులెన్సులు 23 సిద్ధంగా ఉన్నాయి. 104 వాహనాలు 35, వీటికి తోడుగా 102 వాహనాలు 22 సిద్ధంగా ఉన్నాయి.

మొత్తం 9901 పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. మౌలిక వసతుల పునరుద్ధరణకు భారీ యంత్రాలు, విద్యుత్ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ప్రజలు కంట్రోల్ రూమ్‌లను సంప్రదించి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు
నారా లోకేష్
పవన్ కళ్యాణ్
అమరావతి
విశాఖపట్నం
విజయవాడ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
కుప్పం ఋణం తీర్చుకుంటున్న బాబు | Chandrababu Kuppam Tour | Asianet News Telugu
Recommended image2
Now Playing
మా 90's కిడ్స్ కి చంద్రబాబు అంటే ఒక ఎమోషన్ | Chandrababu fan moment | Asianet News Telugu
Recommended image3
Now Playing
అవును వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు | YS Sharmila Meets YS Jagan | Asianet News Telugu
Related Stories
Recommended image1
మొంథా తుపాను ఉగ్రరూపం : అతిభారీ వర్షాలు.. ఏపీలో అలర్ట్ ! ట్రైన్స్, ఫ్లైట్స్ రద్దు
Recommended image2
7 నెలల గర్భిణీ.. 145 కిలోల బరువు ఎత్తి మెడల్ గెలిచింది !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved