MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. దూసుకొస్తున్న మరో తుపాను.. భారీ వర్షాల అలర్ట్

Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. దూసుకొస్తున్న మరో తుపాను.. భారీ వర్షాల అలర్ట్

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మురసు తుపాను ధాటికి కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఇదిలా వుండగా, బంగాళాఖాతంలో నవంబర్ 15 తర్వాత మరో తీవ్ర తుపాను రానున్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాలకు అలర్ట్ ప్రకటించింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 05 2026, 09:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మళ్ళీ తుపాను ముప్పు.. ఏపీ, తెలంగాణలో కుండపోత వర్షాలు: రెడ్ అలర్ట్ జారీ
Image Credit : chatgpt

మళ్ళీ తుపాను ముప్పు.. ఏపీ, తెలంగాణలో కుండపోత వర్షాలు: రెడ్ అలర్ట్ జారీ

తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్ వచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న మురసు తుపాను సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోకముందే, మరోపక్క బంగాళాఖాతంలో ఇంకో కొత్త తుపాను రాబోతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాలకు కలెక్టర్లు రెడ్, ఆరెంజ్ అలర్టులు ప్రకటించారు. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మురసు తుపానుతో ఏపీలో వీడని వర్షాలు
Image Credit : Gemini

మురసు తుపానుతో ఏపీలో వీడని వర్షాలు

మురసు తుపాను కాస్త బలహీనపడి అల్పపీడనంగా మారుతున్నా, దాని ప్రభావం మాత్రం తగ్గలేదు. వారం వ్యవధిలోనే రెండు తుపాన్లు ఏపీని తాకడంతో రాష్ట్రంలో చేతికొచ్చిన పంటలన్నీ నీటమునిగి రైతన్నలు తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షాలు ఏపీ తీరాన్ని దంచికొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలోని పలు ప్రాంతాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.

• రెడ్ అలర్ట్ (అత్యంత భారీ వర్షాలు): అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

• ఆరెంజ్ అలర్ట్ (భారీ నుంచి అతి భారీ వర్షాలు): అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో డేంజర్ సిగ్నల్ నడుస్తోంది.

• ఎల్లో అలర్ట్: పశ్చిమ గోదావరితో పాటు మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

36
తెలంగాణలోనూ వర్షాలు.. ఖమ్మం, కొత్తగూడెంకు అలర్ట్
Image Credit : Gemini

తెలంగాణలోనూ వర్షాలు.. ఖమ్మం, కొత్తగూడెంకు అలర్ట్

తెలంగాణలోనూ వర్షాల ప్రభావం గట్టిగానే ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాను వర్షాలు కమ్మేశాయి. పక్క రాష్ట్రమైన ఏపీతో పాటు కోస్తా ప్రాంతాలకు ఆనుకుని ఉన్న తెలంగాణ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల ఏలూరు వైపు వరద ఉధృతి పెరిగింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణలోని పలు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది.

• భద్రాద్రి కొత్తగూడెం (రెడ్ అలర్ట్): గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే ఈదురుగాలులతో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• ఖమ్మం (ఆరెంజ్ అలర్ట్): భారీ వర్ష సూచనతో కలెక్టరేట్లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

• ఇతర జిల్లాలు: ములుగు, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి జిల్లాల్లో కూడా తేలికపాటి నుండి మోస్తరు లేదా భారీ వర్షాలు పడొచ్చని హెచ్చరించారు.

46
హైదరాబాద్ వాతావరణం ఎలా వుంది?
Image Credit : Google AI

హైదరాబాద్ వాతావరణం ఎలా వుంది?

హైదరాబాద్ వాసులు వర్షాల గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ‘తెలంగాణ వెదర్‌మ్యాన్’ వెల్లడించారు. మురసు తుపాను మిగిల్చిన తేమ వల్ల దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అంటే నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్ లలో మధ్యాహ్నం నుంచి రాత్రి లోపు ఉరుములతో కూడిన చిన్నపాటి జల్లులు పడవచ్చు.

గ్రేటర్ హైదరాబాద్‌లో మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగానే ఉంటుంది. రాత్రి వేళల్లో అక్కడక్కడా చెదురుమదురుగా తేలికపాటి చనుకులు పడనున్నాయి.

56
నవంబర్ 15 తర్వాత బంగాళాఖాతంలో మరో తీవ్ర తుపాను
Image Credit : Gemini

నవంబర్ 15 తర్వాత బంగాళాఖాతంలో మరో తీవ్ర తుపాను

నవంబర్ 12 తర్వాత దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఇస్రో వాతావరణ నిపుణుడు అంచనా వేశారు. అంతేకాకుండా, నవంబర్ 15 తర్వాత బంగాళాఖాతంలో మరొక ఉపరితల ఆవర్తనం బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది.

ఈ తుపాను తీవ్రత వల్ల ఏపీలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమ, తమిళనాడు ఉత్తర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. దీని ఖచ్చితమైన తీరం దాటే ప్రదేశం, ద్రోణి తీవ్రతపై మరో 3-4 రోజుల్లో స్పష్టత రానుంది.

66
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Image Credit : Gemini

ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

రాబోయే రోజుల్లో తుపాన్ల సిరీస్ కొనసాగనున్నందున తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అలర్ట్‌గా ఉండాలని అధికారులు ఆదేశించారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నందున లోతట్టు ప్రాంత ప్రజలు కంట్రోల్ రూమ్‌లను సంప్రదించాలి. శిథిలావస్థలో ఉన్న భవనాలు, చెట్ల కింద నిలబడకూడదు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
తిరుపతి
విశాఖపట్నం
అమరావతి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
MPTC ZPTC Elections: ఈ జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు బంద్.. ఎందుకంటే?
Recommended image2
MPTC ZPTC Elections 2026: ఏపీ స్థానిక పోరు స్టార్ట్.. క్యూలైన్లలో 2.61 కోట్ల మంది.. ఆ జిల్లాల్లో మాత్రం ట్విస్ట్
Recommended image3
Now Playing
నెల్లూరు మేయర్ గా భారీ విజయం సాధించిన రూప్ కుమార్ యాదవ్ | Roop Kumar Yadav Wins Big as Nellore Mayor
Related Stories
Recommended image1
MPTC ZPTC Elections 2026: ఏపీ స్థానిక పోరు స్టార్ట్.. క్యూలైన్లలో 2.61 కోట్ల మంది.. ఆ జిల్లాల్లో మాత్రం ట్విస్ట్
Recommended image2
MPTC ZPTC Elections: ఈ జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు బంద్.. ఎందుకంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved