MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • MPTC ZPTC Elections 2026: ఏపీ స్థానిక పోరు స్టార్ట్.. క్యూలైన్లలో 2.61 కోట్ల మంది.. ఆ జిల్లాల్లో మాత్రం ట్విస్ట్

MPTC ZPTC Elections 2026: ఏపీ స్థానిక పోరు స్టార్ట్.. క్యూలైన్లలో 2.61 కోట్ల మంది.. ఆ జిల్లాల్లో మాత్రం ట్విస్ట్

AP MPTC ZPTC Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. వర్షాల నడుమనే ఈ పోలింగ్ మొదలైంది. అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వీటిలో పాటు ఏకగ్రీవాలు, వాయిదా పడిన ప్రాంతాల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 05 2026, 07:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏపీలో నేడే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్.. భారీ భద్రత నడుమ మొదలైన ఓటింగ్
Image Credit : chatgpt

ఏపీలో నేడే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్.. భారీ భద్రత నడుమ మొదలైన ఓటింగ్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి శిఖరాగ్రానికి చేరింది. గ్రామీణ ప్రాంతాలపై తమ పట్టు నిరూపించుకునేందుకు రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటల నుంచే ఎంతో ఉత్సాహంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయం నుంచే క్యూలైన్లలో నిలబడుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
2.61 కోట్ల మంది ఓటర్లు.. బరిలో 21,012 మంది అభ్యర్థులు
Image Credit : chatgpt

2.61 కోట్ల మంది ఓటర్లు.. బరిలో 21,012 మంది అభ్యర్థులు

ఈ స్థానిక పోరులో ఏకంగా 2.61 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో భద్రపరచనున్నారు. మొత్తం ఓటర్లలో 1.28 కోట్ల మంది పురుషులు, 1.32 కోట్ల మంది మహిళలు కాగా, 1,282 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. విశేషమేమిటంటే ఈ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది.

మొత్తం 582 జెడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు నిర్వహించాల్సిన ఈ పోలింగ్‌లో ఇప్పటికే పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు నమోదయ్యాయి. 77 జెడ్పీటీసీ స్థానాలు, 2,051 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో, మిగిలిన స్థానాలకే ప్రస్తుతం ఓటింగ్ జరుగుతోంది. నామినేషన్ల ఉపసంహరణ ముగిసేసరికి మొత్తం 2,128 స్థానాలు ఏకగ్రీవమయినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఇప్పుడు బరిలో నిలిచిన 21,012 మంది అభ్యర్థుల (జెడ్పీటీసీ నుంచి 2,169 మంది, ఎంపీటీసీ నుంచి 18,843 మంది) భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు.

35
వర్షాల ప్రభావం: ఆ జిల్లాల్లో పోలింగ్ వాయిదా
Image Credit : Getty

వర్షాల ప్రభావం: ఆ జిల్లాల్లో పోలింగ్ వాయిదా

మరోవైపు రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, తుపాను వాతావరణం కారణంగా ఎన్నికల నిర్వహణపై మొదట కొంత ఆందోళన వ్యక్తమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) అనిల్ చంద్ర పునేఠా జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మెజారిటీ జిల్లాల్లో యథావిధిగా గురువారమే ఎన్నికలు జరపాలని నిర్ణయించారు.

అయితే, భారీ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఐదు మండలాల్లో పూర్తిగా, మరో మండలంలో రెండు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఈ ప్రాంతాల్లో గురువారానికి బదులుగా శుక్రవారం పోలింగ్ నిర్వహించి, శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అంతేకాకుండా వైఎస్సార్ కడప జిల్లాలోని సుగుమంచిపల్లి, కొండాపురం ఎంపీటీసీ స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడం, నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని కృష్ణగిరి ఎంపీటీసీ స్థానంలో దాఖలైన నామినేషన్లన్నీ తిరస్కరణకు గురవ్వడంతో అక్కడ పోలింగ్ జరగడం లేదు.

45
40 వేల మందికి పైగా పోలీసులతో ఊహించని భద్రత
Image Credit : X/AP_CRDANews

40 వేల మందికి పైగా పోలీసులతో ఊహించని భద్రత

గతంలో నామినేషన్లు, పోలింగ్ సమయంలో జరిగిన ఘర్షణలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎస్‌ఈసీ, పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఐజీ రాజకుమారి పర్యవేక్షణలో సుమారు 40,679 మంది పోలీసు సిబ్బంది రంగంలోకి దిగారు.

రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 31,460 పోలింగ్ కేంద్రాలలో 8,904 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా, 7,160 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. రాయలసీమలోని సున్నిత ప్రాంతాల్లో 111 ఏపీఎస్పీ (APSP) ప్లటూన్లను ప్రత్యేకంగా మోహరించారు. గొడవలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలు, బాడీ కెమెరాలతో నిఘా పెట్టారు. 16,064 కేంద్రాల్లో సీసీటీవీలు, 6,000 చోట్ల ల్యాప్‌టాప్‌ల ద్వారా వెబ్‌కాస్టింగ్, 6,507 కేంద్రాల్లో ప్రత్యక్ష వీడియోగ్రఫీ నిర్వహిస్తున్నారు. అక్రమాలకు పాల్పడితే వె వెంటనే ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్ అక్కడకు చేరుకుంటుంది. ఇప్పటికే ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై 330 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, 100 మందిని అరెస్ట్ చేశారు.

55
పక్కా ప్లానింగ్ తో సిబ్బంది.. నవంబర్ 7న కౌంటింగ్
Image Credit : Getty

పక్కా ప్లానింగ్ తో సిబ్బంది.. నవంబర్ 7న కౌంటింగ్

ఎన్నికల ప్రక్రియ కోసం 2.52 లక్షల మంది ఉద్యోగులు, 36,684 మంది ప్రిసైడింగ్ అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. సామగ్రిని తరలించడానికి 4,442 భారీ వాహనాలు, 3,200 తేలికపాటి వాహనాలను ఉపయోగించారు. ఓటింగ్ కోసం 1,01,618 బ్యాలెట్ బాక్సులను అందుబాటులోకి తెచ్చారు.

పోలింగ్ పూర్తి కాగానే బ్యాలెట్ పెట్టెలను భద్రపరిచి, ఈ నెల 7వ తేదీన (శనివారం) ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇందుకోసం 365 కౌంటింగ్ కేంద్రాలలో 9,062 టేబుళ్లను సిద్ధం చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఎవరి వైపు ఉన్నారో తేల్చే ఈ సమరంలో విజేత ఎవరో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
తిరుపతి
విశాఖపట్నం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
నెల్లూరు మేయర్ గా భారీ విజయం సాధించిన రూప్ కుమార్ యాదవ్ | Roop Kumar Yadav Wins Big as Nellore Mayor
Recommended image2
Pawan Kalyan : పవన్ 100% స్ట్రైక్ రేట్ ఫామ్ కంటిన్యూ.. జనసేన గెలిచిన స్థానాలివే, విజేతలు వీళ్లే
Recommended image3
School Holidays: ఏపీకి భారీ వర్షాల హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
Related Stories
Recommended image1
Drinking Water Before Brushing: ఉదయం బ్రష్‌ చేయకుండా నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?
Recommended image2
US Midterm Election: ట్రంప్‌కు షాక్ ఇచ్చిన ఓటర్లు.. అసలు కారణం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved