- Home
- Andhra Pradesh
- AP Inter Exam Timetable : ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 23 నుంచి ఎగ్జామ్స్
AP Inter Exam Timetable : ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 23 నుంచి ఎగ్జామ్స్
AP Inter Exam Timetable: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు 2026 ఫిబ్రవరి-మార్చి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి, సెకండ్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి జరుగనున్నాయి.

ఫిబ్రవరి 23 నుంచి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు 2026 సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 23న (సోమవారం) ప్రారంభమవుతాయి. సెకండ్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 24న (మంగళవారం) మొదలవుతాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒకే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు జరుగుతాయి.
ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ టైమ్‌టేబుల్
ఫిబ్రవరి 23న ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మొదటి పేపర్‌గా తెలుగు, సంస్కృతం, ఉర్దూ, హిందీ, తమిళం, ఒరియా, కన్నడ, అరబిక్, ఫ్రెంచ్, పర్షియన్ లాంగ్వేజ్ పేపర్-1 పరీక్ష జరుగుతుంది. ఫిబ్రవరి 25న ఇంగ్లీష్ పేపర్-1, మార్చి 2న మ్యాథ్స్ పేపర్-1, మార్చి 5న బయాలజీ పేపర్-1, మార్చి 10న ఫిజిక్స్ పేపర్-1, మార్చి 17న కెమిస్ట్రీ పేపర్-1 వంటి ప్రధాన పరీక్షలు జరుగుతాయి.
ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ టైమ్‌టేబుల్
ఫిబ్రవరి 24న రెండో భాష పేపర్-2తో సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 26న ఇంగ్లీష్ పేపర్-2, ఫిబ్రవరి 28న బోటనీ/హిస్టరీ పేపర్-2, మార్చి 3న మ్యాథ్స్ పేపర్-2A, మార్చి 6న జూవాలజీ/ఎకనామిక్స్ పేపర్-2, మార్చి 11న కామర్స్/సోషియాలజీ/ఫైన్ ఆర్ట్స్ పేపర్-2, మార్చి 18న కెమిస్ట్రీ పేపర్-2 జరగనున్నాయి.
ఏపీ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్, ప్రత్యేక పరీక్షలు
ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 10 వరకు రెండు సెషన్లలో (ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు) జరుగుతాయి. వొకేషనల్ కోర్సుల ప్రాక్టికల్స్ జనవరి 27 నుండి ఫిబ్రవరి 10 వరకు నిర్వహిస్తారు.
జనవరి 21న Ethics and Human Values పరీక్ష, జనవరి 23న Environmental Education పరీక్షలు జరుగుతాయి.
ఏపీ ఇంటర్ షెడ్యూల్.. హాల్ టికెట్లు, బోర్డు సూచనలు
హాల్ టికెట్లు ఫిబ్రవరి రెండో వారంలో అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థులు బోర్డు వెబ్‌సైట్ నుండి వాటిని డౌన్‌లోడ్ చేసుకోవాలి. పరీక్షా కేంద్రంలో హాల్ టికెట్ తప్పనిసరి. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా హాలులో అనుమతించబడవని అధికారులు స్పష్టం చేశారు.