MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • KL Rahul: 9 ఏళ్ల తర్వాత సెంచరీ.. కోహ్లీ, గంభీర్ రికార్డులు బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్

KL Rahul: 9 ఏళ్ల తర్వాత సెంచరీ.. కోహ్లీ, గంభీర్ రికార్డులు బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్

KL Rahul: వెస్టిండీస్ పై భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆటతో సెంచరీ సాధించాడు. 9 ఏళ్ల తర్వాత భారత్ లో సెంచరీ కొట్టడంతో పాటు విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ రికార్డులను బద్దలు కొట్టాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 03 2025, 04:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ నాక్
Image Credit : X/BCCI

కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ నాక్

అహ్మదాబాద్‌లో జరుగుతున్న భారత్-వెస్టిండీస్ తొలి టెస్ట్‌లో భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. సెంచరీ నాక్ తో మరో ఘనత సాధించాడు. 32 ఏళ్ల రాహుల్ 9 ఏళ్ల తర్వాత భారత్‌లో టెస్ట్ సెంచరీ సాధించాడు. 

రెండో రోజు మార్నింగ్ సెషన్‌లో 190 బంతుల్లో 12 బౌండరీలతో అతను సెంచరీ పూర్తి చేశాడు. దీంతో ఆయన 3211 రోజుల తర్వాత దేశవాళీ మైదానాల్లో సెంచరీ నమోదు చేశాడు. మంచి షాట్స్ తో ఆకట్టుకున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రోహిత్-గంభీర్ రికార్డులను బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్
Image Credit : @CricCrazyJohns/X

రోహిత్-గంభీర్ రికార్డులను బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్

కేఎల్ రాహుల్ 197 బంతుల్లో సెంచరీ (100 పరుగులు) సాధించాడు. ఓపెనర్‌గా ఇది ఆయన 10వ టెస్ట్ సెంచరీ. దీంతో రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ (9 సెంచరీలు) రికార్డులను బద్దలు కొట్టాడు. ఇప్పుడు భారత్ తరఫున టెస్ట్ ఓపెనర్లలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్ రోహిత్, గంభీర్ లను దాటేసి నాలుగో స్థానంలో నిలిచాడు.

ఓపెనర్లుగా టెస్ట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన భారత ప్లేయర్లు

• 33 – సునీల్ గవాస్కర్

• 22 – వీరేంద్ర సెహ్వాగ్

• 12 – మురళీ విజయ్

• 10 – కేఎల్ రాహుల్

• 9 – రోహిత్ శర్మ

• 9 – గౌతమ్ గంభీర్

36
విరాట్ కోహ్లీని అధిగమించిన కేఎల్ రాహుల్
Image Credit : X/Tanuj

విరాట్ కోహ్లీని అధిగమించిన కేఎల్ రాహుల్

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఇది కేఎల్ రాహుల్‌కు ఆరో సెంచరీ కావడం విశేషం. దీంతో ఆయన విరాట్ కోహ్లీ 5 సెంచరీ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్‌లతో సమానంగా 6 సెంచరీలు సాధించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ తలా 9 సెంచరీలతో టాప్ లో ఉన్నారు.

WTCలో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్లు

• 9 – రోహిత్ శర్మ

• 9 – శుభ్‌మన్ గిల్

• 6 – రిషభ్ పంత్

• 6 – యశస్వి జైస్వాల్

• 6 – కేఎల్ రాహుల్

• 5 – విరాట్ కోహ్లీ

• 4 – మయాంక్ అగర్వాల్

• 5 – రవీంద్ర జడేజా

46
26వసారి 50+ స్కోరు సాధించిన కేఎల్ రాహుల్
Image Credit : ANI

26వసారి 50+ స్కోరు సాధించిన కేఎల్ రాహుల్

కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా 26వసారి టెస్ట్‌లో 50 ప్లస్ స్కోరును నమోదు చేశాడు. దీంతో ఆయన భారత్ తరఫున ఓపెనర్‌గా అత్యధిక 50+ ఇన్నింగ్స్ ఆడిన జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నాడు.

భారత ఓపెనర్లు టెస్ట్‌లో 50+ ఇన్నింగ్స్ లు

• 75 – సునీల్ గవాస్కర్

• 51 – వీరేంద్ర సెహ్వాగ్

• 31 – గౌతమ్ గంభీర్

• 27 – మురళీ విజయ్

• 26 – కేఎల్ రాహుల్

56
నిప్పిల్ సెలబ్రేషన్ తో అదరగొట్టిన కేల్ రాహుల్
Image Credit : X/@BCCI

నిప్పిల్ సెలబ్రేషన్ తో అదరగొట్టిన కేల్ రాహుల్

కేఎల్ రాహుల్ తన సెంచరీ పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. హెల్మెట్ తీసి డ్రెస్‌రూమ్ వైపు బ్యాట్ ఎత్తి చూపాడు. అనంతరం రెండు వేళ్లను నోటిలో పెట్టుకున్నాడు. ఆయనకు ఇటీవల పుట్టిన కుమార్తె ఇవారాకు అంకితం చేసినట్లు భావిస్తున్నారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో “నిప్పిల్ సెలబ్రేషన్” పేరుతో వైరల్ అవుతోంది. 

66
2016 తర్వాత తొలి హోం సెంచరీ కొట్టిన కేఎల్ రాహుల్
Image Credit : Getty

2016 తర్వాత తొలి హోం సెంచరీ కొట్టిన కేఎల్ రాహుల్

కేఎల్ రాహుల్ చివరిసారిగా భారత్‌లో టెస్ట్ సెంచరీని 2016 డిసెంబర్‌లో ఇంగ్లాండ్‌పై సాధించాడు. ఆ టెస్ట్‌లో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీతో కూడా దుమ్మురేపాడు. దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత రాహుల్ తన సెంచరీల ఖాతా మళ్లీ తెరిచాడు. ప్రస్తుత సీజన్‌లో ఆయన అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అంతకుముందు ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో 532 పరుగులు చేయగా, అందులో రెండు సెంచరీలు సాధించాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
శుభ్‌మన్ గిల్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Recommended image2
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image3
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Related Stories
Recommended image1
Womens World cup: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ముందు మ‌రో వివాదం.. ఆజాద్ క‌శ్మీర్ వ్యాఖ్య‌ల‌తో రాచుకున్న నిప్పు
Recommended image2
Womens World cup: చిత్తుగా ఓడిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ చేతిలో ఘోర పరాజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved