- Home
- Andhra Pradesh
- Andhra Pradesh Jobs : నిరుద్యోగ యువతా రెడీగా ఉండండి.... ఈ శాఖలో ఉద్యోగాల భర్తీకి సర్వం సిద్దం
Andhra Pradesh Jobs : నిరుద్యోగ యువతా రెడీగా ఉండండి.... ఈ శాఖలో ఉద్యోగాల భర్తీకి సర్వం సిద్దం
నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈమేరకు స్వయంగా వైద్యారోగ్య శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. ఏ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారంటే…

నిరుద్యోగ యువతా... రెడీగా ఉండండి
Jobs Notification in Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యింది. ఆయుష్ విభాగంలో ఖాళీగా ఉన్న డాక్టర్, ఇతర సహాయక పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వ అనుమతి లభించింది. ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ద్వారా త్వరలోనే నియామక ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సర్కార్ స్పష్టం చేస్తోంది.
KNOW
వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ
స్వయంగా ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆయుష్ విభాగంలో ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేశారు. మొత్తం 358 పోస్టులను భర్తీ చేయనున్నట్లు... త్వరలోనే ఈ పోస్టుల నియామక ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలతో నోటిఫికేషన్ విడుదలవుతుందని మంత్రి తెలిపారు. అయితే ఈ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన కాకుండా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్దతితో చేపట్టనున్నారు.
భర్తీచేయనున్న పోస్టులివే
ఆయుష్ డాక్టర్లు - 71
సైకాలజిస్టులు - 3
పంచకర్మ థెరపిస్టులు - 90
జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్లు - 26
మిగతావి ల్యాబ్ టెక్నిషియన్స్, సహాయక పోస్టులు
ఇప్పటికే ఈ పోస్టుల భర్తీకి అనుమతులన్నీ లభించాయి. త్వరలోనే నోటిఫికేషన్ విడుదలచేయనున్నారు... అందులోనే అర్హతలు, వయో పరిమితి, దరఖాస్తు, ఎంపిక విధానం, సాలరీ తదితర వివరాలను పొందుపర్చనున్నారు. ఆయుష్ విభాగాన్ని మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకే ఈ నియామక ప్రక్రియ చేపడుతున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
భారీగా టీచర్ పోస్టుల భర్తీ
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. ముఖ్యంగా విద్యాశాఖలో ఏకంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి చేపట్టింది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలై రాతపరీక్ష కూడా ముగిసింది. ఆగస్ట్ సెకండ్ వీక్ లో ఫలితాలు వస్తాయని అభ్యర్థులు భావిస్తున్నారు.
ఏపీలో ఉద్యోగాాలే ఉద్యోగాలు
ఇక పోలీస్, అటవీ శాఖలో కూడా ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారు. అలాగే వివిధ గ్రూప్స్ పరీక్షల ద్వారా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ చేపడుతోంది కూటమి సర్కార్. ఇలా పర్మనెంట్ ఉద్యోగాలతో పాటు కాంట్రాక్ట్ పద్దతిలో కూడా భారీగా ఉద్యోగులను నియమించుకుంటున్నారు. కాబట్టి నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని కొంచెం కష్టపడితే ఉద్యోగాలను సాధించవచ్చు.