MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2 కొత్త ఎయిర్‌పోర్టులు.. ఈ ప్రాంతం ప్ర‌జ‌ల పంట పండిన‌ట్లే

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2 కొత్త ఎయిర్‌పోర్టులు.. ఈ ప్రాంతం ప్ర‌జ‌ల పంట పండిన‌ట్లే

Andhra pradesh: ఏపీలో విమానయాన రంగాన్ని విస్తరించే దిశగా మరో ముందడుగు పడింది. రెండు ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ నుంచి కీలక అనుమతులు లభించాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు.

3 Min read
Author : Narender Vaitla
Published : Oct 15 2026, 02:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాలకు కీలక అనుమతులు
Image Credit : Gemini AI

కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాలకు కీలక అనుమతులు

రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు ముందుకు సాగుతున్నాయి. కుప్పం, శ్రీకాకుళంలో విమానాశ్రయాల నిర్మాణానికి సంబంధించి కేంద్రం సైట్ క్లియరెన్స్ సర్టిఫికెట్లను మంజూరు చేసింది. ఈ అనుమతులతో పాటు డీపీఆర్‌ల తయారీకి కూడా మార్గం సుగమమైంది. ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలు, నిర్మాణ వ్యయం, మౌలిక సదుపాయాలు, ఇతర సాంకేతిక అంశాలను డీపీఆర్‌లలో పొందుపరచనున్నారు.

ఈ రెండు విమానాశ్రయాలకు అనుమతుల కోసం ఏపీఏడీసీఎల్‌ దశలవారీగా దరఖాస్తులు సమర్పించింది. శ్రీకాకుళం ప్రాజెక్టుకు మే 6న, కుప్పం విమానాశ్రయానికి జూన్ 15న దరఖాస్తు చేసినట్లు అధికారులు తెలిపారు. మూడు, నాలుగు నెలల వ్యవధిలోనే అనుమతులు లభించడంతో తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. డీపీఆర్‌ల తయారీకి సంబంధించిన టెండర్లు పిలిచి, ప్రాజెక్టులను తదుపరి దశకు తీసుకెళ్లాలని యోచిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పర్యావరణం, విమాన భద్రతకు ప్రాధాన్యం
Image Credit : Asianet News

పర్యావరణం, విమాన భద్రతకు ప్రాధాన్యం

కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. రక్షణ మంత్రిత్వశాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సహా సంబంధిత సంస్థల మార్గదర్శకాలకు అనుగుణంగా అవసరమైన అనుమతులు పొందాల్సి ఉంటుంది. అవసరమైన సందర్భాల్లో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) కూడా తీసుకోవాలి.

విమానాశ్రయాల పరిసరాల్లో ఇప్పటికే ఉన్న పౌర విమానాశ్రయాలపై కొత్త ప్రాజెక్టుల ప్రభావాన్ని అంచనా వేయడం కూడా కీలక నిబంధనల్లో ఒకటి. ప్రతిపాదిత విమానాశ్రయాల నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న సివిలియన్ ఎయిర్‌పోర్టులపై థర్డ్ పార్టీ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ రిపోర్టు సమర్పించాలని కేంద్రం సూచించింది. అలాగే కర్బన ఉద్గారాలను తగ్గించి నెట్ జీరో లక్ష్యానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ఈ వివరాలను డీపీఆర్‌తో పాటు విమానాశ్రయ మాస్టర్ ప్లాన్‌లో చేర్చాల్సి ఉంటుంది.

35
కుప్పం విమానాశ్రయానికి రూ.734 కోట్లు..
Image Credit : X

కుప్పం విమానాశ్రయానికి రూ.734 కోట్లు..

చిత్తూరు జిల్లాలోని కుప్పం ప్రాంతంలో 1,788 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఇప్పటికే 1,300 ఎకరాల భూమిని సేకరించినట్లు సమాచారం. ప్రాజెక్టు తొలి దశలో మూలధన వ్యయం (క్యాపెక్స్) కింద రూ.734 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు.

కుప్పం విమానాశ్రయ నిర్వహణ, ఆర్థిక సాధ్యాసాధ్యాలను మెరుగుపరిచే దిశగా బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంతో దీన్ని బండ్లింగ్ చేసే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ప్రతిపాదనపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బండ్లింగ్ విధానంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ విమానాశ్రయాలను ఒకే నిర్వహణ లేదా లీజు ప్రణాళిక కింద అనుసంధానిస్తారు. దీనివల్ల విమానాశ్రయాల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఆర్థికంగా ప్రయోజనకరంగా మార్చే అవకాశాలను పరిశీలించవచ్చు.

ఇప్పటికే ఏఏఐ పరిధిలోని 11 విమానాశ్రయాలను ఐదు బండిల్స్‌గా విభజించి లీజుకు ఇవ్వాలన్న ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఇందులో భాగంగా తమిళనాడులోని తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంతో తిరుపతి విమానాశ్రయాన్ని అనుసంధానించి ప్రైవేటు సంస్థకు అప్పగించే ప్రక్రియలో భాగంగా ఏఏఐ ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటనను జారీ చేసింది. ఈ నేపథ్యంలో కుప్పం విమానాశ్రయానికి సంబంధించి కూడా ఇదే తరహా అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

45
శ్రీకాకుళం ఎయిర్‌పోర్టుకు రూ.392 కోట్లు..
Image Credit : Pixabay

శ్రీకాకుళం ఎయిర్‌పోర్టుకు రూ.392 కోట్లు..

ఉత్తరాంధ్ర ప్రాంతంలో విమానయాన సదుపాయాలను పెంచే లక్ష్యంతో శ్రీకాకుళంలో కొత్త విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాజెక్టు తొలి దశ నిర్మాణానికి రూ.392 కోట్లు వెచ్చించాలని నిర్ణయించింది. విమానాశ్రయం కోసం 1,185.86 ఎకరాల భూమిని గుర్తించారు.

ఈ ప్రాజెక్టును ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందుకు సంబంధించిన రాయితీ ఒప్పందాన్ని ఏఏఐ పరిశీలనకు పంపింది. ఒప్పందం, సాంకేతిక అంశాలు, అవసరమైన అనుమతుల ప్రక్రియ పూర్తయిన తర్వాత నిర్మాణానికి సంబంధించిన తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

శ్రీకాకుళం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతంలో విమాన రవాణా సదుపాయాలు మెరుగుపడే అవకాశముంది. అయితే ప్రాజెక్టు నిర్మాణం, కార్యకలాపాల ప్రారంభం వంటి అంశాలు తదుపరి అనుమతులు, డీపీఆర్, టెండర్లు, భూసేకరణ తదితర ప్రక్రియల పురోగతిపై ఆధారపడి ఉంటాయి.

55
అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం..
Image Credit : ANI

అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం..

ఇదిలా ఉంటే.. రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు సైట్ క్లియరెన్స్ కోసం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖకు దరఖాస్తు చేశారు. సుమారు రెండు నెలల్లో అనుమతి లభిస్తుందని అధికారులు ఆశిస్తున్నారు. ఈలోగా విమానాశ్రయానికి అవసరమైన 4,618 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ విధానంలో సమీకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (డీబీఎఫ్‌ఓటీ) పద్ధతిని అనుసరించి ఈ విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. ప్రాజెక్టు తొలి దశకు రూ.4,419 కోట్లు వ్యయం చేయాలని ప్రతిపాదించారు. విమానాశ్రయానికి అవసరమైన ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రూ.1,087 కోట్లతో రహదారులు, డ్రెయిన్లు, ఇతర ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులు చేపట్టాలని ప్రణాళిక రూపొందించారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Egg Ban Village : కోళ్లు, కోడిగుడ్లపై మాత్రమే నిషేధం, మాంసాహారం కాదు.. ఆంధ్ర ప్రదేశ్ లో వింత గ్రామం
Recommended image2
Now Playing
President Droupadi Murmu At Vijayawada Kanakadurga Devi Temple | Asianet Telugu
Recommended image3
Now Playing
ద్రౌపదమ్మకు చీర బహుమతిగా ఇచ్చిన అనితమ్మ | Asianet Telugu
Related Stories
Recommended image1
డీమార్ట్‌లు, మెట్రోలే కాదు.. హైద‌రాబాద్‌లో త‌క్కువ ధ‌ర‌ల‌కు స‌రుకులు దొరికే మార్కెట్లు ఇవే
Recommended image2
హైద‌రాబాద్‌కు 50 కి.మీల దూరంలో ఉన్న ఈ ప్రాంతం.. మ‌రో అల్వాల్ కావ‌డం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved