MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో అద్భుతం.. ఈ రంగంలో రూ. ల‌క్ష కోట్ల పెట్టుబ‌డులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో అద్భుతం.. ఈ రంగంలో రూ. ల‌క్ష కోట్ల పెట్టుబ‌డులు

Andhra pradesh: రాయలసీమను అంతర్జాతీయ స్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం భారీ ప్రణాళికను అమల్లోకి తీసుకొచ్చింది. ‘రాయలసీమ రైజింగ్’ పేరుతో రూపొందించిన ఈ ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్ల పెట్టుబడిని సమీకరించేలా కార్యాచరణ సిద్ధమైంది

3 Min read
Author : Narender Vaitla
Published : Oct 02 2026, 03:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాయలసీమ ఉద్యాన హబ్ ప్రాజెక్టు
Image Credit : Gemini AI

రాయలసీమ ఉద్యాన హబ్ ప్రాజెక్టు

రాయలసీమ రైజింగ్ కార్య‌క్ర‌మంలో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం బి.కె.పల్లిలో శుక్రవారం రాయలసీమ ఉద్యాన హబ్ ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌, మంత్రి నారా లోకేశ్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాయలసీమతో పాటు ఉమ్మడి ప్రకాశం ప్రాంతంలో ఉద్యాన రంగానికి అవసరమైన మౌలిక వసతులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయనున్నారు. ప్రభుత్వ పెట్టుబడుల రూపంలో రూ.40,352 కోట్లు ఖర్చు చేయాలని ప్రణాళిక రూపొందించారు. ప్రైవేట్ రంగం నుంచి మరో రూ.60,000 కోట్ల పెట్టుబడులు వచ్చేలా కార్యాచరణ చేపట్టనున్నారు. రైతు పండించిన పంట నుంచి మార్కెట్ వరకు మొత్తం వ్యవస్థను ఒకే గొలుసుగా అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టులో ప్రధాన భాగంగా ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
5,869 గ్రామాలకు విస్తరించనున్న ఉద్యాన హబ్
Image Credit : Nara Chandrababu Naidu Official/Youtube

5,869 గ్రామాలకు విస్తరించనున్న ఉద్యాన హబ్

రాయలసీమ ఉద్యాన హబ్‌ పరిధి విస్తృతంగా ఉండనుంది. అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, తిరుపతి, వైఎస్సార్‌ కడప జిల్లాలతో పాటు ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ఈ ప్రాజెక్టు చేప‌ట్ట‌నున్నారు. మొత్తం 303 మండలాల పరిధిలోని 5,869 గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు.

ఈ ప్రణాళికను సిద్ధం చేసే క్రమంలో సీఎం చంద్రబాబు గత ఆరు నెలలుగా వ్యవసాయం, ఉద్యాన, ఆర్థిక, జలవనరుల శాఖల అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి అవసరమైన అనుమతులు పొందిన‌ తర్వాత ప్రాజెక్టును కార్యరూపంలోకి తీసుకొచ్చారు. పంట ఉత్పత్తి నుంచి పంటకోత, గ్రేడింగ్, ప్యాకింగ్, కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్, బ్రాండింగ్, రవాణా, దేశీయ, అంతర్జాతీయ మార్కెటింగ్ వరకు అవసరమైన మౌలిక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

35
మూడు దశల్లో రూ.40,352 కోట్ల మౌలిక వసతుల పనులు
Image Credit : Nara Chandrababu Naidu Official/Youtube

మూడు దశల్లో రూ.40,352 కోట్ల మౌలిక వసతుల పనులు

ఉద్యాన హబ్‌కు సంబంధించిన ప్రభుత్వ మౌలిక వసతుల అభివృద్ధిని మూడు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. 2026-27లో మొదటి దశ కింద 72 క్లస్టర్లలో రూ.12,066 కోట్లతో పనులు చేపడతారు. 2027-28లో రెండో దశలో 67 క్లస్టర్లకు రూ.15,036 కోట్లు కేటాయించనున్నారు. 2028-29లో మూడో దశలో 62 క్లస్టర్ల పరిధిలో రూ.13,250 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు.

ఈ పెట్టుబడులతో ఉద్యాన రైతులకు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. ఉత్పత్తి చేసిన పంటను నిల్వ చేయడం నుంచి ప్రాసెసింగ్ చేసి మార్కెట్లకు చేరవేసే వరకు ప్రతి దశలో సదుపాయాలను కల్పించనున్నారు. తద్వారా కరవు ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తక్కువ నీటితో సాగు చేసే ఉద్యాన పంటలకు మరింత ప్రాధాన్యం లభించనుంది.

45
9 లక్షల ఎకరాల్లో అదనపు ఉద్యాన సాగు
Image Credit : Nara Chandrababu Naidu Official/Youtube

9 లక్షల ఎకరాల్లో అదనపు ఉద్యాన సాగు

ప్రస్తుతం రాయలసీమతో పాటు ప్రాజెక్టు పరిధిలో 20.77 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఈ విస్తీర్ణాన్ని మరో 9 లక్షల ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 222 లక్షల మెట్రిక్‌ టన్నులుగా ఉన్న ఉద్యాన ఉత్పత్తిని 435 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేర్చేలా ప్రణాళిక రూపొందించారు. దీనివల్ల సుమారు 9.60 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది.

కొత్తగా 9 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి తీసుకురావడంతో పాటు 4.30 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే లక్ష్యాన్ని కూడా నిర్దేశించారు. మామిడి, అరటి, టమాటా, దానిమ్మ, డ్రాగన్‌ ఫ్రూట్‌, అవకాడో, బెర్రీలు వంటి పంటల సాగును ప్రోత్సహించనున్నారు. తక్కువ నీటితో మెరుగైన ఆదాయం పొందే అవకాశాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రణాళికలో కీలక అంశంగా ఉంది.

వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాయలసీమను ‘ఫ్రూట్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా’గా తీర్చిదిద్దే దిశగా చర్యలు సాగుతున్నాయని తెలిపారు. కరవు పరిస్థితులు, మార్కెట్ అనుసంధాన సమస్యలకు పరిష్కారం చూపేలా ఈ సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ఉద్యాన రంగంలో అనంతపురం నుంచి ఇరాన్‌కు ఇప్పటికే లక్ష టన్నులకు పైగా అరటి ఎగుమతి చేసే స్థాయికి చేరినట్లు వివరించారు.

55
మదనపల్లెలో 100 ఎకరాల్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్
Image Credit : Nara Chandrababu Naidu Official/Youtube

మదనపల్లెలో 100 ఎకరాల్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్

రాయలసీమ ఉద్యాన హబ్‌తో పాటు మదనపల్లెలో మరో కీలక వ్యవసాయ సంస్థకు కూడా శంకుస్థాపన జరిగింది. 100 ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే మొదటి ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ (ISA) ఏర్పాటు చేయనున్నారు. సీఎం చంద్రబాబు సూచనలతో ఈ సంస్థ నిర్వహణ బాధ్యతలను స్వీకరించేందుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ హాజరయ్యారు.

డిజిటల్ అగ్రికల్చర్, ప్రెసిషన్ ఫార్మింగ్, పంటల పర్యవేక్షణ, స్మార్ట్ ఇరిగేషన్, మార్కెట్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక వ్యవసాయ విధానాలపై రైతులకు ఈ సంస్థ శిక్షణ, మార్గదర్శకత్వం అందించనుంది. ఆధునిక సాంకేతికతతో పాటు మార్కెట్‌కు సంబంధించిన సమాచారాన్ని రైతులకు అందించడం ద్వారా దిగుబడిని మెరుగుపరచుకునే అవకాశాలను కల్పించనున్నారు.

మొత్తంగా ‘రాయలసీమ రైజింగ్’ ప్రణాళికలో ఉత్పత్తి పెంపు, నీటి వినియోగ సామర్థ్యం, మౌలిక వసతులు, నిల్వ, ప్రాసెసింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ వంటి అంశాలను సమగ్రంగా అనుసంధానించారు. రైతు నుంచి అంతర్జాతీయ మార్కెట్ వరకు పూర్తి వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: బిగ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణపై మళ్లీ వాయుగుండం.. ఐఎండీ తీవ్ర తుపాను అలర్ట్
Recommended image2
Now Playing
డ్వాక్రా మహిళ షాపుకు వెళ్లిన సీఎం.. బిజినెస్ ఐడియా విని ఫిదా | CM Chandrababu meets Dwacra womens
Recommended image3
వారంలో 6 రోజులు కోడిగుడ్లు, 3 రోజులు చికెన్‌.. విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్
Related Stories
Recommended image1
డ‌బ్బులుంటే ఇప్పుడే కొనేయండి.. త్వ‌ర‌లోనే ఈ ప్రాంతం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం
Recommended image2
వ‌ర్షాకాలంలో క‌నిపించే ఈ పురుగులు ఏంటో తెలుసా? వీటిని తాకితే ఏమ‌వుతుంది.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved