MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • AP Cabinet: సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు క‌లిగే ప్ర‌యోజనాలు ఏమిటి?

AP Cabinet: సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు క‌లిగే ప్ర‌యోజనాలు ఏమిటి?

AP Cabinet: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, బార్ పాలసీ మార్పులు, ఉచిత విద్యుత్‌కు ఆమోదం తెలిపింది. 

3 Min read
Mahesh Rajamoni
Published : Aug 06 2025, 10:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు పథకం
Image Credit : ANI

రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు పథకం

ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. "స్త్రీ శక్తి" పేరుతో రూపొందించిన ఈ పథకం ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా అమలులోకి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన 8,456 బస్సుల్లో ఇది అమలు కానుంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది.

ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 142 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కుటుంబానికి నెలకు సుమారు రూ. 800 ఆదా అవుతుందని అంచనాగా ప్రభుత్వ రిపోర్టులు పేర్కొంటున్నాయి. దేశంలో ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ తరహా పథకాలు ఉన్నాయి. కానీ, వాటికన్నా మెరుగ్గా అమలు చేస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రభుత్వం‌పై ఏడాదికి రూ. 1,942 కోట్ల భారం పడనుంది.

ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యానికి కేబినెట్ ఆమోదం. ఉచిత బస్సు పథకానికి స్త్రీ శక్తి అని పేరు పెట్టాం. స్త్రీ శక్తి పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నాం. 8,456 బస్సుల్లో ఉచిత బస్సు పథకం అమలు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్… pic.twitter.com/bl8zbSZnf0

— Telugu Desam Party (@JaiTDP) August 6, 2025

DID YOU
KNOW
?
స్త్రీ శక్తి పథకం
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం కోసం సీఎం చంద్రబాబు సర్కారు స్త్రీ శక్తి పథకం తీసుకొచ్చింది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 8,456 APSRTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సేవలు అందుబాటులో ఉంటాయి.
25
నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్‌
Image Credit : unsplash

నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్‌

ఉచిత విద్యుత్ కు సంబంధించి మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నాయీ బ్రాహ్మణ వర్గానికి హెయిర్ కటింగ్ సెలూన్లకు ఇప్పటి వరకూ 150 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. అయితే, ఇప్పుడు దాన్ని 200 యూనిట్లకు పెంచారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది చిన్న వ్యాపారస్తులకు ఊరటనివ్వనుంది. అంతేకాక, చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ మంజూరు చేసింది ఏపీ క్యాబినెట్.

బీసీ వర్గాల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. బలహీన వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. వారి సంక్షేమం కోసం రూ.47,500 కోట్లును కూటమి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. మత్స్యకారులు, నాయీబ్రాహ్మణులకు గౌరవ వేతనం పెంచాం.

ఇప్పుడు 40 వేల… pic.twitter.com/huBHpdTYUD

— Telugu Desam Party (@JaiTDP) August 6, 2025

Related Articles

Related image1
Top 5 Fighter Jets: ప్రపంచ దేశాలకు హడల్.. అత్యంత శక్తివంతమైన టాప్ 5 యుద్ధ విమానాలు
Related image2
Cloud Burst: క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? తెలుగు రాష్ట్రాలకు దీని ముప్పెంత?
35
కొత్త బార్ పాలసీ 2025–2028కి ఆమోదం.. కల్లు కార్మికులకు ప్రత్యేక కోటా
Image Credit : FREEPIK

కొత్త బార్ పాలసీ 2025–2028కి ఆమోదం.. కల్లు కార్మికులకు ప్రత్యేక కోటా

చంద్రబాబు సర్కారు 2025-2028 సంవత్సరాల మధ్య అమలయ్యే కొత్త బార్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఇందులో ముఖ్యంగా కల్లు గీత కార్మికులకు ప్రయోజనం కల్పిస్తూ బార్లలో 10 శాతం షాపులు వారికే కేటాయించనున్నారు. అలాగే, ఫీజులో 50 శాతం రాయితీ కూడా ల‌భించ‌నుంది.

బార్ లైసెన్స్ ఫీజు రూ.5 లక్షలుగా నిర్ణయించారు. బార్‌లు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే పనిచేయాలి. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా నియంత్రించేందుకు పర్మిట్ రూములకు అనుమతి ఇచ్చారు.

45
మావోయిస్టులపై నిషేధం పొడిగింపు
Image Credit : Getty

మావోయిస్టులపై నిషేధం పొడిగింపు

ఏపీ కేబినెట్ సమావేశంలో మావోయిస్టులపై ఇప్పటికే అమలులో ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు)తో పాటు రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ వంటి అనుబంధ సంస్థలపై నిషేధం కొనసాగనుంది. ఇది రాష్ట్రంలోని అంతర్గత భద్రతను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తీసుకున్న కీలక అడుగుగా చెబుతున్నారు.

55
పారిశ్రామిక అభివృద్ధికి ఊతం
Image Credit : Social Media

పారిశ్రామిక అభివృద్ధికి ఊతం

పారిశ్రామిక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఏపీఐఐసీకి రూ.7,500 కోట్ల రుణాన్ని తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ నిధులతో పారిశ్రామిక పార్కులు, టెక్ హబ్‌లు అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం.

భూసేకరణ, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలకు ఈ నిధులు వినియోగించనున్నారు. ఇదే సమయంలో టూరిజం రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహకాలు కల్పిస్తూ, ఏపీఈపీటీసీకి చెందిన 22 హోటళ్లు, 6 క్లస్టర్ల రిసార్ట్ల నిర్వహణకు ప్రైవేటు ఏజెన్సీల ఎంపికకు అనుమతి ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధి కోసం కేబినెట్ ఒక పాలసీ తీసుకుని వచ్చింది. ఫార్చ్యూన్-500, ఫోర్బ్స్ జాబితాలో ఉన్న సంస్థలను ఆహ్వానిస్తున్నాం. వారికి కేటాయించిన ఎకరం భూమికి 500 ఉద్యోగాలు వారు ఇవ్వాల్సి ఉంటుంది. కనీసం 3 వేలమందికి ఉద్యోగాలు ఇవ్వాలి. అప్పుడే వారికి భూమి… pic.twitter.com/I04NEaGzeI

— Telugu Desam Party (@JaiTDP) August 6, 2025

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు
నారా లోకేష్
పవన్ కళ్యాణ్
అమరావతి
విశాఖపట్నం
విజయవాడ
ప్రయాణం
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved