MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Cloud Burst: క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? తెలుగు రాష్ట్రాలకు దీని ముప్పెంత?

Cloud Burst: క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? తెలుగు రాష్ట్రాలకు దీని ముప్పెంత?

Cloud Burst: భారీ వర్షాలు, వరదలు, తుఫాన్ల వంటి వాతావరణ కారణాలతో భారతదేశం సగటున వార్షికంగా సుమారు రూ. 7 లక్షల కోట్ల వరకు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా క్లౌడ్ బరస్ట్ కారణంగా పెద్ద సంఖ్యలో మరణాలు, నష్టాలను చూస్తోంది.

3 Min read
Mahesh Rajamoni
Published : Aug 06 2025, 08:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
క్లౌడ్‌బర్స్ అంటే ఏమిటి?
Image Credit : AI Image/Gemini

క్లౌడ్‌బర్స్ అంటే ఏమిటి?

క్లౌడ్‌బర్స్ అనేది ఒక ప్రదేశంలో అత్యంత తక్కువ వ్యవధిలో భారీ వర్షం పడే ప్రకృతిలో జ‌రిగే ఒక‌ ఘటన. ఒక ర‌కంగా ఇది నివాస ప్రాంతాల‌కు సంభ‌వించే ప్ర‌కృతి విప‌త్తు. మాన‌వుల‌తో పాటు జీవ‌జాతుల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. 

సాధారణంగా గంట వ్యవధిలో 100 మిల్లీమీటర్ల (10 సెంటీమీటర్ల) కంటే ఎక్కువ వర్షపాతం ఒక చిన్న భౌగోళిక ప్రాంతంలో ( 10–30 చ.కిమీ) సంభవిస్తే దానిని క్లౌడ్ బ‌ర‌స్ట్ గా పరిగణిస్తారు. ఇవి సాధారణంగా తుఫాను మేఘాల మధ్య ఏర్పడతాయి. ఈ ఘటనలు భారీ వర్షాల‌తో వ‌చ్చే వ‌ర‌ద‌లు, కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టం, భూస్లైడ్‌లు వంటి విపత్తులకు దారితీసే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌గా ఉంటాయి.

❗️🌊🇮🇳 - Devastating Flash Floods Ravage Uttarkashi, India, Leaving Destruction in Their Wake

A catastrophic cloudburst triggered flash floods in Uttarkashi’s Dharali village, located near Harsil in Uttarakhand, India, causing widespread devastation. 

The deluge, fueled by a… pic.twitter.com/CKJer99Ql4

— 🔥🗞The Informant (@theinformant_x) August 5, 2025

DID YOU
KNOW
?
భారత్ లో క్లౌడ్ బరస్ట్ లు
భారతదేశంలో నమోదైన క్లౌడ్ బరస్ట్ ల (Cloud Burst) సంఖ్యపై కచ్చితమైన గణాంకాలు అందుబాటులో లేవు. కానీ, భారత వాతావరణశాఖ గణాంకాల ప్రకారం, 1970 నుంచి 2016 వరకు 30 క్లౌడ్ బరస్ట్ లు నమోదయ్యాయి
26
క్లౌడ్ బర‌స్ట్ లు ఎందుకు వ‌స్తాయి?
Image Credit : Getty

క్లౌడ్ బర‌స్ట్ లు ఎందుకు వ‌స్తాయి?

క్లౌడ్ బర‌స్ట్ పై చాలా కాలం నుంచి అధ్య‌య‌నాలు కొన‌సాగుతున్నాయి. వాతావరణ శాస్త్రవేత్తలు క్లౌడ్ బ‌ర‌స్ట్ ఏర్పడే ప్రధాన కారణాలను ఈ విధంగా వివరించారు:

1. ఒరోగ్రాఫిక్ లిఫ్ట్ (Orographic Lift): బంగాళాఖాతం లేదా అరేబియా సముద్రం నుండి వచ్చే తేమతో కూడిన గాలులు కొండలపైకి ఎక్కే సమయంలో వేగంగా పైకి లేచి భారీ మేఘాలను సృష్టిస్తాయి. ఇవి అధికంగా నీరు కలిగి ఉండి, ఒక్కసారిగా భారీ వర్షాన్ని కురిపిస్తాయి. అది కూడా త‌క్కువ ప్రాంతంలో ఉంటుంది.

2. స్థానిక గాలుల ప్ర‌భావం (Localized Updrafts): నిలువుగా పైకి ఎగసే గాలులు లేదా చక్రాకార గాలుల ప్ర‌భావంతో వ‌ర్షపు నీటిని పైభాగంలో నిలిపి ఉంచుతాయి. ఆ గాలులు బలహీనపడినప్పుడు భారీ వర్షంగా కురుస్తుంది.

3. వాతావరణ మార్పులు (Climate Change): ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ గాలి తేమను ఎక్కువగా నిల్వ చేసేందుకు సామర్థ్యం పొందుతుంది. ఇది ఎక్కువ వర్షపాతం సంభవించే అవకాశాన్ని పెంచుతుంది.

Related Articles

Related image1
Team India: ఇంగ్లాండ్ లో అద‌ర‌గొట్టేశారు.. టీమిండియాలో ముగ్గురు మొనగాళ్లు
Related image2
iPhone 17 Series: ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ ఎప్పుడు? ఆపిల్ ఎన్ని మోడల్స్ తీసుకొస్తోంది?
36
క్లౌడ్ బరస్ట్‌లు ఎలాంటి ప్రాంతాల్లో వస్తాయి?
Image Credit : X-@suryacommand

క్లౌడ్ బరస్ట్‌లు ఎలాంటి ప్రాంతాల్లో వస్తాయి?

కొండ ప్రాంతాలు (Mountainous Regions): హిమాలయాలు, పశ్చిమ కనుమలు వంటి ఎత్తైన భౌగోళిక ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్‌లు ఎక్కువగా సంభవిస్తాయి.

ఉదాహరణ: ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లడ్డాక్, నేపాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ మొదలైన హిమాలయాన ప్రాంతాలు.

మేఘాలు పైకి ఎక్కే అవకాశం ఉన్న ఎత్తైన ప్రాంతాలు (Orographic regions): అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుండి వచ్చే తేమతో కూడిన గాలులు కొండలపైకి లేచి, పైభాగంలో భారీ మేఘాలను సృష్టిస్తాయి. వీటిని "ఒరోగ్రాఫిక్ లిఫ్ట్" (orographic lift) అంటారు.

అత్యధిక తేమ ఉన్న ప్రాంతాలు (Regions with High Moisture Content): మాన్సూన్ సీజన్‌లో తేమ అధికంగా ఉండే ప్రాంతాల్లో, ఆ గాలులు పైకి లేచేలా కొండలు ఉంటే క్లౌడ్ బ‌ర‌స్ట్ ను ప్రేరేపించవచ్చు.

46
తెలుగు రాష్ట్రాల్లో క్లౌడ్ బ‌ర‌స్ట్ లు వ‌స్తాయా? ఇక్క‌డ వాటి ప్ర‌భావం ఎంత‌?
Image Credit : X/APCMO

తెలుగు రాష్ట్రాల్లో క్లౌడ్ బ‌ర‌స్ట్ లు వ‌స్తాయా? ఇక్క‌డ వాటి ప్ర‌భావం ఎంత‌?

తెలుగు రాష్ట్రాలైన‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు తక్కువ ఎత్తు, పల్లంగా విస్తరించిన మైదాన ప్రాంతాలుగా ఉండటంతో ఇక్కడ క్లౌడ్‌బర్స్ చాలా అరుదు. ఉదాహరణకు 2000 ఆగస్టు 24న హైదరాబాదులో కొన్ని గంటల వ్యవధిలో 242 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అయితే ఇది క్లౌడ్‌బర్స్‌గా పరిగణించరు. ఎందుకంటే అది గంట వ్యవధిలో కురిసిన వర్షం కాదు.

అలాగే, 2022 జూలైలో గోదావరి నదిలో సంభవించిన వరదలకు క్లౌడ్ బ‌ర‌స్ట్ కారణం కాదనీ, దీర్ఘకాలికంగా కురిసిన భారీ వర్షాలే కారణమని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటివరకు భార‌త వాతావ‌ర‌ణ శాఖ (IMD) గోదావరి-కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో క్లౌడ్‌బర‌స్ట్ వ‌చ్చాయ‌ని ధృవీకరించలేదు. 

మొత్తంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి సమతల ప్రాంతాల్లో క్లౌడ్‌బర్స్ అనేది చాలా అరుదుగా సంభవించే ప్రకృతి వైపరీత్యంగా నిపుణులు పేర్కొంటున్నారు. 

56
క్లౌడ్ బ‌ర‌స్ట్ పై శాస్త్రీయ పరిశోధనలు ఏం చెప్పాయి?
Image Credit : ANI

క్లౌడ్ బ‌ర‌స్ట్ పై శాస్త్రీయ పరిశోధనలు ఏం చెప్పాయి?

1969 నుంచి 2015 వరకూ 126 వాతావరణ కేంద్రాల్లో సేకరించిన గడిచిన 46 సంవత్సరాల డేటా ఆధారంగా, భారత్‌లో కేవలం 28 క్లౌడ్ బ‌ర‌స్ట్ ఘటనలు మాత్రమే నమోదు అయ్యాయి. కాగా , 130 చిన్న క్లౌడ్‌బర్స్ (2 గంటల్లో 50 మిల్లీమీటర్ల వర్షం) నమోదయ్యాయి. అంటే, ఏడాదికి సగటున ఒక క్లౌడ్‌బర్స్ మాత్రమే జరిగింది. అయితే, 2015 త‌ర్వాత ఈ సంఖ్య కాస్త పెరిగిందని వాత‌వార‌ణ నివేదిక‌లు పేర్కొంటున్నాయి.

భారతదేశంలోని హిమాలయ ప్రాంతాలు, పడమటి తీర ప్రాంతాలు వంటి కొండప్రాంతాల్లో ఈ ఘటనలు ఎక్కువగా సంభవిస్తున్నాయని తేలింది. కానీ, తెలంగాణ, ఏపీ వంటి సమతల ప్రాంతాల్లో క్లౌడ్‌బర్స్ దాదాపు వచ్చే అవకాశాలు లేవని నిపుణులు పేర్కొంటున్నారు.

66
క్లౌడ్ బరస్ట్ హెచ్చరికలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Image Credit : Getty

క్లౌడ్ బరస్ట్ హెచ్చరికలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

భారీ వర్షానికి సంబంధించి భారత వాతావరణ శాఖ (IMD) జిల్లా స్థాయిలో హెచ్చరికలు ఇస్తుంది. అయితే క్లౌడ్‌ బరస్ట్ కు ప్రత్యేక హెచ్చరికలు ఇవ్వడం సాధ్యం కాదు, ఎందుకంటే ఇవి అత్యంత తక్కువ సమయంలో హఠాత్ గా సంభవిస్తాయి.

కొన్ని ప్రాంతాల్లో డాప్లర్ రాడార్ ఆధారంగా తక్షణపు వాతావరణ సూచనలు ఇవ్వగలుగుతున్నా, ఇవి ఎక్కువగా కొండప్రాంతాల్లో లేకపోవడం వల్ల స్పష్టమైన హెచ్చరికలు రావడం కష్టమే.

ప్రభుత్వాలు, ప్రజలు ప్రాథమికంగా హెచ్చరికలు, సురక్షిత ప్రదేశాలకు త్వరగా తరలింపు, నీటి పారుదల మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

అలాగే, నదీ ప్రవాహాలపై AI ఆధారిత వరద అంచనాల వ్యవస్థలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ఇవి కొన్ని రోజులు ముందే హెచ్చరికలు ఇవ్వగలవు. ఈ దిశగా కూడా పరిశోధనలు, టెక్నాలజీ మార్పులు జరుగుతున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
వాతావరణం
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved