Top 5 Fighter Jets: ప్రపంచ దేశాలకు హడల్.. అత్యంత శక్తివంతమైన టాప్ 5 యుద్ధ విమానాలు
Top 5 Fighter Jets: యుద్ధ విమానాల తయారీలో ప్రపంచంలోని అగ్రదేశాలతో పాటు చిన్న దేశాలు సైతం పోటీ పడుతున్నాయి. అయితే, ప్రస్తుతం జే-20, ఎఫ్-22 రాప్టర్ సహా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 5 అత్యాధునిక 5వ తరం యుద్ధ విమానాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. చెంగ్డు జే-20 (చైనా)
చెంగ్డు ఎయిరోస్పేస్ కార్పొరేషన్ (AVIC) అభివృద్ధి చేసిన చైనాకు చెందిన తొలి 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ జే-20. 2011లో దీనిపై మొదటగా ప్రయోగాలు జరిపారు. 2017లో సైన్యంలో చేరింది. ఇది స్టెల్త్, ఎక్కువ దూరం ప్రయాణాలకు అనుకూలంగా రూపొందించారు.
- చెంగ్డు జే-20 గరిష్ట వేగం: మాక్ 2.0 (సుమారు 2,470 కిమీ/గంట)
- చెంగ్డు జే-20 యుద్ధ పరిధి: సుమారు 2,000 కిమీ
- చెంగ్డు జే-20 ధర: సుమారు 100 మిలియన్ USD
జే-20 లో అత్యాధునిక సెన్సర్లు, రాడార్ తప్పించుకునే టెక్నాలజీ, చాలా దూరం ప్రయాణించే క్షిపణులను కలిగిన అత్యాధునిక ఫైటర్ జెట్.
J-20 Mighty Dragon. pic.twitter.com/qTSOLQBmro
— Manju (@mandate2049) May 13, 2025
KNOW
2. సుఖోయ్ సు-57 (రష్యా)
రష్యా అభివృద్ధి చేసిన అత్యాధునిక 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానం సుఖోయ్ సు-57. ఇది నింగి, నేల లక్ష్యాలపై దాడులు చేయగలిగే సత్తాను కలిగి ఉంటుంది.
- సుఖోయ్ సు-57 గరిష్ట వేగం: మ్యాక్ 2.0 (సుమారు 2,136 కిమీ/గంట)
- సుఖోయ్ సు-57 యుద్ధ పరిధి: సుమారు 1,900 కిమీ
- సుఖోయ్ సు-57 స్టెల్త్, మల్టీ రోల్ సామర్థ్యాలు కలిగి ఉంది.
అందులోని ఆయుధాలు విమాన బాడీలోనే ఉండటంతో స్టెల్త్ సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది.
The Sukhoi Su-57 ‘Felon’ 🔥 pic.twitter.com/6t87XilM0O
— Tar21Operator (@Tar21Operator) July 30, 2025
3. ఎఫ్-22 రాప్టర్ (అమెరికా)
లాక్‌హీడ్ మార్టిన్ తయారుచేసిన అమెరికాకు చెందిన మొట్టమొదటి 5వ తరం ఫైటర్ జెట్ F-22 రాప్టర్. ఇది 2005లో సైన్యంలో చేరింది.
- ఎఫ్-22 రాప్టర్ గరిష్ట వేగం: మ్యాక్ 2.25 (సుమారు 2,414 కిమీ/గంట)
- ఎఫ్-22 రాప్టర్ దీర్ఘ ప్రయాణ సామర్థ్యం: 3000 కిమీ (ఎక్స్‌టర్నల్ ఫ్యూయెల్ ట్యాంక్‌తో)
- ఎఫ్-22 రాప్టర్ ధర: సుమారు 360 మిలియన్ USD
ఎఫ్-22 ఎగుమతులు నిషేధం ఉన్నందున, కేవలం 187 యూనిట్లు మాత్రమే తయారు చేసి, అమెరికా సైన్యం వినియోగిస్తోంది.
Enjoy this F-22 Raptor footage being filmed at 1000fps on the Phantom Flex4K! 🔥
📹: @dustin_farrellpic.twitter.com/oz2Y4u9F5P— Aviation (@webflite) August 5, 2025
4. ఎఫ్-35 లైట్నింగ్ II (అమెరికా)
లాక్‌హీడ్ మార్టిన్ అభివృద్ధి చేసిన మల్టీ-రోల్ స్టెల్త్ ఫైటర్ జెట్ ఎఫ్-35 లైట్నింగ్ II (అమెరికా). ఇది మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
- F-35A: సాధారణ టేకాఫ్
- F-35B: షార్ట్/వెర్టికల్ టేకాఫ్
- F-35C: ఏర్‌క్రాఫ్ట్ కేరియర్‌ల కోసం
- ఎఫ్-35 లైట్నింగ్ II గరిష్ట వేగం: మ్యాక్ 1.6 (సుమారు 1,931 కిమీ/గంట)
- ఎఫ్-35 లైట్నింగ్ II యుద్ధ పరిధి: సుమారు 1,000 కిమీ
- ఇది నింగి, నేలపై దాడులు, నిఘా కార్యకలాపాల్లో కీలకంగా పనిచేస్తుంది.
#USAF F-35A Lightning II Demo Team bringing the HEAT at #OSH25! …Literally! pic.twitter.com/sVyJRPUULk
— EAA (@EAA) July 23, 2025
5. AVIC J-35 (FC-31 జైర్ ఫాల్కన్) - చైనా
జే-35 లేదా FC-31 జైర్ ఫాల్కన్ చైనా అభివృద్ధి చేసిన రెండవ 5వ తరం స్టెల్త్ జెట్. దీనిని షెన్యాంగ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ రూపొందించింది.
- FC-31 జైర్ ఫాల్కన్ గరిష్ట వేగం: మ్యాక్ 1.8 (సుమారు 2,205 కిమీ/గంట)
- FC-31 జైర్ ఫాల్కన్ యుద్ధ పరిధి: సుమారు 1,200 కిమీ
ఇది డ్యూయల్ ఇంజిన్ జెట్, ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టూ గ్రౌండ్ దాడులకు అనుకూలంగా రూపొందించారు.
ఈ ఐదు యుద్ధ విమానాలు అత్యాధునిక ఫిఫ్త్ జనరేషన్ టెక్నాలజీతో రూపొందించారు. స్టెల్త్, అధిక వేగం, మల్టీ-రోల్ సామర్థ్యాలు, అత్యున్నత సెన్సర్లను ఇవి కలిగి ఉంటాయి. ప్రపంచంలో చాలా దేశాలు ఆయుధ శక్తిని మెరుగుపరచడంలో ఈ తరహా విమానాలకు పెద్దపీట వేస్తున్నాయి.