మునక్కాయలు ఎవరెవరు తినకూడదో తెలుసా?
మునక్కాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిలో ఉండే పోషకాలు మనల్ని ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంచుతాయి. కానీ కొన్ని సమస్యలు ఉన్నవారికి మాత్రం మునక్కాయలు అంత మంచివి కావు. అసలు వీటిని ఎవరు తినకూడదంటే?
మునక్కాయలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, సెలీనియం, జింక్ వంటి పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందుకే వీటిని తరచుగా తినమని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. మునక్కాయలతో ఎన్ని లాభాలు ఉన్నా.. కొంతమంది మాత్రం వీటిని పొరపాటున కూడా తినకూడదు. వాళ్లు ఎవరెవరంటే?
గుండె జబ్బులు: గుండె జబ్బులతో బాధపడేవారు మునక్కాయలను పొరపాటున కూడా తినకూడదు. ఎందుకంటే మునక్కాయల్లో ఉండే ఆల్కలాయిడ్ గుండె కొట్టుకునే వేగాన్ని తగ్గిస్తుంది. ఇలాంటి వారు మునక్కాయలను తింటే గుండె జబ్బులొచ్చే ప్రమాదం పెరుగుతుంది.
తక్కువ బీపీ: రక్తపోటు ఎక్కువగా ఉన్నవారు మునక్కాయలను ఎంచక్కా తినొచ్చు. కానీ తక్కువ రక్తపోటు ఉన్నవారు మాత్రం వీటిని పొరపాటున కూడా తినకూడదు. లేదా చాలా వరకు తగ్గించాలి. ఎందుకంటే మునక్కాయలను ఎక్కువగా తినడం వల్ల బీపీ చాలా తగ్గుతుంది.
గర్భిణులు: ఆరోగ్య నిపుణుల ప్రకారం.. గర్భంతో ఉన్నప్పుడు మునక్కాయలను తినకపోవడమే మంచిది. ఇది వీళ్లకు మంచి కంటే చెడే ఎక్కువ చేస్తుంది. ఎందుకంటే మునక్కాయలు గర్భస్రావానికి దారితీస్తాయి.
అలెర్జీ : హైపర్ సెన్సివిటీ సమస్యతో బాధపడుతున్న వారు కూడా మనుక్కాయలను తినకపోవమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది శరీరమంతటా చికాకు, వాపు వంటి ప్రమాదకరమైన అలెర్జీ ప్రతిచర్యలకు దారితీస్తుంది.
థైరాయిడ్: ధైరాయిడ్ ఉన్నవారు కూడా మునక్కాయలను తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది థైరాయిడ్ సమస్యలను మరింత పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కడుపు నొప్పి: సరిగ్గా ఉడకని మునక్కాయలను తినడం వల్ల గ్యాస్, డయేరియా వంటి కడుపునకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఈ సమస్యలు ఉన్నప్పుడు కూడా మీరు మునక్కాయలను తినకూడదు.