రోహిత్ శర్మ ఎక్కడికి వెళ్లినా తినే ఫుడ్ ఇదే.. దీని వల్ల కలిగే బెనిఫిట్స్ ఇవే..!

 ఏ దేశం వెళ్లినా.. తనకు ఇష్టమైన ఫుడ్ ని మాత్రమే తింటారట. అది మరేంటో కాదు.. పప్పు అన్నం.  ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో రోహిత్ ఈ విషయాన్ని చెప్పడం విశేషం.
 

Rohit Sharma reveals his secret favourite dish ram

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కి పరిచయం అవసరం లేదు. రీసెంట్ గా.. రోహిత్ సారథ్యంలో టీమిండియా టీ 20 వరల్డ్ కప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. కాగా.. ఈ సందర్భంగా.. మన కెప్టెన్ రోహిత్ కి ఇష్టమైన ఫుడ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒక క్రికెటర్ గా రోహిత్.. చాలా రకాల దేశాలకు వెళ్లాల్సి వస్తుంది. అయితే... ఏ దేశం వెళ్లినా.. తనకు ఇష్టమైన ఫుడ్ ని మాత్రమే తింటారట. అది మరేంటో కాదు.. పప్పు అన్నం.  ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో రోహిత్ ఈ విషయాన్ని చెప్పడం విశేషం.

తాను ఇండియాలో ఉన్నా.. విదేశాల్లో ఉన్నా పప్పు అన్నం, రసం లాంటివి మాత్రమే తింటాను అని ఆయన చెప్పడం విశేషం. ఎక్కడికి వెళ్లినా.. తనకు ఈ ఫుడ్ ఈజీగా దొరుకుతుందని.. అందుకే అదే తింటాను అని ఆయన చెప్పారు. మరి.. రోజూ పప్పు అన్నం తినడం మంచిదేనా..? రోజూ పప్పు అన్నం తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..

Rohit Sharma reveals his secret favourite dish ram

పప్పు అన్నం ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది.  ఎందుకంటే దీనిలో యాంటీఆక్సిడెంట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ పుష్కలంగా ఉ:టాయి. ఇవి కాకుండా చాలా విటమిన్లు, మినరల్స్ కూడా ఇందులో ఉన్నాయి. కందిపప్పులో చాలా రకాల విటమిన్లు, 9 రకాల అమినో యాసిడ్స్ ఉంటాయి.

పప్పులో లైసిన్ ఉంటుంది, బియ్యంలో సల్ఫర్ ఆధారిత అమైనో ఆమ్లాలు మెథియోనిన్ , సిస్టీన్ ఉంటాయి. రెండూ కలిస్తే అవసరమైన అమైనో ఆమ్లాలు లభిస్తాయి. పప్పులు, బియ్యం చాలా తేలికైన ఆహారం. అందువల్ల తేలికగా జీర్ణమవుతుంది. అన్నం ప్రోబయోటిక్, ఇది మీ పేగు ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. దీని కారణంగా మీరు జీర్ణక్రియకు సంబంధించిన ఎలాంటి సమస్యలు రావు.

పప్పు అన్నం మీ బరువు తగ్గించే ప్రయాణంలో మీకు సహాయపడుతుంది, ఎందుకంటే ఇందులో ప్రోటీన్, ఫైబర్ వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చాలా తేలికైన ఆహారం, ఇది మీ కడుపుని చాలా కాలం పాటు నిండుగా ఉంచుతుంది. మీకు అనారోగ్యకరమైన ఆహారం పట్ల కోరిక ఉండదు.
పప్పు బియ్యంలో ప్రోటీన్, కాల్షియం , ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి కండరాలను నిర్మించడంలో సహాయపడతాయి. ఇది ఎముకలను దృఢంగా చేస్తుంది. కాబట్టి.. దీనిని రోజూ పిల్లలకు పెట్టినా కూడా మంచిదే. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios