చికెన్ 65కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
కానీ.. అసలు నిజం అది కాదట. దానికి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయాన్ని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వీడియో ద్వారా వివరించారు.
చికెన్ లో చాలా వెరైటీలు ఉన్నాయి. వాటిలో చికెన్ 65 స్థానం మాత్రం చాలా ప్రత్యేకం. ఈ చికెన్ 65 ని తినడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇప్పటి వరకు మనం చాలా సార్లు.. ఈ చికెన్ 65 ని చాలా సార్లు తినే ఉంటాం. కానీ.. ఈ రెసిపీకి చికెన్ 65 అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా..? ఆ రెసిపీలో 65 అంటే ఏంటి..? దానికి చికెన్ 65 అని ఎందుకు పెట్టారో తెలుసుకుందామా..?
చాలా మంది చికెన్ ని 65 ముక్కలుగా కట్ చేస్తారు కాబట్టి ఆ పేరు పెట్టారని.. లేదంటే.. 65 రోజుల పాటు చికెన్ ని మారినేట్ చేశారు కాబట్టి.. ఆ పేరు పెట్టారని చాలా రకాలుగా అనుకుంటారు. కానీ.. అసలు నిజం అది కాదట. దానికి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయాన్ని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వీడియో ద్వారా వివరించారు.
ఆన్‌లైన్‌లో వైరల్ అయిన వీడియోలో, ఈ చారిత్రక వంటకం దాని పేరు ఎలా వచ్చిందో వివరించాడు. ఈ వీడియోను రౌనక్ రామ్‌టేకే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. డిష్ పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని రౌనక్ వీడియో ద్వారా పేర్కొంది.
తయారీలో ఉపయోగించిన 65 పదార్ధాల కారణంగా, డిష్ దాని పేరు వచ్చిందని.. లేదా చికెన్ తయారీకి ముందు 65 ముక్కలుగా చేసిందని కొందరు అనుకుంటారు, మరికొందరు చికెన్ 65 రోజులు మారినేట్ చేయబడిందని భావిస్తారు. అయితే, ఈ పేరు వెనుక అసలు కారణం అది ప్రారంభించిన సంవత్సరం అని ఆయన చెప్పారు.
1965లో చెన్నైలోని బుహారీ హోటల్‌లో తొలిసారిగా చికెన్ 65 తయారైంది. ఈ హోటల్‌ను 1951లో బుహారీ ప్రారంభించారు. చెన్నైలో ఫైన్ డైనింగ్‌ను ప్రవేశపెట్టిన మొదటి హోటల్ కూడా ఇదే. అందుకే.. ఈ రెసిపీకి చికెన్ 65 అనే నామకరణం చేశారు.
ఈ వీడియో చూసిన చాలా మంది ఈ విషయం మాకు తెలియదంటూ కామెంట్స్ చేయడం గమనార్హం. ఇప్పటి వరకు తమకు అసలు ఈ విషయం తెలియదని.. వేరే విధాలుగా అనుకున్నామంటూ చెప్పడం గమనార్హం. మొత్తానికి వీడియో మాత్రం వైరల్ గా మారింది.