Guava: జామ కాయలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది మార్కెట్ లోనే కాకుండా ఇళ్ల వద్ద కూడా సులువుగా దొరుకుతుంది. పల్లెల్లో అయితే ఇంటికో జామచెట్టు ఉంటుంది. జామకాయలో ఎన్నో పోషకాలు ఉన్నా.. వాటి గింజల వల్ల కొంతమందికి తినడానికి ఇష్ట పడరు. అలాంటి వాళ్ళు కూడా జామకాయ పోషకాలు పొందాలంటే ఇలా చట్నీ చేసి చూడండి. అందరూ ఇష్టంగా తింటారు.

రోజుకో యాపిల్ తింటే మంచిదంటారు కదా.. కాని మనం నివసిస్తున్నవాతావరణ పరిస్థితికి జామకాయ తింటేనే ఆరోగ్యంగా ఉంటాం. జామకాయని సాధారణంగా, కారం, ఉప్పు జల్లుకొని తింటారు. కానీ జామకాయతో చట్నీ కూడా చేయొచ్చని మీకు తెలుసా? ఈ చట్నీలో పోషకాలతో పాటు, మంచి వాసన కూడా ఉంటుంది. జామకాయ చట్నీ ఒక ప్రత్యేకమైన సైడ్ డిష్‌గా ఉంటుంది. ఇది అన్నం, ఇడ్లీ, దోశ, రోటీ వంటి వాటితో కలిపి తింటే చాలా బాగుంటుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉండే జామకాయ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. 

జామకాయ చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు

జామకాయ – 1 పెద్దది (ముక్కలు చేసినవి)
పచ్చిమిర్చి – 2 (లేదా రుచికి తగినంత)
కొబ్బరి తురుము – 1/4 కప్పు
వెల్లుల్లి – 2 రెబ్బలు
అల్లం – 1/2 అంగుళం ముక్క
టమాటో – 1/2 (ఇష్టమైతే వేసుకోవచ్చు)
కొత్తిమీర ఆకులు – 1 కట్ట
జీడిపప్పు (ఇష్టమైతే) – 4-5
నువ్వులు – 1 టీస్పూన్
ఉప్పు – రుచికి తగినంత
నిమ్మరసం – 1/2 టీస్పూన్ (రుచికి)
నీళ్లు – కొద్దిగా

ఇది కూడా చదవండి హోలీ పండగ మార్చి 14న? 15న? పూర్తి వివరాలతో క్లారిటీ ఇదిగో?

తాలింపు కోసం కావలసిన వస్తువులు

నూనె – 1 టేబుల్ స్పూన్
ఆవాలు – 1/2 టీస్పూన్
మినపప్పు – 1/2 టీస్పూన్
కరివేపాకు – 7-8 ఆకులు
ఎండు మిరపకాయలు – 2

జామకాయ చట్నీ తయారీ విధానం 

- జామకాయను బాగా కడిగి, పెద్ద ముక్కలుగా కోసుకోవాలి.
- గింజలు తీయాల్సిన అవసరం లేదు. కానీ మెత్తగా రుబ్బుకోవాలి.
- ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, జీడిపప్పు, నువ్వులు వేసి వేయించాలి.
- దీన్ని మీడియం మంట మీద 2-3 నిమిషాలు వేయించాలి.
- వేయించిన వాటిని మిక్సీలో వేసి కొబ్బరి, జామకాయ ముక్కలు, ఉప్పు, కొత్తిమీర, నిమ్మరసం వేసి రుబ్బుకోవాలి.
- కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
- ఒక చిన్న కళాయిలో నూనె వేడి చేసి, ఆవాలు, మినపప్పు, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపు వేయాలి.
- ఇది చట్నీలో వేస్తే మంచి వాసన వస్తుంది.
- వేడిగా తింటే, చట్నీ రుచి చాలా బాగుంటుంది.
- ఇడ్లీ, దోశ, పొంగల్, అన్నం, చపాతీ, పూరీతో ఈ చట్నీ తినొచ్చు.

పాలకూరతో కూడా ఇడ్లీ చేయొచ్చని మీకు తెలుసా? ఎముకలు ఐరన్ రాడ్స్‌లా తయారవుతాయి

జామకాయ చట్నీ వల్ల ఉపయోగాలు

- పీచు పదార్థం ఎక్కువ కాబట్టి జీర్ణక్రియకు సహాయపడుతుంది.
- ఇది ఒక రకమైన మందులా పనిచేస్తుంది. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
- బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జామకాయ శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది.
- పొటాషియం, విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.