MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • Holi 2025 Date: హోలీ పండగ మార్చి 14న? 15న? పూర్తి వివరాలతో క్లారిటీ ఇదిగో?

Holi 2025 Date: హోలీ పండగ మార్చి 14న? 15న? పూర్తి వివరాలతో క్లారిటీ ఇదిగో?

Holi 2025 Date: మన దేశంలో హోలీ పండగకు చాలా ప్రత్యేకత ఉంది. చాలా పండగలు రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా జరుపుకుంటారు. కాని హోలీ అనేది దేశ వ్యాప్తంగా నిర్వహించే పండగల్లో ముఖ్యమైనది. అందుకే ఇండియన్స్ కి హోలీ చాలా ప్రత్యేకం. అయితే ఈ ఏడాది అంటే 2025లో హోలీ పండగ నిర్వహించే విషయంలో కన్ఫూజన్ ఏర్పడింది. కొందరు మార్చి 14 అని, మరికొందరు మార్చి 15 అని అంటున్నారు. ఏది కరెక్టో క్లారిటీగా తెలుసుకుందాం రండి.

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Mar 07 2025, 03:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సాధారణంగా ప్రతి ఏడాది హోలీ పండగను భారతదేశంలో ఫాల్గుణ మాస పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. ఇది సాధారణంగా మార్చి నెలలో వస్తుంది. 2025 సంవత్సరంలో పౌర్ణమి మార్చి 14న వచ్చింది. అయితే హోలీ పండగ నిర్వహించడానికి ముందు హోలికా దహనం చేయాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది హోలికా దహనం కార్యక్రమాన్ని పౌర్ణమికి ముందు రోజు నిర్వహిస్తారు. అది కూడా శుభ ముహూర్తం నిర్ణయించి రాత్రి సమయంలో నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది హోలికా దహనాన్ని మార్చి 13న అంటే గురువారం రోజున నిర్వహించాలి. అయితే హోలికా దహనం భద్ర కాలంలో చేయకూడదు. 
 

25

భద్ర కాలం అంటే ఏమిటి?
భద్ర కాలం అనేది హిందూ పంచాంగంలో ఒక ప్రత్యేకమైన సమయం. ఇది శుభకార్యాలకు అనుకూలం కాదు. 2025లో మార్చి 13న నిర్వహించాల్సిన హోలికా దహనం కూడా భద్ర కాలంలో  చేయకూడదు. ఈ భద్ర కాలాన్ని చంద్రుడి గమనాన్ని బట్టి పండితులు, పంచాంగ కర్తలు నిర్ణయిస్తారు. 

35

పౌర్ణమి తిధి మార్చి 13 గురువారం ఉదయం 10.23 నిమిషాలకు ప్రారంభమై మార్చి 14 శుక్రవారం ఉదయం 11.26 వరకు ఉంది. ఈ లెక్కన హోలీ మార్చి 14న మాత్రమే నిర్వహించాలి. అయితే హోలీ ముందు రోజు కచ్చితంగా హోలికా దహనం చేయాలి. ఆ సమయంలో భద్ర కాలం ఉండకూడదు.

అయితే మార్చి 13 గురువారం రాత్రి 10.37 వరకు భద్ర కాలం ఉంది. అందువల్ల చాలా ప్రాంతాల్లో శుభ ముహూర్తం చూసుకొని గురువారమే హోలికా దహనం చేయడానికి నిర్ణయించారు. దీంతో హోలీ పండుగ మార్చి 14, శుక్రవారం రోజున ఫిక్స్ అయ్యింది. 
 

45

కొన్ని ప్రాంతాల్లో మాత్రం హోలికా దహనం మార్చి 14న చేసి, మార్చి 15న హోలీ పండగ నిర్వహించాలని అనుకుంటున్నారు. అయితే భద్ర కాలం తర్వాత శుభ ముహూర్తం చూడాల్సింది ఆయా ప్రాంతాల్లో ఉండే పండితులు. ప్రాంతాల వారీగా ముహూర్తాలు మారుతుంటాయి. అందువల్ల వారు నిర్ణయించిన ముహూర్తంలో హోలికా దహనం చేస్తారు. అందువల్ల దేశంలో ఎక్కువ ప్రాంతాల్లో హోలికా దహనం మార్చి 13న, హోలీ పండగ మార్చి 14న నిర్వహించనున్నారు. 

55

హోలికా దహనం వెనుక కథ ఏంటి
హోళికా దహనం అనేది హోలీ పండుగకు ముందు రోజు జరిగే ప్రత్యేకమైన ఆచారం. ఇది పాపంపై పుణ్యం విజయం సాధించిందని, ధర్మం అధర్మాన్ని జయించిందని సూచించే గొప్ప సంప్రదాయం.

పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడి అక్క హోళికా. హిరణ్యకశిపుడు అహంకారానికి లోనైన రాక్షస రాజు. తన కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడిగా మారడాన్ని అంగీకరించలేక అతడిని చంపాలని నిర్ణయించుకుంటాడు. హిరణ్యకశిపుడు తన అక్క హోళికాను పిలిచి ప్రహ్లాదుని మంటల్లో కాల్చేయమని ఆదేశిస్తాడు. హోళికాకి ఒక ప్రత్యేకమైన వస్త్రం ఉండేది. ఇది ఆమెను మంటల్లో కాలిపోకుండా కాపాడుతుంది. హోళికా ప్రహ్లాదుడిని మోసగించి అతనితో పాటు అగ్నిలోకి దూకుతుంది. కాని విష్ణువు కృపతో ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడతాడు. హోళికా కాలిపోయి చనిపోతుంది. ఈ సంఘటనను గుర్తుచేసుకుంటూ హోళికా దహనం జరుపుకుంటారు 
 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Black Beads: ఒక స్త్రీ నల్ల పూసల దండను.. మరో స్త్రీ వేసుకోవచ్చా?
Recommended image2
Sankranti : సంక్రాంతికి ఈ గుడికి వెళ్తే మీ జాతకం మారిపోవడం ఖాయం ! పట్టిందల్లా బంగారమే!
Recommended image3
కేవలం సంక్రాంతికి మాత్రమే తెరుచుకునే ఆలయం.. ఒక్కరోజే గర్భగుడిలో దేవుడి విగ్రహం..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved