ప్రస్తుతం చదువు అంటేనే వ్యాపారంగా మారింది… పలితాలు కూడా అలాగే ఉంటున్నాయి. ఫోటో సింథసిస్ అనే మాటకు అర్థం తెలియనోడికి బోటనీలో నూటికి నూరు మార్కులు వస్తున్నాయి. 

పదో తరగతిలో... ఇంటర్ లో... ప్రభుత్వమే పాస్ చేయిస్తుంది.. మార్కులు ఇస్తుంది.

పరీక్ష హాల్ కు వెళితే చాలు.. నూటికి 99 గ్యారెంటీ.

ఫలితాలు హోరెత్తిస్తాయి.

ఆహా .. ఓహో అంటూ మీడియా బాకాలు ఊదుతుంది.

విద్యార్థులు కుష్.. పేరెంట్స్ కుష్.. ప్రైవేట్.. ప్రభుత్వ విద్యాసంస్థలు కుష్.

హైడ్రోక్లోరిక్ యాసిడ్ మాటను పలకలేనోడికి కెమిస్ట్రీలో ఫుల్ మార్క్స్.

ఫోటో సింథసిస్ అనే మాటకు అర్థం తెలియనోడికి బోటనీలో నూరు.

అటుపై పొట్ట పొడిచినా అక్షరం ముక్క రాని వారు కూడా ఉన్నత విద్యాసంస్థల్లో చేరిపోతారు.

చేరాలి మరి..

ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ... లాంటి ఉన్నత కోర్సుల్లో చేరడం ప్రతి ఒక్కరి జన్మ హక్కు.

డబ్బుంటే చాలు.. సీట్ వచ్చేస్తుంది..

చదువుకు దానికి ఏమీ సంబంధం ఉండదు...

గొప్పగొప్ప మేడలు... గొప్పగొప్ప ప్రాంగణాలు ప్రకటనలు..

ప్రభుత్వం "డూమ్డ్" యూనివర్సిటీ అని అచ్చోసి వదిలిన ఆంబోతులు.

గబ్బు బుద్ధులు నేర్చిన డబ్బున్న ఇళ్ల పిల్లలకోసమే వెలసిన లగ్జరీ హోటల్స్ లాంటి వ్యాపార సంస్థలు.

సరుకు సూన్యం .. సరైన ఫాకల్టీ ఉండదు.. నూటికి తొంబై మంది విద్యార్థుల ఆలోచనలు వేరు.. లైఫ్ ను ఎంజాయ్ చెయ్యాలి.. ముఖ్యంగా కాలేజీ లైఫ్ ను ఎంజాయ్ చెయ్యాలి.

అసలే హార్మోన్ డ్రైవ్

మావాడు / అమ్మాయి ఫలానా డూమ్డ్ (స్పెల్లింగ్ మిస్టేక్ లేదు. ఈ పదాన్ని ఇంకోసారి చదవండి) యూనివర్సిటీ చదువుతున్నారు అని పేరెంట్స్ గొప్పలు చెప్పుకుంటుంటారు.

ఆ డూమ్డ్ యూనివర్సిటీలలో మెజారిటీ ఇలాంటి సరుకే.

చేతిలో డబ్బులు..

చదివే ఓపిక లేదు..

చదవాల్సిన అవసరం కూడా లేదు.

చదవక పోయినా ప్రభుత్వం ఇప్పటి దాక మార్కులు ఇప్పించింది..

ఇప్పుడు డూమ్డ్ యూనివర్సిటీ ఇప్పిస్తుంది అని వారికి తెలుసు.

యూనివర్సిటీ ప్రాంగణాలు సుఖ విలాస్ లాడ్జిలు అయిపోతాయి .

మాాధకద్రవ్యాల సరఫరా చేసే వారికి బెట్టింగ్ నిర్వాహకులకు ఇవి సింగల్ విండో పాయింట్లు.

గబ్బు వ్యాపారం మూడు పెగ్గులు.. ఆరు పిల్స్/పఫ్స్ గా సాగుతుంది.

నాలుగేళ్లు ..

తెగ తాగి .. తూగి .. వాగి .. కాలేజీ నుండి లక్ష వ్యసనాలతో బయటకు.

అటుపై పేరెంట్స్ సంపాదించిన ఆస్థిని తగలబెట్టి సమాజానికి చీడ పురుగులుగా మారిపోతారు.

నిన్నటి దాక ఇలాంటి సరుకు దూర తీరాలకు వెళ్లి అక్కడ తగల పెట్టేసారు.

ఇప్పుడు అవి క్లోజ్ .. ఇకపై ఇక్కడే తగలపెట్టేస్తారు.

ప్రతి చర్యకు దానికి సమానమయిన ప్రతిచర్య ఉంటుంది.

ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకోడైల్ ఫెస్టివల్.

మంచి దారిలో చదివే విద్యార్థులు ఉన్నారు.. విద్యా సంస్థలు ఉన్నాయి.. ఫాకల్టీ ఉంది.

అందుకే తాగుపోతు రమేష్ అంటాడు ..

"అల్ ఈజ్ నాట్ ఈక్వల్.

ఈక్వల్ ఈజ్ నాట్ అల్"