ఈ మధ్యకాలంలో విడుదలై యూట్యూబ్ లో రికార్డులు సృష్టించిన టీజర్ లలో 'ఏడు చేపల కథ' ఒకటి. యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ ని సాధించి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఎస్ జె చైతన్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఏడుగురు అమ్మాయిలను చేపలతో పోలుస్తూ ఓ యువకుడితో రొమాన్స్ చేసే విధంగా టీజర్ ని కట్ చేశారు. అసభ్యకరమైన సంభాషణలతో కూడిన ఈ టీజర్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది మేఘనా నాయుడు. టీజర్ కి విశేష స్పందన రావడం పట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సినిమాకి సంబధించిన కొన్ని విషయాలను పంచుకుంది. ''ఈ సినిమాలో ఏడు చేపలలో నేను ఓ చేపని.. అబ్బాయిల కారణంగా అమ్మాయిలు ఎలా నష్టపోతున్నారో.. అమ్మాయిల వలన అబ్బాయిలు కూడా మోసపోతున్నారనే సందేశాన్ని నా పాత్ర ద్వారా చూపించబోతున్నారు.

బోల్డ్ పాత్రలతో మంచి మెసేజ్ ని ఇవ్వబోతున్నాం. నాకు అవకాశాలు రాక ఈ సినిమాలో నటించలేదు. నాకు పాత్ర నచ్చింది అందుకే నటించా.. ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎలాంటి పాత్రలోనైనా ఇన్వాల్వ్ అయి నటించాలి. అలా అయితేనే పాత్రకు న్యాయం చేయగలం. నేను అమ్మాయినే నాకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి.

షూటింగ్ సమయంలో చుట్టూ చాలా మంది ఉంటారు. అయినా సరే బోల్డ్ గా నటించడానికి సిద్ధమయ్యానంటే ఆ పాత్రను నేను ఎంజాయ్ చేయడం వలనే సాధ్యమైంది. ఇక ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే.. ఇక్కడ కమిట్మెంట్ అడగడమనేది కామన్. ఈ రెండేళ్లలో నన్ను చాలా మంది కమిట్మెంట్ అడిగారు. ఇప్పటికీ అలాంటివి ఉన్నాయి. కానీ అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అన్ని ఇండస్ట్రీలలోనూ ఇది ఉంది. కానీ హీరోయిన్స్ ని మాత్రమే ఇలాంటివి అడగగలరు. వేరే వాళ్లను అడగలేరు'' అంటూ చెప్పుకొచ్చింది. 

ఇవి కూడా చదవండి.. 

బూతు కథకి 16 మిలియన్ వ్యూస్!

బూతు సినిమాలో బిగ్ బాస్ ఫేమ్!

18+ టీజర్: వామ్మో.. ఆర్ఎక్స్ 100కి బాబులా ఉంది!