టాలీవుడ్ లో డిఫరెంట్ కథలు చాలానే వస్తున్నాయి. అయితే అప్పుడప్పుడు కుర్రాళ్లను ఒక్కసారిగా టర్న్ చేసే A సర్టిఫికెట్ సినిమాలు కూడా ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి. కొన్ని టీజర్స్ ట్రైలర్ లతోనే ఉక్కిరిబిక్కిరి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 

అసలు విషయంలోకి వస్తే రీసెంట్ గా రిలీజైన ఏడు చేపల కథ అనే అడల్ట్ కామెడీ మూవీ టీజర్ ను చూసి ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఇప్పటికే చూసిన వారు ఆర్ఎక్స్ 100కి బాబులా ఉన్న టీజర్ అంటున్నారు. టెంప్ట్ రవి అనే క్యారెక్టర్ తో స్టార్ట్ అయ్యే టీజర్ కొన్ని సెకన్లలో కుర్రకారుని షాక్ అయ్యేలా చేసింది. రెచ్చగొట్టే ఆడవారిని చుస్తే టెంప్ట్ అయ్యే రవి పాత్ర డిఫరెంట్ గా ఉందని అంటున్నారు నెటిజన్స్. 

ఇక చివరలో వచ్చే డైలాగ్ అయితే డబుల్ మీనింగ్ గా ఉంది. ఇక వైరల్ అవుతున్న మీటూ డైలాగ్ ని కూడా వాడేశారు. కొన్ని సీన్స్ కి సెన్సార్ తప్పదని చెప్పవచ్చు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను శేఖర్ రెడ్డి నిర్మించారు.