కోలీవుడ్ ఇళయదళపతి విజయ్ అసలు స్టార్ డమ్ ఏమిటనేది సినిమా రిలీజ్ కు ముందే ఓ కొలిక్కి వచ్చేసింది. బాలీవుడ్ కంటే బారి స్థాయిలో రిలీజ్ అవుతున్న సౌత్ సినిమాలను చూసి నార్త్ స్టార్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఎప్పుడు లేని విధంగా స్టార్ హీరో విజయ్ తన సర్కార్ సినిమాను దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తేనున్నాడు. 

కేవలం ఇండియాలోనే కాకుండా విజయ్ కి విదేశాల్లో కూడా మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. దీంతో డిస్ట్రిబ్యూటర్స్ ప్రపంచంలోని 7 ఖండాల్లో ఉన్న 80 దేశాల్లో సినిమాను రిలీజ్ చేయనున్నారు. అంటే దాదాపు 1200పైగా విదేశీ స్క్రీన్లలో సర్కార్ షో ప్రదర్శించబడనుంది. చూస్తుంటే ఫస్ట్ వీక్ లోనే సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసేలా ఉందని సినీ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. 

మురగదాస్ దర్శకత్వం వహించిన సర్కార్ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. విజయ్ కెరీర్ లోనే ఈ స్థాయిలో ఏ సినిమా రిలీజ్ కాలేదు. అదే విధంగా అత్యధిక విదేశాల్లో ప్రదర్శించబడనున్న మొదటి సినిమా కూడా సర్కార్ కావడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా సినిమాను నవంబర్ 6న రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమా కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.  

సంబంధిత వార్తలు

 

విజయ్ సర్కార్: తెలుగులో గట్టిగానే రెడీ అయ్యాడు 

గుండె పగిలినంత పనైయ్యింది.. సర్కార్ కథ నాదే: మురగదాస్

విజయ్ 'సర్కార్'పై కోర్టులో కేసు.. రూ.30 లక్షలు డిమాండ్!

సర్కార్: షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ 200కోట్లు?

విజయ్ లాంటి హీరో ఇలా చేయడం సిగ్గుచేటు.. స్టార్ హీరోపై ఫైర్