టాలీవుడ్ మార్కెట్ కోసం పరభాషా నటులు ఎంతగా ప్రయత్నిస్తారో అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కూడా అదే తరహాలో మంచి టైమింగ్ లో తెలుగు రాష్ట్రాల్లో తన క్రేజ్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు. గతంలో వచ్చిన తుపాకీ - మెర్సల్ సినిమాలు పరవాలేధనిపించాయి. ఇక ఇప్పుడు సర్కార్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఈ దీపావళి 6న తెలుగు తమిళ్ లో ఒకేసారి సినిమా రిలీజ్ కానుంది. అక్కడ  దాదాపు అన్ని థియేటర్స్ ఈ ఇళయదళపతి కవర్ చేసేశాడు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి 750   థియేటర్స్ లో విజయ్ సినిమా రిలీజ్ కాబోతోంది. మురగదాస్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కడం ప్రధాన బలం కాగా విజయ్ పొలిటికల్ కథలో నటిస్తుండడంతో మరింత క్రేజ్ ఏర్పడింది. 

ఇప్పటికే ట్రైలర్స్ కి టీజర్స్ కి మంచి స్పందన వచ్చింది. సినిమా తప్పకుండా పాత రికార్డులను బద్దలు కొట్టేస్తుందని అంటున్నారు. మరి విజయ్ సర్కార్ ఎంతవరకు విజయాన్ని అందుకుంటుందో చూడాలి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఏఆర్.రెహమాన్ సంగీతం అందించాడు.