విజయ్ లాంటి హీరో ఇలా చేయడం సిగ్గుచేటు.. స్టార్ హీరోపై ఫైర్

Vijay, AR Murugadoss Get Notices From Tamilnadu Government
Highlights

తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి.. హీరో విజయ్ స్మోక్ చేస్తూ ఉన్న పోస్టర్ ను ప్రమోట్ చేయడం సిగ్గు చేటు అంటూ వ్యాఖ్యానించారు. నోటీసుల ప్రకారం తమ సినిమా పోస్టర్ ను తొలగించనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు

తమిళ స్టార్ హీరో విజయ్ అలానే దర్శకుడు మురుగదాస్ లకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ 'సర్కార్' అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను ఇటీవల చిత్రబృందం విడుదల చేసింది.

ఈ పోస్టర్ లో విజయ్ స్మోక్ చేస్తూ కనిపించాడు. దీంతో ఈ పోస్టర్ పట్ల ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఈ పోస్టర్ ను అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ నుండి తొలగించాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విజయ్ లాంటి క్రేజ్ ఉన్న హీరోలు స్మోక్ చేస్తూ పోస్టర్ లో కనిపించడం సమాజానికి మంచిది కాదని సామాజిక కార్యకర్తలు నిరసన తెలిపారు.

తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి.. హీరో విజయ్ స్మోక్ చేస్తూ ఉన్న పోస్టర్ ను ప్రమోట్ చేయడం సిగ్గు చేటు అంటూ వ్యాఖ్యానించారు. నోటీసుల ప్రకారం తమ సినిమా పోస్టర్ ను తొలగించనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. 

loader