Asianet News TeluguAsianet News Telugu

కరోనా దెబ్బ..“మాస్టర్”కు లేనట్లే, నిర్మాత ఫుల్ హ్యాపీ

ఇప్పుడున్న పరిస్దితుల్లో ఎంత క్రేజ్ వచ్చిన సినిమాకైనా బిజినెస్ దెబ్బ పడుతుంది. కానీ విజయ్ చిత్రానికి వచ్చిన ఆఫర్ కు ఇండస్ట్రీ వర్గాలే కళ్లు తేలేస్తున్నారు.ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు తీసుకున్నారు. తమిళ,తెలుగు రైట్స్ కలిపి డీల్ సెట్ అయ్యింది. ఎంత రేటు అన్నది తెలియలేదు కానీ భారీ మొత్తానికి ఇప్పటికి ఏ తమిళ సినిమాకు పెట్టని రేటుని అమెజాన్ వారు పెట్టారని తెలుస్తోంది. 

vijay Master Digital Rights Deal Signed
Author
Hyderabad, First Published Apr 22, 2020, 6:20 PM IST

“బిగిల్” వంటి సూపర్ హిట్  సినిమా  తర్వాత దళపతి విజయ్ చేస్తున్న సినిమా  “మాస్టర్” . ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకుని  రిలీజ్ కు రెడీ చేశాడు. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల చేద్దామనుకున్నారు కానీ కరోనా ఎఫెక్ట్ తో ప్రక్కన పెట్టేసారు.  “బిగిల్” సినిమా తో పాటు సమాంతరంగా విడుదలై ఇండస్ట్రీ హిట్ సాధించిన “ఖైదీ” సినిమాకు దర్శకత్వం వహించిన లోకేష్ కనగరాజు ఇప్పుడు మాస్టర్ సినిమాకు దర్శకత్వం వహించటంతో ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఇప్పుడున్న పరిస్దితుల్లో ఎంత క్రేజ్ వచ్చిన సినిమాకైనా బిజినెస్ దెబ్బ పడుతుంది. కానీ విజయ్ చిత్రానికి వచ్చిన ఆఫర్ కు ఇండస్ట్రీ వర్గాలే కళ్లు తేలేస్తున్నారు.

ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు తీసుకున్నారు. తమిళ,తెలుగు రైట్స్ కలిపి డీల్ సెట్ అయ్యింది. ఎంత రేటు అన్నది తెలియలేదు కానీ భారీ మొత్తానికి ఇప్పటికి ఏ తమిళ సినిమాకు పెట్టని రేటుని అమెజాన్ వారు పెట్టారని తెలుస్తోంది. దాంతో ఆ చిత్ర నిర్మాతలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక తెలుగు రైట్స్ ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పై మహేష్ ఎస్ కోనేరు 8.75  కోట్లకు సొంతం చేసుకున్నారు.
 
ఈ చిత్రంలో విజయ్‌ కాలేజీ ప్రొఫెసర్‌గా కనిపించనున్నాడు. విజయ్‌కు జోడీగా హీరోయిన్‌ మాళవిక్‌ మోహనన్‌ నటించనున్నారు. అలాగే ‘మాస్టర్‌’ చిత్రంలో ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్ర పోషించనున్నారు. ‘మాస్టర్‌’ విజయ్‌, విజయ్‌ సేతుపతి కలిసి నటిస్తున్న తొలి చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  
  
ఇదిలా ఉంటే ఈ తమిళ సూపర్ స్టార్ రూ.1.3 కోట్లు భారీ విరాళాన్ని ప్రకటించారు. కరోనా నివారించేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న  మద్దతుగా తన వంతుగా కేంద్రం మరియు వివిధ రాష్ట్రాల సహాయ నిధులకు విరాళాన్ని ప్ర‌క‌టించారు. 

ఆయన అందించిన డొనేషన్ మొత్తంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌హాయ నిధికి చెరో రూ.5ల‌క్ష‌లు అంటే రెండు రాష్ట్రాల‌కు రూ.10 ల‌క్ష‌ల విరాళంతో పాటు ప్రధాన మంత్రి సహాయ నిధి కి రూ. 25 లక్షలు, తమిళనాడు ముఖ్యమంత్రి నిధికి రూ. 50 లక్షలు, కేరళ సహాయ నిధికి రూ. 10 లక్షలు, కర్ణాటక మరియు పుదుచ్చేరి రాష్ట్రాల సహాయ నిధులకు చెరో రూ. 5 లక్షలు, ఫెఫ్సి అసోసియేషన్ నిధికి రూ. 25 లక్షలు ప్రకటించారు. ఈ కష్ట కాలంలో సినీ కార్మికులను,సామాన్యులను ఆదుకోవాలి. అందుకే విజయ్ ముందుకొచ్చాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios