విజయ్‌ దేవరకొండపై పలు తప్పుడు వార్తలు చాలా సందర్భాల్లో వినిపిస్తూనే ఉన్నాయి. ఆ మధ్య ఆయన స్థాపించిన విజయ్‌ దేవరకొండ ఫౌండేషన్‌పై కూడా విమర్శలు వచ్చాయి. దీనిపై ఏకంగా విజయ్‌ దేవరకొండనే క్లారిటీ ఇచ్చారు. 

తాజాగా మరిన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన నిర్మాతగా ఓ సినిమా తీస్తున్నట్టు, అందుకోసం పలు ప్రొడక్షన్స్ కంపెనీలు ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్టు వార్తలొచ్చాయి. దీనిపై విజయ్‌ దేవరకొండ టీమ్‌ స్పందించింది. తాము ఎలాంటి ఆడిషన్స్ నిర్వహించడం లేమని స్పష్టం చేసింది. 

తమ పేరుతో కొన్ని కంపెనీలు ఆడిషన్స్ నిర్వహిస్తున్నాయనే విషయాన్ని మేం గమనించాం. విజయ్‌ దేవరకొండ ప్రొడక్షన్‌ కంపెనీలకు సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే దాన్ని మా సోషల్‌ మీడియాలో అధికారికంగా ప్రకటిస్తాం. ఈ విషయాన్ని మీరు మా సోషల్‌ మీడియా అకౌంట్లలో ధృవీకరించుకోవచ్చు. ఇలాంటి వాటిపై ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకోవాలని కోరుతున్నాం. అదే సమయంలో ఇలా తప్పుగా ఆడియెన్స్ నిర్వహిస్తున్న వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని తెలిపింది. తమ పేరుని తప్పుగా వాడుకుంటున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.