సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి హరికృష్ణ ఈరోజు తెల్లవారుజామున రోడ్డు యాక్సిడెంట్ లో మృతి చెందారు. ఆయన మరణవార్తతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి
సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి హరికృష్ణ ఈరోజు తెల్లవారుజామున రోడ్డు యాక్సిడెంట్ లో మృతి చెందారు. ఆయన మరణవార్తతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల పలువురు సినీ, రాజకీయనాయకులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన మృతదేహం హైదరాబాద్ కి చేరుకోవడంతో ఒక్కొక్కరిగా హరికృష్ణ నివాసంలో ఆయన పార్థివదేహాన్ని దర్శిస్తున్నారు.
చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియా ఖాతాల ద్వారా హరికృష్ణ మృతికి సంతాప సందేశాలు పంపుతూ ఆయన కుటుంబం పట్ల సానుభూతి తెలియజేస్తున్నారు. తాజాగా హీరోయిన్ తమన్నా.. ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించింది.
'నందమూరి హరికృష్ణ గారి మరణవార్త వినగానే గుండె పగిలిపోయింది. ఆయన కుటుంబ సభ్యులకు, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ బాధాకర పరిస్థితి నుండి బయటకి వచ్చి మీరంతా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను' అంటూ రాసుకొచ్చింది.
ఇవి కూడా చదవండి..
