లవ్ మ్యారేజే చేసుకుంటా.. అమ్మాయి ఎలా ఉండాలంటే: విజయ్ దేవరకొండ

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 24, Aug 2018, 4:31 PM IST
vijay devarakonda about his future wife
Highlights

'పెళ్లిచూపులు', 'అర్జున్ రెడ్డి' రీసెంట్ గా 'గీత గోవిందం' ఇలా వరుస విజయాలతో దూకుడు మీదున్నాడు విజయ్ దేవరకొండ. యూత్ కి ఆల్ టైమ్ ఫేవరేట్ గా మారిపోయాడు. ముఖ్యంగా అమ్మాయిల్లో విజయ్ క్రేజ్ మాములుగా లేదు

'పెళ్లిచూపులు', 'అర్జున్ రెడ్డి' రీసెంట్ గా 'గీత గోవిందం' ఇలా వరుస విజయాలతో దూకుడు మీదున్నాడు విజయ్ దేవరకొండ. యూత్ కి ఆల్ టైమ్ ఫేవరేట్ గా మారిపోయాడు. ముఖ్యంగా అమ్మాయిల్లో విజయ్ క్రేజ్ మాములుగా లేదు. అయితే ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న విజయ్ తనకు కాబోయే భార్య ఎలా ఉండాలనే దానిపై స్పందించాడు.

''నాకు 40 ఏళ్లు వచ్చిన తరువాతే పెళ్లి చేసుకోవాలని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు 35 ఏళ్లకి.. నచ్చిన అమ్మాయి దొరికితే అంతకుముందే చేసుకుంటాను. నాది కచ్చితంగా ప్రేమ పెళ్లే.. ప్రస్తుతానికి నా మనసులో ఎవరూ లేరు. నా జీవితంలోకి రావాల్సిన అమ్మాయికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ అమ్మాయితో ఉన్నప్పుడు నాకు బోర్ కొట్టకూడదు. శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా ఆమె నాకు కనెక్ట్ అవ్వాలి.

ఇంట్లో ఇద్దరమే ఉన్నా.. బోర్ ఫీల్ అవ్వకూడదు. కలిసి మాట్లాడుకోవాలి, నవ్వుకోవాలి, ట్రావెల్ చేయాలి. ఆ అమ్మాయి ఏ ప్రాంతానికి చెందినదైనా పర్వాలేదు'' అంటూ కాబోయే భార్యకు ఉండాల్సిన లక్షణాల గురించి చెప్పుకొచ్చాడు. అయితే రీసెంట్ గా విజయ్ తన స్నేహితురాలు ఒక అమ్మాయిని పొగుడుతూ 'తను నా దేవత' అని కామెంట్ చేశాడు. దీంతో విజయ్ ఆల్రెడీ ప్రేమలో ఉన్నాడని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు తన మనసులో ఎవరూ లేరని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది.  

ఇవి కూడా చదవండి.. 

విజయ్ దేవరకొండ పక్కన ఎవరు చేస్తారు..? హీరోయిన్ల సమాధానం!

'నీ టైమ్ నడుస్తోంది..' విజయ్ దేవరకొండపై మహేష్ కామెంట్!

విజయదేవరకొండపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన యం.పీ. కవిత (వీడియో)

పవన్ తో విజయ్ దేవరకొండకి పోలిక.. పవన్ ఫ్యాన్స్ ఏం అంటారో?

విజయ్ దేవరకొండ షాకింగ్ రెమ్యునరేషన్!

loader