'నీ టైమ్ నడుస్తోంది..' విజయ్ దేవరకొండపై మహేష్ కామెంట్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 24, Aug 2018, 2:15 PM IST
mahesh babu tweet on vijay devarakonda
Highlights

టాలీవుడ్ అగ్రహీరో మహేష్ బాబు ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' సినిమాను చూసి ప్రశంసించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మహేష్ నటిస్తోన్న 'మహర్షి' సినిమా సెట్స్ కి వెళ్లాడు విజయ్

టాలీవుడ్ అగ్రహీరో మహేష్ బాబు ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' సినిమాను చూసి ప్రశంసించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మహేష్ నటిస్తోన్న 'మహర్షి' సినిమా సెట్స్ కి వెళ్లాడు విజయ్. అక్కడ మహేష్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లిని కలిసిన విజయ్ వారితో ఫోటో తీసుకొని ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు. 'మహేష్ సర్.. వంశీ అన్న.. మహర్షి సినిమా సెట్ కి వెళ్లాను.

మహేష్ సర్ సినిమా విడుదలైతే టికెట్ల కోసం కొట్టుకునే రోజుల నుండి ఆయనతో కలిసి సెట్ లో ఎంజాయ్ చేసే రోజు వచ్చింది. ఫుల్ లవ్' అంటూ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. విజయ్ దేవరకొండని ఉద్దేశించి చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది విజయ్ దేవరకొండకి మంచి సమయమని, ఇప్పుడు అతని టైమ్ నడుస్తోందంటూ పోస్ట్ చేశారు.

హాలిడేని ఎంజాయ్ చేయమంటూ విజయ్ కి విషెస్ తెలిపారు. విజయ్ దేవరకొండ వరుస హిట్లు అందుకుంటున్నాడనే ఉద్దేశంతో మహేష్ ఈ విధంగా ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ నటిస్తోన్న 'మహర్షి' షూటింగ్ దశలో ఉంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది. 

 

loader