'అర్జున్ రెడ్డి' సినిమా రిలీజ్ కి ముందు విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' సినిమా అంగీకరించాడు. అప్పటికి విజయ్ ఫేమ్ పెద్దగా లేదనే చెప్పాలి. ఒక హిట్ ఇచ్చిన హీరో.. అది కూడా లో బడ్జెట్ సినిమా. అయితే దర్శకుడు పరశురామ్ విజయ్ తో సినిమా చేయాలనుకుని హీరోయిన్ గా చాలా మందిని సంప్రదించడం దానికి వారు రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే పరశురామ్ ఏ హీరోయిన్ ని కలిసినా కథ విని బాగుందని చెప్పడం ఆ తరువాత హీరో విజయ్ దేవరకొండ అనగానే డ్రాప్ అవ్వడం జరిగాయట. కొందరు హీరోయిన్లు నేరుగా పరశురామ్ మొహం మీదే విజయ్ దేవరకొండ పక్కన ఎవరు నటిస్తారు..? అని సమాధానం ఇచ్చేవారట. ఈ లిస్ట్ లో టాప్ హీరోయిన్లు ఉన్నట్లు తెలుస్తోంది. అతడి పక్కన నటించడం ఇష్టం లేకే ఓ హీరోయిన్ కోటి రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. మరొక హీరోయిన్ ఖాళీగానే ఉన్నా.. డేట్స్ ఇష్యూ అని చెప్పేసి తప్పించుకుందట.

రీతూవర్మకి నటించాలని ఉన్నా.. తమిళంలో దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉండడం వలన 'గీత గోవిందం' వదిలేసుకుంది. కొందరు హీరోయిన్లు విజయ్ దేవరకొండకి బదులుగా వరుణ్ తేజ్ ని హీరోగా పెట్టమని సజెషన్స్ కూడా ఇచ్చేవారట. ఇలా అందరిని అడిగిన పరశురామ్ ఫైనల్ గా రష్మిక దగ్గర ఆగాడు. కథ నచ్చడంతో హీరో, ఇతర విషయాలు పట్టించుకోకుండా సినిమాలో నటించింది రష్మిక. ఇక ఆ సినిమా రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిందే. 

ఇది కూడా చదవండి..

'నీ టైమ్ నడుస్తోంది..' విజయ్ దేవరకొండపై మహేష్ కామెంట్!