Asianet News TeluguAsianet News Telugu

‘వీర భోగ వసంత రాయలు’:టాక్ నిజమైతే... అది ఘోరమైన తప్పే

గత కొంతకాలంగా   తెలుగు సినిమాలు ఓవర్ సీస్ మార్కెట్ లో భారీగానే రిలీజవుతున్నాయి. అక్కడ  ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు  సినిమా ఉంటే  మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. అక్కడ మంచి టాక్ వచ్చిందంటే ఇక్కడ మల్టిప్లెక్స్ లలో ఓపినింగ్స్ అదిరిపోతాయి. 

veerabhoga vasantharayalu movie talk
Author
Hyderabad, First Published Oct 25, 2018, 9:27 AM IST

గత కొంతకాలంగా   తెలుగు సినిమాలు ఓవర్ సీస్ మార్కెట్ లో భారీగానే రిలీజవుతున్నాయి. అక్కడ  ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు  సినిమా ఉంటే  మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. అక్కడ మంచి టాక్ వచ్చిందంటే ఇక్కడ మల్టిప్లెక్స్ లలో ఓపినింగ్స్ అదిరిపోతాయి. 

ఈ విషయం గమనించిన‘వీర భోగ వసంత రాయలు’ టీం క్యాష్ చేసుకోవలనుకుంది . మూడు రోజుల ముందే యుఎస్‌లో ప్రీమియర్లు వేసి సినిమా పై పాజిటివ్ బజ్ క్రియోట్ చేయలనే ప్లాన్ చేసింది. అయితే ఈ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యిందా?.నారా రోహిత్ టీం కి కలిసొచ్చిందా ?

నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ‌విష్ణు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న సినిమా వీరభోగ వ‌సంత రాయ‌లు. రేపు శుక్రవారం (అక్టోబ‌ర్ 26న) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.  ఈ సినిమా ఓవ‌ర్సీస్ హ‌క్కుల‌ను ఫ్లై హై సినిమాస్ సొంతం చేసుకుంది.  

ఈ చిత్రం ప్రీమియ‌ర్స్ ను ఓవ‌ర్సీస్ డిస్ట్రిబ్యూట‌ర్లు రిలీజ్ కి  మూడు రోజుల ముందే ప్లాన్ చేసారు. దాంతో ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది.  సినిమాపై ఎంత  నమ్మకం లేకపోతే   చిత్ర యూనిట్ ఇలాంటి ధైర్యం చేస్తుందని చర్చ మొదలై టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అక్కడిదాకా అంతా పాజిటివ్ విషయమే. అయితే ఊహించని విధంగా...ఈ సినిమా ప్రీమియర్స్ నుంచి నెగిటివ్ టాక్ మొదలైంది. 

యుఎస్ నుంచి తెలుగు వెబ్ సైట్స్ నడుపుతున్న వాళ్లు...ఈ విషయం లీక్ చేసి హైలెట్ చేయటం మొదలెట్టారు. దాంతో పాజిటివ్ బజ్ కాస్తా...ఒక్కసారిగా బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా మారిపోయింది.  ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఓపినింగ్స్ పై పడుతుంద ని భావిస్తున్నారు. అనవసరంగా కొరివితో తల గోక్కున్నట్లు అయ్యిందే అంటున్నారు. 

అయితే ఓవర్ సీస్ ప్రేక్షకులు వేరు...ఇక్కడ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల అభిరుచులు వేరు. కాబట్టి టాక్ ఒకటే కావాలని రూల్ లేదుగా..చూద్దాం..రేపటి దాకా..కంగారుపడి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయటం ఎందుకు.

ఆర్.ఇంద్రసేన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రియ శరన్, శ్రీ విష్ణు , సుధీర్ బాబు ముఖ్య పాత్రల్లో నటించారు. ఎంతో వైవిధ్యంగా, కొత్తగా సినిమా ట్రైలర్స్, టీజర్స్ ని  రిలీజ్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీని, ఎక్స్ పెక్టేషన్స్‌ను మరింత పెంచుతున్నారు. ఈ సినిమాకు మార్క్ కే రాబిన్ సంగీతం అందించారు. 

ఇవి కూడా చదవండి.. 

సుధీర్ బాబు హర్ట్ అవడానికి అసలు కారణం ఇదేనా?

నారా వారబ్బాయి.. ఇలా అయితే కష్టమే?

ప్రణయ్ కోసం సినిమా పాట!

రామెజిఫిల్మ్ సిటి లో సుధీర్‌బాబు పాత్ర‌తో ప్రారంభ‌మైన 'వీర భోగ వ‌సంత రాయ‌లు' షూటింగ్‌

గుండు,టాటూలు కాదు.. సింపుల్ లుక్ తో ఆకట్టుకున్నాడు!

Follow Us:
Download App:
  • android
  • ios