'బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు' అంటూ వివాదాస్పద కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు నాగబాబు. ఈ విషయంపై నాగబాబుకి నందమూరి అభిమానుల నుండి వ్యక్తిరేకత రావడంతో మరో వీడియో విడుదల చేశాడు నాగబాబు.

అందులో బాలకృష్ణ మంచి కమెడియన్ అంటూ ఒకప్పటి కమెడియన్ బాలకృష్ణ గురించి మాట్లాడారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ మరింత రెచ్చిపోయారు. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ నటించిన 'అంతరిక్షం' సినిమా టార్గెట్ చేశారు. సినిమాపై నెగెటివిటీ క్రియేట్ చేస్తామని బెదిరించారు.

తాజాగా వరుణ్ తేజ్ ఈ విషయంపై స్పందించారు. తన తండ్రి నాగబాబు.. బాలకృష్ణపై అటువంటి కామెంట్స్ ఎందుకు చేశారో వివరిస్తూ.. ''బాలకృష్ణ గారి గురించి నాన్న చేసిన కామెంట్స్ ని నేను అర్ధం చేసుకోగలను. ఎందుకంటే పవన్ బాబాయ్ గురించి బాలయ్య గారు కూడా కొన్ని కామెంట్లు చేశారు.

తమ్ముడి గురించి తప్పుగా మాట్లాడాడం నాన్నగారికి నచ్చలేదు. ఆయన హర్ట్ అయ్యాడు. దీంతో ఆయన కూడా అలాగే రియాక్ట్ అయ్యారు'' అంటూ చెప్పుకొచ్చాడు. వరుణ్ తేజ్ నటించిన 'అంతరిక్షం' సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

బాలకృష్ణ మంచి కమెడియన్: నాగబాబు వ్యాఖ్య!

బాలయ్య, నాగబాబు ఎపిసోడ్.. టాలీవుడ్ ఇన్సైడ్ టాక్ ఏంటంటే..?