మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ బిగ్ బాస్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చాడు. ఆదివారం రోజు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. బిగ్ బాస్ షోకి తమ చిత్రాలని ప్రమోట్ చేసుకునేందుకు పలువురు హీరోలు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రామ్, నాని లాంటి హీరోలు బిగ్ బాస్ 3కి గెస్ట్ లుగా హాజరయ్యాయి. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాగ్ బాస్ వేదికపై నాగార్జునతో కనిపించాడు. 

గద్దలకొండ గణేష్ ప్రచారంలో భాగంగా వరుణ్ తేజ్ బిగ్ బాస్ షోకి హాజరయ్యాడు. ఆ ప్రోమోని బిగ్ బాస్ నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. వరుణ్ తేజ్, బిగ్ బాస్ హౌస్ మేట్స్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. శ్రీముఖి, హిమజ, పునర్నవి వరుసగా వరుణ్ తేజ్ కు లవ్ ప్రపోజ్ చేశారు. 

పునర్నవిపై వరుణ్ తేజ్ వేసిన సెటైర్ నవ్వులు పూయిస్తోంది. వరుణ్ తేజ్ కు ప్రపోజ్ చేసే క్రమంలో..'నాకు ప్రపోజ్ చేయడం కొత్త' అంటూ పునర్నవి తడబడింది. నాకు లవ్ ప్రపోజ్ చేయడానికి ఈ అమ్మాయి తడబడుతోంది అంటే ఆల్రెడీ ఎవరికో ప్రపోజ్ చేసింది సర్ అని వరుణ్ నాగార్జునతో అన్నాడు. నాగార్జున నవ్వుతూ వరుణ్ షోని బాగా ఫాలో అవుతున్నట్లున్నాడు అని అన్నారు. 

మోతెక్కిస్తున్న 'గద్దలకొండ గణేష్'.. 2వ రోజు కలెక్షన్స్!

రాహుల్ ఎలిమినేషన్ తో షాక్ ఇచ్చిన బిగ్ బాస్.. అసలు విషయమేమిటంటే..?