తమిళంలో జిగర్తాండ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ చిత్రానికి గద్దలకొండ గణేష్ ని రీమేక్ గా దర్శకుడు హరీష్ తెరకెక్కించారు. ఒరిజినల్ కథలో దర్శకుడు హరీష్ కొన్ని మార్పులు చేశారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన గద్దలకొండ గణేష్ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. 

మాస్ గెటప్ లో వరుణ్ తేజ్ నటన, ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ రీమిక్స్, జర్రా జర్రా సాంగ్, కామెడీ ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచాయి. ఫిదా, తొలి ప్రేమ లాంటి చిత్రాల్లో లవర్ బాయ్ గా కనిపించిన వరుణ్ ఈ చిత్రంలో రఫ్ లో అదరగొట్టాడు. ప్రేక్షకులు ఈ చిత్రానికి ఫిదా కావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జోరు బావుంది. 

తొలిరోజే వరుణ్ తేజ్ కెరీర్ లోనే అత్యధికంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 5.5 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఇక శనివారం రోజు కూడా గద్దలకొండ గణేష్ చిత్రం బాక్సాఫీస్ వద్ద పట్టు నిలుపుకుంది. రెండవరోజు తెలుగురాష్ట్రాల్లో 3.45 కోట్ల షేర్ రాబట్టింది. 

మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రెండు రోజుల వసూళ్లు 9 కోట్లకు పైగా నమోదయ్యాయి. గద్దలకొండ గణేష్ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్ల వరకు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర పంపిణి హక్కులు 20 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇప్పటికే దాదాపుగా సగం రెవెన్యూని ఈ చిత్రం రికవరీ చేసింది. 

శనివారం కంటే ఆదివారం వసూళ్లు మరింత ఎక్కువగా ఉండబోతున్నట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నైజాంలో 3 కోట్లకు పైగా షేర్ రాబట్టిన ఈ చిత్రం, సీడెడ్ లో 1.4 కోట్లు, గుంటూరులో 94 లక్షలు.. ఈస్ట్, వెస్ట్ గోదావరిలో కలిపి 1.5 కోట్లు, కృష్ణాలో 69 లక్షల షేర్ రాబట్టింది. యుఎస్ లో మాత్రం గద్దలకొండ గణేష్ వసూళ్లు స్లోగా ఉన్నాయి. ఇప్పటివరకు 2 లక్షల డాలర్లు వాసులు చేసినట్లు సమాచారం.