మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీపై వర్మ కొన్ని సటైర్స్ వేశారు. కలారి యుద్ధ విద్యలో పోజులిచ్చిన మంచు లక్ష్మిని ఉద్దేశిస్తూ.. 'ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టని వారికి నేను ఒక లక్ష రూపాయలు ఇవ్వను..' అంటూ ట్వీట్ చేశారు.
రామ్ గోపాల్ వర్మ (Ram gopal varma)ఎవరినీ వదలడు. తనా మనా, ఆడా మగా అనే తేడా ఉండదు. ఎవరినైనా మనసుకు అనిపించింది అనేయడమే. సాధారణంగా ప్రతి మనిషి మెదడులో నెగిటివ్ థాట్స్ ఉంటాయి. ఎదుటోళ్లు బాధపడతారని, సభ్యత కాదని జనాలు అవి బయటపెట్టరు. వర్మ మాత్రం వాటిని దాచుకోకుండా చెప్పేస్తాడు. తాజాగా మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీపై వర్మ కొన్ని సటైర్స్ వేశారు. కలారి యుద్ధ విద్యలో పోజులిచ్చిన మంచు లక్ష్మిని ఉద్దేశిస్తూ.. 'ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టని వారికి నేను ఒక లక్ష రూపాయలు ఇవ్వను..' అంటూ ట్వీట్ చేశారు.
మరో ట్వీట్ లో 'హే మంచు లక్ష్మి (Manchu lakshmi)నువ్వు చేయని పనంటూ ఏదీ లేదా? నువ్వు అద్భుతంగా ముద్దలు పెడుతున్నావ్. నాకళ్ళను నేను నమ్మలేక పోతున్నాను అంటూ మరో ట్వీట్ చేశాడు. ప్రతి పనిలో వేలు పెడతావ్ ఎందుకు? అన్నట్లు వర్మ సెటైర్ ఉంది. అయితే వర్మ సెటైర్ ని మంచు లక్ష్మి పాజిటివ్ గా తీసుకుంది.
వర్మ ట్వీట్ కి సమాధానంగా ‘వావ్ మీరు నన్ను పొగిడేశారు.. నా జీవితానికి ఇది చాలు. అవును నా వల్ల కానిదంటూ ఏమీ లేదు. నటిగా నేను ఏదైనా చేయగలను. ఎప్పుడూ చెప్పేదే నేను ఆర్టిస్టిక్ కిల్లర్ ని’ అంటూ ట్వీట్ చేశారు.
మంచు లక్ష్మి ఇంతకు మించిన దారుణమైన ట్రోల్స్, కామెంట్స్ చూశారు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే మంచు ఫ్యామిలీపై, మంచు లక్ష్మి ఇంగ్లీష్, తెలుగు యాక్సెంట్ పై వందల కొలది ట్రోల్, సెటైరికల్ వీడియోలు ఉంటాయి.
Also read ఆర్మి అధికారి సాయితేజ కుటుంబానికి అండగా మంచు విష్ణు..
అలాంటివి ఎన్నో చూసిన మంచు లక్ష్మికి ఇది పెద్ద లెక్క కాదు. పర్సనల్ గా , ప్రొఫెషనల్ గా మంచు లక్ష్మిపై తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో దాడి జరుగుతున్నా.. ఆమె పట్టించుకోరు. జస్ట్ విని, చదివి నవ్వుకుంటారు. జీవితంలో ఏమీ సాధించలేని పనికి మాలిన వాళ్ళు మన ప్రయత్నాలపై చేసే నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోకూడదు. ఆ కామెంట్స్ ని పరిగణనలోకి తీసుకుంటే మనం ఎదగలేమని మంచు లక్ష్మి అంటారు.
Also read RRR Trailer: చరణ్ లేకుండానే ముంబైలో హిందీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్.. కారణం ఇదే!
