Asianet News TeluguAsianet News Telugu

ఆర్మి అధికారి సాయితేజ కుటుంబానికి అండగా మంచు విష్ణు..

సాయితేజ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా `మా`(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌) అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు.

maa president manchu vishnu help to army officer sai teja family
Author
Hyderabad, First Published Dec 9, 2021, 6:35 PM IST

తమిళనాడులోని కూనూరు అటవి ప్రాంతంలో బుధవారం జరిగిన హెలికాఫ్టర్‌ ప్రమాదంలో 13 మంది ఆర్మీ అధికారులు కన్నుమూసిన విషయం తెలిసిందే. వారిలో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్ నాయక్ బి. సాయితేజ మృతి చెందారు. సాయితేజ మరణ వార్తతో ఆయన స్వగ్రామం రేగడపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. సాయితేజ భార్య, ఫ్యామిలీ కన్నీరుమున్నీరవుతున్నారు. 

సాయితేజ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా `మా`(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌) అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. విధి నిర్వహణలో మృతి చెందిన జవాను సాయితేజ కుటుంబ సభ్యులను గురువారం మంచు విష్ణు పరామర్శించారు. మంచు విష్ణు `మా` అధ్యక్షుడిగా, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల సీఈఓగా పనిచేస్తున్న విసయం తెలిసిందే.  

also read: Lance Naik Sai Teja: శోకసంద్రంలో సాయితేజ కుటుంబం.. స్వగ్రామంలోనే అంత్యక్రియలకు ఏర్పాట్లు.. చివరి మాటలు ఇవే..

మదనపల్లిలోని ఎస్ బి ఐ కాలనీలో ఉంటున్న సాయితేజ సతీమణి శ్యామలకు ఫోన్ చేసి మాట్లాడారు మంచు విష్ణు. యుక్త వయస్సులోనే దేశ భద్రతను రక్షించే అత్యంత గొప్పదైన సీడీఎస్ చీఫ్ సెక్యూరిటీ అధికారిగా ఉన్న సాయితేజ అకాల మరణం పొందడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. సాయితేజ ఫ్యామిలీకి తన వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. సాయితేజ ఇద్దరు పిల్లలు మోక్షజ్ఞ (05), దర్శిని (02) లను తన స్వంత బిడ్డల సంరక్షిస్తానని, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల్లో వారికి పూర్తి ఉచితంగా చదువు, హాస్టల్ సౌకర్యం కల్పిస్తానని ఆయన హామి ఇచ్చారు. 10 రోజుల్లో మదనపల్లికి వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడుతానని ఆయన శ్యామలకు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios