హిందీ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, నిర్మాత దానయ్య, హీరోయిన్ అలియా భట్ తో పాటు బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవ గణ్ పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్ కి రామ్ చరణ్ పాల్గొనకపోవడం తో ఆయన అభిమానులు నిరాశకు గురయ్యారు. 


ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ (RRR Trailer) రిలీజ్ ఈవెంట్ నిన్న ముంబైలో నిర్వహించారు. హిందీ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, నిర్మాత దానయ్య, హీరోయిన్ అలియా భట్ తో పాటు బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవ గణ్ పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్ కి రామ్ చరణ్ పాల్గొనకపోవడం తో ఆయన అభిమానులు నిరాశకు గురయ్యారు. అదే సమయంలో రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ హిందీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి ఎందుకు వెళ్లలేదని ఆరా తీస్తున్నారు. 


ఇక రామ్ చరణ్ (Ram Charan)ముంబై వెళ్లకపోవడానికి కారణం మరదలు పెళ్లి అని తెలుస్తుంది. రామ్ చరణ్ వైఫ్ ఉపాసన చెల్లి అనుష్పాల వివాహం డిసెంబర్ 8న బుధవారం ఘనంగా జరిగింది. అనుష్పాల పెళ్లి వేడుకలు తెలంగాణా రాష్ట్రంలోని దోమకొండలో జరుగుతున్నాయి. ఈ పెళ్లి వేడుకలకు రామ్ చరణ్ హాజరు కావడం జరిగింది. మరదలు అనుష్పాల పెళ్లి వేడుకల్లో రామ్ చరణ్ డాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 


ఇక నిన్న హైదరాబాద్ లో జరగాల్సిన ఆర్ ఆర్ ఆర్ ప్రెస్ మీట్ వాయిదా పడింది. రామ్ చరణ్ కోసమే ఈ కార్యక్రమం వాయిదా వేసినట్లు సమాచారం. నేటి నుండి రామ్ చరణ్ అందుబాటులో ఉంటారని తెలుస్తుండగా.. జోరుగా ప్రచార కార్యక్రమాలు జరపనున్నారు. ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ వేడుకలు పలు నగరాల్లో నిర్వహించనున్నట్లు రాజమౌళి ఇది వరకే తెలిపారు. 

Also read‘RRR’:ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? అఫీషియల్ గా చెప్పేసారు
అలాగే బెంగుళూరు, చెన్నై నగరాల్లో కూడా ఆర్ ఆర్ ఆర్ టీమ్ ప్రెస్ మీట్స్ ఏర్పాటు చేయనుంది. ఆర్ ఆర్ ఆర్ విడుదలకు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండగా... భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. నిన్న విడుదలైన ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. అన్ని భాషల్లో ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ముఖ్యంగా నార్త్ ప్రేక్షకులు ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్ లుక్స్ , డైలాగ్స్, యాక్షన్ కి ఫిదా అయినట్లు సమాచారం. 

Also read RRR Movie: రాజమౌళి కోసం ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది ?