తెలుగు ఓటీటీ పోర్టల్‌ ఆహా ఊపందుకుంది. సినిమాలతో పాటు కొత్త కొత్త వెబ్‌ సిరీస్‌లకు శ్రీకారం చుడుతోంది.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో హవా చూపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఓ కొత్త వెబ్‌ సిరీస్‌ ఆహా ఓటీటీలో విడుదల కాబోతున్నట్లుగా ప్రకటించారు. 'అద్దం' అనే టైటిల్‌తో రూపొందిన  ఈ వెబ్‌ సిరీస్‌ను విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు మణిరత్నం గురువారం అధికారికంగా ప్రకటించారు. ఫస్ట్ ఎపిసోడ్‌ అక్టోబర్‌ 16న టెలికాస్ట్ కాబోతున్నట్లుగా ప్రకటించారు.  ఆ  వెబ్ సీరీస్ ట్రైలర్ ని విడుదల చేసారు. మంచి రెస్పాన్స్ వస్తోంది. 

వన్ థీమ్ త్రీ స్టోరీస్! అంటూ కథేంటో చెప్పేశారు ట్యాగ్ లైన్ తోనే. మూడు కథల్లో ఎఫైర్ల వ్యవహారం చూపిస్తున్నారా? అన్నది ట్రైలర్ లో మార్మికంగా కనిపిస్తోంది. ఆ మూడు జంటల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి  అన్నది సస్పెన్స్ ఎలిమెంట్. లైఫ్ ని ఎలా ఎదుర్కోవాలో స్వీయ ప్రతిబింబం ప్రయాణం తదనుగుణంగా టైటిల్ ని నిర్ణయించారట. ట్రైలర్ ఆద్యంతం భావోద్వేగాలతో నిండిన భార్యాభర్తల సంఘర్షణలతో నిండిపోయింది.

 
కరోనా కారణంగా ప్రభుత్వం విధించిన అన్ని నిబంధనలను పాటిస్తూ.. భరత్‌ నీలకంఠం, శివ ఆనంద్‌, సర్జన్‌లు ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రసన్న, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, జయప్రకాశ్‌, రోహిని, కిషోర్‌ వంటి నటీనటులు ఈ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. కొత్త ప్రయాణం, కొత్త మీడియం. అక్టోబర్ 16న “అద్దం” కధల సంపుటిలో ఇంకొక విభిన్న పాత్రతో మీ ముందుకు.. అంటూ వెబ్‌ సిరీస్‌లో అడుగుపెడుతున్నట్లుగా రోహిణి ట్వీట్‌లో పేర్కొన్నారు.