లాక్‌డౌన్ వ‌ల‌న గ‌త రెండు నెల‌లుగా థియేట‌ర్స్ అన్నీ మూత ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. షూటింగ్ లు సైతం ఆగిపోయాయి. ఇలా నీరసంగా,నిస్తేజంగా ఉన్న పరిస్దితుల్లో  సీఎం కేసీఆర్‌తో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు చ‌ర్చ‌లు జ‌రిపిన త‌ర్వాత షూటింగ్స్ పై కాస్త స్ప‌ష్ట‌త వ‌చ్చింది. జూన్ మధ్యనుంచి షూటింగ్ లు తగు జాగ్రత్తలతో ప్రారంభించుకోవచ్చు అని అన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే షూటింగ్ సగం జరిగి పెండింగ్ లో పడ్డ ప్రాజెక్టులలో కదిలిక వస్తోంది. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం వకీల్ సాబ్ సైతం ఈ లిస్ట్ లో ఉంది. వకీల్ సాబ్ కు ఇంకా 30 రోజులు షూటింగ్ పెండింగ్ ఉంది. 

దాంతో నిర్మాత దిల్ రాజు సాధ్యమైనంత త్వరలో షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ కు రెడీ చేయాలనుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో ముప్పై రోజులు పాటు ఏ ఇబ్బంది లేకుండా ఈ కరోనా టైమ్ లో షూటింగ్ ఎలా చేయాలన్నదానిపై పెద్ద కసరత్తు చేస్తున్నారట. ఎంత తక్కువలో తక్కువ క్రూ తీసుకున్నా..మినిమం నలభై మంది అయినా అవసరం అవుతారని, వాళ్లను మ్యానేజ్ చేస్తూ,షూటింగ్ జరిగినన్ని రోజులూ అన్ని జాగ్రత్తలతో ఉండటం అనేది ఛాలెంజ్ లాంటిదే అని భావిస్తున్నారట. ఇదో 30 రోజుల టెన్షన్ అని, సక్సెస్ అయితే ధీమాగా మిగతా షూట్స్ తో ముందుకు వెళ్లచ్చు అని భావిస్తున్నారట. 

ఈ మేరకు టీమ్ తో డిస్కషన్స్ జరుగుతున్నాయి. దాంతో దిల్ రాజు ..పవన్ ని కలిసి ఓ రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. జూన్ నెలలో డేట్స్ ని ఎవరికీ ఇవ్వవద్దని, ఏ పోగ్రామ్ లు పెట్టుకోవద్దని ఆయన కోరారట. దానికి పవన్ సైతం పాజిటివ్ గా స్పందించినట్లు చెప్తున్నారు. పవన్ సైతం ..క్రిష్ సినిమా ప్రారంభమయ్యే లోగా వకీల్ సాబ్ ని పినిష్ చేయాలనుకుంటున్నారు. అతి తక్కువ క్రూ మెంబర్స్ తో , జాగ్రత్తలతో ఈ సినిమాని పూర్తి చేయటానికి దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.

 అన్ని అనుకున్నట్లున్నట్లు జరిగితే దసరాకు సినిమా రిలీజ్ చేసారు. ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్సమెంట్ త్వరలో రానుంది.  ఆగస్టులో తిరిగి థియేటర్స్ ఓపెన్ అవుతాయనే ఓ ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో ముందుగా వచ్చే సినిమా పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ అని అంటున్నారు. దాదాపు రెండేళ్ళ తర్వాత పవన్ తిరిగి మేకప్ వేసుకోగా, ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత వి, అరణ్య, నిశ్శబ్దం వంటి బడా చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు ఒక్కొక్కటిగా రానున్నాయి.