బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రాతెలా తనకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇన్స్పిరేషన్ అంటుంది. తన లేటెస్ట్ మూవీ బ్లాక్ రోజ్ మూవీ కోసం ఆమె  సౌత్ ఇండియన్ స్టెప్స్ వేసి అలరిస్తుందట. దాని కోసం ఆమె ఓ శాంపిల్ స్టెప్ వేసిన  వీడియో ట్విట్టర్ లో పంచుకుంది. తనకు డాన్స్ లో ఇన్స్పిరేషన్ అల్లు అర్జున్ అని చెప్పడంతో బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బాలీవుడ్ లో పాప్యులర్ హీరోయిన్ గా ఉన్న ఊర్వశి అల్లు అర్జున్ డాన్స్ ని ఆ స్థాయిలో మెచ్చుకోవడం చెప్పుకోదగ్గ విషయమే. 

అల వైకుంఠపురంలో మూవీ భారీ హిట్ తరువాత బాలీవుడ్ లో కూడా బన్నీ పేరు వినిపిస్తుంది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆ మూవీలోని అల్లు అర్జున్ నటనను, సాంగ్స్ లో ఆయన స్టెప్స్ ని ప్రత్యేకంగా కొనియాడారు. శిల్పా శెట్టి స్వయంగా బుట్ట బొమ్మా సాంగ్ కి స్టెప్స్ వేసి చూపించారు. మరోమారు అల్లు అర్జున్ డాన్సింగ్ స్కిల్స్ గురించి హీరోయిన్ ఊర్వశి రాతెలా మాట్లాడం హాట్ టాపిక్ గా మారింది. 

దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప మూవీతో అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా డీగ్లామర్ రోల్ చేస్తున్నారు. ఐతే ఈ చిత్రంలో ఓ ఐటెం సాంగ్ కోసం ఊర్వశి రాతెలాను అనుకుంటున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఊర్వశి తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాగా బన్నీ పుష్ప నెక్స్ట్ షెడ్యూల్ కోసం సిద్ధం అవుతున్నారు.