Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్ లో రోజుకో ట్విస్ట్ తో రసవత్తరంగా తయారవుతోంది. రోజు రోజుకి పరిణామాలు మారిపోతున్నాయి. రోహిత్ చాలా సైలెంట్ అయిపోయాడు. తన ఆటఏంటో తాను చూసుకుంటున్నాడు. అయినా సరే.. ఈ వీక్ డేంజర్ జోన్ లో ఉన్నాడు.

రసవత్తరంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. ప్రస్తుతం హౌస్‌లో రన్ అవుతున్న 'బీబీ హోటల్' (BB Hotel) టాస్క్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ఈ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్లను వివిధ జోన్లుగా విభజించి విభిన్న పాత్రలు కేటాయించారు. రెడ్ జోన్ కంటెస్టెంట్లు హోటల్ వర్కర్లుగా, ఎల్లో జోన్ మెంబర్లు ఓనర్లుగా, అలాగే గ్రీన్ జోన్ సభ్యులు గెస్టులుగా హౌస్‌లో సందడి చేస్తున్నారు.

ఈ వారం ఆటను మరింత రసవత్తరంగా మార్చేందుకు బిగ్ బాస్ సరికొత్తగా 'స్నేక్స్ అండ్ ల్యాడర్స్' (Snakes and Ladders) గేమ్‌ను పరిచయం చేశారు. ఈ గేమ్‌లో రెండు టీమ్‌లుగా విడిపోయిన కంటెస్టెంట్లు పోటీ పడ్డారు. ప్రతి టీమ్‌లో ఒక ఓనర్, ఇద్దరు వర్కర్ల చొప్పున సభ్యులు పాల్గొని హోరాహోరీగా తలపడ్డారు. డైస్‌ను రోల్ చేయడం, దానికి తగినట్లుగా పటంలో ముందుకు కదలడం వంటి అంశాలతో ఈ ఆట అత్యంత ఆసక్తికరంగా సాగింది.

అయితే ఈ గేమ్‌ కేవలం గెలుపు ఓటముల మీదే కాకుండా, ఆట మధ్యలో వచ్చే ఫన్నీ పనిష్మెంట్లతో మరింత వినోదాన్ని పంచింది. కొన్ని బాక్సులలో ఉన్న నిబంధనల ప్రకారం కంటెస్టెంట్లు విచిత్రమైన శిక్షలను అనుభవించాల్సి వచ్చింది. ఉదాహరణకు, ఒక సందర్భంలో సుధీర్ తలకిందులుగా కాసేపు ఉండాల్సి రావడం అందరినీ నవ్విచింది. మరోవైపు కంటెస్టెంట్ వంశీ తనదైన శైలిలో ఓల్డ్ ఫారెన్ మ్యాన్‌లా నటించి అదరగొట్టాడు. వంశీ మరియు శ్వేత కలిసి చేసిన కామెడీ టైమింగ్ హౌస్‌లో నవ్వులు పూయించింది. కష్టతరమైన టాస్కుల మధ్యలోనూ ఇలాంటి సరదా సన్నివేశాలు రావడంతో హౌస్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

డేంజర్ జోన్ నుంచి బయటపడింది ఎవరు?

ఇక గత వారంలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే, డబుల్ ఎలిమినేషన్ రూపంలో బిగ్ బాస్ కంటెస్టెంట్లకు గట్టి షాక్ ఇచ్చారు. ఆడియెన్స్ ఓట్లతో పాటు గ్రీన్ జోన్ కంటెస్టెంట్ల మెజారిటీ ద్వారా షాలినీ పటేల్ హౌస్ నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. ప్రస్తుతం నడుస్తున్న ఎనిమిదో వారంలో కూడా ఆటలో రాణించని వారు లేదా రెడ్ జోన్‌లోనే ఉండే కంటెస్టెంట్లు సడెన్ ఎలిమినేషన్ గండం ఎదుర్కొనే అవకాశం ఉందని బిగ్ బాస్ ముందే హెచ్చరించారు. దీంతో కంటెస్టెంట్లు అందరూ తమ జోన్‌ను మార్చుకోవడానికి, సేఫ్ జోన్‌లోకి వెళ్లడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.

మొత్తానికి, గత కొన్ని రోజులుగా ఉన్న సీరియస్ వాతావరణాన్ని పక్కన పెట్టి, ఈ 'స్నేక్స్ అండ్ ల్యాడర్స్' టాస్క్ ద్వారా కంటెస్టెంట్లు అందరూ కలిసి ఎంజాయ్ చేశారు. ఈక్రమంలో బీబీ హోటల్ టాస్క్ కంప్లీట్ అయ్యింది. ఈటాస్క్ లో అత్యధిక స్టార్స్ సాధించి రామ్ ప్రసాద్, వర్షిణి రెడ్ జోన్ నుంచి డైరెక్ట్ గా గ్రీన్ జోన్ లో కి వచ్చారు. వంశీ మాత్రం ఎక్కువ డబ్బులు రావడంతో రెడ్ జోన్ నుంచి ఎల్లోలోకి వచ్చారు. ఫైనల్ గా రోహిత్ ,వంశీ, దేబ్జానీ, శివ, సుధీర్, ఝాన్సీ నామినేషన్స్ లో ఉన్నారు. మరి ఈ వారం ఇంటి నుంచి బయటకు ఎవరు వెళ్తారో చూడాలి.