MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss 10 Telugu: వర్షిణికి ముద్దు పెడుతు దొరికిపోయిన ముఖేష్.. ఝాన్సీకి బిగ్ బాస్ వార్నింగ్..

Bigg Boss 10 Telugu: వర్షిణికి ముద్దు పెడుతు దొరికిపోయిన ముఖేష్.. ఝాన్సీకి బిగ్ బాస్ వార్నింగ్..

Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో 52వ రోజు హౌస్ లో పరిణామాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇంట్లో ప్రారంభమైన ‘బీబీ హోటల్’ టాస్క్‌లో కంటెస్టెంట్లు పోటీపడుతుండగా, మరోవైపు త్రిగుణ్ నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి.

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 28 2026, 11:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బీబీ హోటల్ టాస్క్.. మూడు జోన్లకు మూడు పాత్రలు
Image Credit : Jio Hotstar

బీబీ హోటల్ టాస్క్.. మూడు జోన్లకు మూడు పాత్రలు

బిగ్ బాస్ ఇంటిని హోటల్‌గా మార్చి కంటెస్టెంట్లకు కొత్త టాస్క్ ఇచ్చారు. ఇందులో రెడ్ జోన్‌లో ఉన్నవారు హోటల్ సిబ్బందిగా, ఎల్లో జోన్‌లో ఉన్నవారు హోటల్ యజమానులుగా, గ్రీన్ జోన్‌లో ఉన్న గోట్ సభ్యులు అతిథులుగా వ్యవహరించాల్సి ఉంటుంది. హోటల్ సిబ్బంది అందించే సేవలు, యజమానులు చూపించే ఆతిథ్యం, అతిథుల నుంచి వచ్చే డబ్బులు, స్టార్ల ఆధారంగా ఈ టాస్క్ ముందుకు సాగుతుంది.

గ్రీన్ జోన్‌లో ఉన్న సభ్యుల వద్ద డబ్బులు, స్టార్లు ఉండటంతో వాటిని సంపాదించేందుకు మిగతా కంటెస్టెంట్లు వ్యూహాలు రచించారు. టాస్క్ ముగిసే సమయానికి ఎవరి వద్ద ఎక్కువ డబ్బులు, స్టార్లు ఉంటాయో వారికి కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచే అవకాశాలు లభించనున్నాయి. అయితే రోహిత్‌కు గతంలో విధించిన శిక్ష కారణంగా కెప్టెన్సీ పోటీలో నిలిచే అవకాశం ఉండదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఝాన్సీ తప్పిదం.. బిగ్ బాస్ ఆగ్రహం
Image Credit : Asianet News

ఝాన్సీ తప్పిదం.. బిగ్ బాస్ ఆగ్రహం

బీబీ హోటల్ టాస్క్‌లో భాగంగా హోటల్ యజమానులు, సిబ్బంది మధ్య సమన్వయం ఎలా ఉందో పరీక్షించేందుకు బిగ్ బాస్ ప్రత్యేక ఛాలెంజ్ ఇచ్చారు. యజమానులు చేసే సైగలను అర్థం చేసుకుని, సిబ్బంది వాటికి సంబంధించిన అంశాలను సరైన క్రమంలో బోర్డుపై అమర్చాల్సి ఉంటుంది.

ఈ ఛాలెంజ్‌లో ఒక జట్టులో నరేష్, ఝాన్సీ ఉండగా, మరో జట్టులో వర్షిణి, రోహిత్ ఉన్నారు. నరేష్ సైగలను అర్థం చేసుకుని బోర్డుపై సరైన క్రమంలో అమర్చాల్సిన ఝాన్సీ పొరపాటు చేసింది. అంతేకాకుండా, తాను అమర్చిన బోర్డును నరేష్‌కు చూపిస్తూ అది సరైనదేనా అని అడగడంతో బిగ్ బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆటలో ఇచ్చిన సూచనలను అర్థం చేసుకుని పని చేయాల్సి ఉండగా, ఇలా ఎదుటివారిని అడగడం ఎందుకని ప్రశ్నించారు. దీంతో ఝాన్సీ క్షమాపణ చెప్పింది. అనంతరం సంచాలక్‌గా ఉన్న త్రిగుణ్ ఆటను మళ్లీ మొదటి నుంచి ప్రారంభించారు.

ఈసారి నరేష్, వర్షిణి సైగలు చేయగా, ఝాన్సీ, రోహిత్ వాటిని గుర్తించి బోర్డుపై అమర్చాల్సి వచ్చింది. అయితే కొన్ని అంశాలను తప్పుగా అమర్చడంతో త్రిగుణ్ ఆ జట్టు ఫౌల్ గేమ్ ఆడిందని నిర్ణయించాడు. తాము నిబంధనలకు అనుగుణంగానే ఆడామని వర్షిణి, రోహిత్ చెప్పినప్పటికీ త్రిగుణ్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. కానీ చివరకు రోహిత్, వర్షిణి టీమ్ గెలిచింది.

34
వర్షిణికి ముద్దు పెడుతు దొరికిపోయిన ముఖేష్
Image Credit : Jio Hotstar

వర్షిణికి ముద్దు పెడుతు దొరికిపోయిన ముఖేష్

మరోవైపు బీబీ హోటల్ టాస్క్‌లో సరదా సన్నివేశాలు కూడా కనిపించాయి. బిగ్ బాస్ హోటల్ కు పెళ్లి చేసుకోడానికి జంటగా వచ్చారు ముకేష్‌, దేబ్జాని. కానీ ముఖేష్ బీబీ హోటల్ కు వచ్చిన తరువాత వర్షిణివైపు ఆకర్షితుడు అవుతాడు. ఆమెతో బాగా క్లోజ్ గా ఉండటంతో దుబ్జానీ ఫైర్ అవుతుంది.

ఇక వర్షిణికి ముఖేష్ ముద్దు పెట్టిన ఫోటో బిగ్ బాస్ రివిల్ చేయడంతో దేబ్జానీ అతడిని ప్రశ్నించింది. వర్షిణి, ముకేష్ కలిసి ఉన్న ముద్దు ఫొటోను చూసిన దేబ్జానీ, ముకేష్ తనను మోసం చేశాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకు ముకేష్ స్పందిస్తూ, ఆమె తన మాజీ ప్రేయసి అని, ప్రస్తుతం అక్కడ పనిచేస్తోందనే విషయం తనకు తెలియదని కవర్ చేశాడు.

ఇక అమన్, వర్షిణి మధ్య కూడా సరదాగా మొదలైన సంభాషణ వాదనకు దారితీసినట్లు కనిపిస్తోంది. మరోవైపు త్రిగుణ్, శివ్, నీతూ, రాం ప్రసాద్ కలిసి డబ్బులు, స్టార్ల పంపిణీ గురించి చర్చించారు. డబ్బులు తీసుకుని ఒక స్టార్‌ను రాం ప్రసాద్‌కు ఇచ్చారు. అయితే ఆ స్టార్ తన దగ్గర ఉన్నంత వరకే తనకు అధికారం ఉంటుందని త్రిగుణ్ కామెంట్ చేశాడు.

దీనికి వర్షిణి స్పందిస్తూ, స్టార్ తన వద్ద ఉందని అందరినీ నమ్మించాలని సూచించింది. ఆ స్టార్‌ను ఎవరికి ఇచ్చినా తనను అడిగే ఇస్తానని త్రిగుణ్ చెప్పగా, తనకు మాత్రం ఇవ్వడా అని వర్షిణి ప్రశ్నించింది. దానికి త్రిగుణ్, తనను ఎమోషనల్ గా ఒత్తిడికి గురిచేయవద్దని బదులిచ్చాడు.

ఇదిలా ఉండగా, నీతూ రాం ప్రసాద్‌కు ఉచితంగా స్టార్ ఇచ్చిందని సుధీర్, రోహిత్‌తో చెప్పాడు. ఆ స్టార్ ఎందుకు ఇచ్చారని రోహిత్ నీతూను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రోహిత్ వద్ద రూ.12 వేలు ఉన్నాయని త్రిగుణ్ ప్రస్తావించగా, స్టార్లన్నీ పంచుకుంటున్నారని ఆర్కే వ్యాఖ్యానించాడు. ఈ వ్యవహారంలో తనదే కీలక పాత్ర అని త్రిగుణ్ చెప్పగా, ఆటలో వ్యూహం తెలుసుకోవడానికి తన దగ్గరకు వచ్చానని ఆర్కే సమాధానమిచ్చాడు.

44
రెడ్ జోన్ సభ్యులకు డబుల్ ఎలిమినేషన్ భయం
Image Credit : Asianet News

రెడ్ జోన్ సభ్యులకు డబుల్ ఎలిమినేషన్ భయం

టాస్కుల్లో విజయం సాధించలేక రెడ్ జోన్‌లోనే కొనసాగుతున్న సభ్యులకు బిగ్ బాస్ మరో హెచ్చరిక ఇచ్చారు. ఛాలెంజ్‌లు పూర్తయ్యే వరకు రెడ్ జోన్‌లో ఉండేవారు రెండు రకాల ఎలిమినేషన్ ప్రక్రియలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వెల్లడించారు.దీంతో రెడ్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్లలో ఆందోళన పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ వారం టాస్కుల్లో తమ ప్రతిభను నిరూపించుకుని ఎల్లో లేదా గ్రీన్ జోన్‌కు వెళ్లేందుకు వారు ప్రయత్నించాల్సి ఉంటుంది. ఎల్లో జోన్‌లో ఉన్నవారికి కూడా గ్రీన్ జోన్‌లోకి వెళ్లే అవకాశాలు కల్పించే టాస్కులు ఉండవచ్చని తెలుస్తోంది.

గత వారం ప్రేక్షకుల ఓట్ల ద్వారా దక్షి ఎలిమినేట్ కాగా, గోట్ సభ్యుల నిర్ణయంతో రెడ్ జోన్‌లో ఉన్న షాలిని కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వారం మరోసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అన్న ఉత్కంఠ నెలకొంది.

కెప్టెన్సీ పోటీదారులు ఎవరు?

బీబీ హోటల్ టాస్క్‌లో డబ్బులు, స్టార్ల పంపిణీ కీలకంగా మారడంతో కంటెస్టెంట్లు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరోవైపు సంచాలక్‌గా త్రిగుణ్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా టాస్క్ ఫలితాలపై ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. ఝాన్సీ, రోహిత్, వర్షిణి వంటి సభ్యులు టాస్కుల్లో తమను తాము నిరూపించుకోవాల్సి ఉండగా, గ్రీన్ జోన్ సభ్యుల చేతుల్లో ఉన్న స్టార్లు ఎవరికి దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది.ఈ టాస్క్ ముగిసే సమయానికి ఎవరు కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారు? రెడ్ జోన్‌లో ఉన్నవారికి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? ఈ వారం ఎలిమినేషన్ విషయంలో బిగ్ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నది తదుపరి ఎపిసోడ్‌లో తేలనుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
వినోదం
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
Halloween 2026: నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన 10 హారర్ మూవీస్, చెమటలు పట్టించే సినిమాలు
Recommended image2
Killer Movie: సినిమా చూసి ట్విస్ట్ చెబితే కోటి రూపాయలు.. కిల్లర్‌ టీమ్‌ బంపర్‌ ఆఫర్‌.. కండీషన్స్ ఏంటంటే?
Recommended image3
Richest Singers : ఏఆర్ రెహమాన్ నుంచి హనీ సింగ్ వరకు.. ఇండియాలో అత్యంత ధనిక సింగర్స్ వీళ్లే
Related Stories
Recommended image1
Ramya Krishnan: బిగ్ బాస్ హోస్ట్‌గా రమ్యకృష్ణ.. ఒక్క ఎపిసోడ్ కు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Recommended image2
Gold Road: ప్రపంచంలోనే తొలిసారి బంగారంతో రోడ్డు నిర్మాణం.. మనం నడవచ్చు కూడా, ఎక్కడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved