- Home
- Entertainment
- Sudha: ఒక్క సంతకంతో 100 కోట్లు పోయాయి.. 1000 సినిమాలు చేసిన సుధ జీవితంలో ఇంత విషాదం ఉందా?
Sudha: ఒక్క సంతకంతో 100 కోట్లు పోయాయి.. 1000 సినిమాలు చేసిన సుధ జీవితంలో ఇంత విషాదం ఉందా?
Sudha: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో.. మరీ ముఖ్యంగా తెలుగు, తమిళ పరిశ్రమలో దాదాపు 1000కి పైగా సినిమాల్లో నటించింది సుధ. సహజనటిగా ఆమెకు పేరుంది. వెండితెరపై వెలుగు వెలిగిన ఈ తార జీవితంలో ఎన్ని విషాదాలు దాగి ఉన్నాయో తెలుసా?

వెండితెరపై హుందాగా కనిపించే నటి
తెలుగు వెండితెరపై అమ్మ, అక్క, వదిన వంటి వైవిధ్యమైన పాత్రలతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న సీనియర్ నటి సుధ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ తో పాటు నాగార్జున, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లో ఎన్నో పాత్రల్లో మెరిశారు సుధ. సుమారు వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి ఆమె తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. వెండితెరపై ఎంతో ప్రశాంతంగా, హుందాగా కనిపించే ఆమె నిజ జీవితంలో మాత్రం ఊహించని ఎన్నో విషాదాలు దాగి ఉన్నాయి.
రాజభోగాల నుంచి పేదరికం వైపు
నటి సుధ చాలా సంపన్న కుటుంబంలో జన్మించారు. నలుగురు అన్నయ్యల మధ్య ఆమెఏకైక ఆడపిల్ల, దాంతో సుధ చాలా గారాబంగా పెరిగింది. కార్లు, కాస్ట్లీ లైఫ్ స్టైల్ తో.. ఇంటి నిండా పనిమనుషులతో మహారాణిలా పెరిగింది. కానీ కొంత కాలానికి ఆమె తండ్రి క్యాన్సర్ బారిన పడటంతో ఆ కుటుంబం ఒక్కసారిగా కోలుకోలేని ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది. తండ్రి వైద్యం కోసం ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయాయి. అప్పటికి సుధ వయసు కేవలం పదేళ్ల లోపే కావడంతో.. చిన్నతనంలోనే కష్టాలు స్టార్ట్ అయ్యాయి. కనీసం చదువుకోవడానికి కూడా డబ్బు లేకపోవడంతో, చివరికి తల్లి తాళిబొట్టును తాకట్టు పెట్టాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది.
సినిమాలతో కోట్లు సంపాదించిన నటి..
చిన్నతనంలోనే చాలా కష్టాలు అనుభవించడంతో.. సుధ చాలా జాగ్రత్తగా తనలైఫ్ ను ఓ రూట్ లో పెట్టుకోవడం మొదలు పెట్టింది. చిన్నగా ఆమె నటనారంగంలోకి అడుగుపెట్టారు. తన ట్యాలెంట్ తో నటిగా స్టార్ డమ్ సంపాదించి.. ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్టుగా మారి అపారమైన సంపాదనను, కీర్తి ప్రతిష్ఠలను సంపాదించింది. టాలీవుడ్, కోలీవుడ్ భాషలలో ప్రముఖ నటిగా వెలుగు వెలిగింది. అంతే కాదు పలు వ్యాపారాల ద్వార కూడా ఆమె కోట్ల ఆస్తిని సంపాదించింది. సరిగ్గా అదే టైమ్ లో ఆమె జీవితంలో మరో విషాదం ఫేస్ చేయాల్సి వచ్చింది.
ఒక్క సంతకంతో 100 కోట్ల ఆస్తి మాయం..
జీవితం మళ్లీ గాడిన పడుతున్న సమయంలో ఆమె వ్యాపార రంగంలోకి ప్రవేశించడం పెద్ద సాహసంగా మారింది. ఢిల్లీలో భారీ పెట్టుబడితో ఒక హోటల్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆ వ్యాపార లావాదేవీల సమయంలో ఆమె చేసిన ఒకే ఒక్క సంతకం ఆమె జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేసింది. ఆ డాక్యుమెంట్‌పై పెట్టిన ఆ ఒక్క సంతకం కారణంగా జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న వంద కోట్ల రూపాయలకు పైగా ఆస్తిని క్షణంలో కోల్పోవాల్సి వచ్చింది.
వ్యక్తిగత జీవితంలో ఒంటరితనం..
ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతిన్న సుధకు వ్యక్తిగత జీవితంలోనూ తీవ్రమైన చేదు అనుభవాలు ఎదురయ్యాయి. సంపద కరిగిపోయిన కష్టకాలంలో భర్త ఆమెకు అండగా నిలవాల్సింది పోయి, ఆమెను వదిలేసి వెళ్లిపోయారు. ఇక ఎంతో ప్రాణంగా పెంచుకున్న కన్న కొడుకు సైతం ఒక చిన్న మనస్పర్థల కారణంగా ఆమెకు దూరమై విదేశాల్లో స్థిరపడ్డాడు. ఇలా అన్నీ ఉన్నా ప్రస్తుతం ఆమె ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.




