రామ్ చరణ్ పునీత్ రాజ్ కుమార్ నివాసానికి వెళ్లనున్నట్లు సమాచారం. పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆయనకు నివాళులు అర్పించనున్నారు.
కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి ఆరు రోజులు అవుతుంది. అయినప్పటికీ ఈ విషాద ఘటన నుండి కుటుంబ సభ్యులు, అభిమానులు బయటపడలేకున్నారు. Puneeth rajkumar మరణవార్త విని కొందరు అభిమానులు గుండెపోటుకు గురై మరణించారు.ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పునీత్ కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతం. పునీత్ అన్నగారైన శివరాజ్ కుమార్ చిన్న పిల్లాడి వలె, భౌతికకాయం పక్కనే కూర్చుని రోదించారు.
Also read Puneeth rajkumar : జిమ్ చేయడం వలన కాదు, పునీత్ మరణానికి అసలు కారణం అదే
అంత వేదనలో కూడా Shiva rajkumar కన్నడ ప్రజలను ఉద్దేశిస్తూ సందేశం అందించారు. పునీత్ నాకంటే 13ఏళ్ళు చిన్నవాడు. నా చేతులలో ఎత్తుకొని తనని పెంచాను. తమ్ముడుగా కాకుండా ఓ కొడుకుగా పునీత్ ని నేను భావిస్తాను. తన మరణం తీరని శోకాన్ని నింపింది. ఇది నమ్మలేని నిజం అయినప్పటికీ, వాస్తవాన్ని ఒప్పుకోవాలి. అభిమానులు అందరూ సంయమనం పాటించాలి. ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు. మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ కోసం క్షేమంగా ఉండండి, అని ఆయన విజ్ఞప్తి చేశారు.
Also read Puneeth rajkumar: పునీత్ కళ్ళతో నలుగురి కంటి చూపు, మిగిలిన భాగంతో మూలకణాల ఉత్పత్తి!
కాగా నేడు రామ్ చరణ్ పునీత్ రాజ్ కుమార్ నివాసానికి వెళ్లనున్నట్లు సమాచారం. పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆయనకు నివాళులు అర్పించనున్నారు. ఎన్టీఆర్, బాలకృష్ణ తరువాత పునీత్.. రామ్ చరణ్ కి చాలా క్లోజ్. పలు సందర్భాల్లో కలిసిన Ram charan, పునీత్ మంచి మిత్రులుగా మారారు. కొన్ని అనివార్య కారణాల వలన రామ్ చరణ్ పునీత్ అంత్యక్రియలకు హాజరుకాలేదు. దీనితో నేడు బెంగుళూరులోని పునీత్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
నిన్న నాగార్జున సైతం పునీత్ ఇంటికి స్వయంగా వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. పునీత్ రాజ్ కుమార్ కి నివాళులు అర్పించారు. అంత్యక్రియలకు మెగా ఫ్యామిలీ నుండి Chiranjeevi హాజరైన విషయం తెలిసిందే. నందమూరి ఫ్యామిలీ తరపున బాలకృష్ణ, ఎన్టీఆర్ స్వయంగా పాల్గొన్నారు. బాలయ్య పునీత్ మృతదేహం వద్ద కన్నీరు పెట్టుకున్నారు. ఇక టాలీవుడ్ నుండి వెంకటేష్, శ్రీకాంత్, ఆలీ పునీత్ అంత్యక్రియలకు హాజరయ్యారు.
