Srikanth అభిప్రాయం ప్రకారం పునీత్ మరణించిన రోజు ఆయన వ్యాయామం చేయలేదు. అంతకు ముందు రోజు రాత్రి నుండే పునీత్ నలతగా ఉన్నారు. ఫ్యామిలీ డాక్టర్ ని కూడా సంప్రదించడం జరిగింది. 

పునీత్ రాజ్ కుమార్ మరణంపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. అతిగా జిమ్ చేయడం వలెనే పునీత్ గుండెపోటుకు గురయ్యారనేది ప్రముఖంగా వినిపిస్తున్న మాట. ప్రస్తుతం జేమ్స్ టైటిల్ తో తెరెక్కుతున్న చిత్రంలో పునీత్ నటిస్తున్నారు. James సినిమాలోని పాత్ర కోసం కండలు తిరిగిన దేహం సాధించడానికి పరిమితికి మించి పునీత్ జిమ్ చేశారని కొందరు భావిస్తున్నారు. ఈ పుకార్లపై నటుడు శ్రీకాంత్ స్పందించారు. పునీత్ మరణానికి అసలు కారణం జిమ్ చేయడం కాదని తెలిపారు. 


Srikanth అభిప్రాయం ప్రకారం పునీత్ మరణించిన రోజు ఆయన వ్యాయామం చేయలేదు. అంతకు ముందు రోజు రాత్రి నుండే పునీత్ నలతగా ఉన్నారు. ఫ్యామిలీ డాక్టర్ ని కూడా సంప్రదించడం జరిగింది. పునీత్ కి ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ అంతా నార్మల్ గా ఉందని తెలిపారు. అయితే శుక్రవారం ఉదయానికి పునీత్ కి విపరీతంగా చెమటలు పట్టి అపస్మారక స్థితికి చేరారు. పునీత్ సడన్ స్ట్రోక్ కి గురికావడం జరిగింది. నిమిషాల వ్యవవధిలో ఆయన హృదయం కొట్టుకోవడం ఆగిపోయింది. దాని కారణంగా చాలా త్వరగా ఆసుపత్రికి చేరుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని, తెలిపారు. 


జేమ్స్ మూవీలో Puneeth rajkumar కి ప్రతి నాయకుడిగా శ్రీకాంత్ నటిస్తున్నట్లు సమాచారం. శనివారం పునీత్ పార్దీవ దేహాన్ని శ్రీకాంత్ సందర్శించారు. చిరంజీవి, ఎన్టీఆర్, బాలయ్య, అలీ, వెంకటేష్ లతో పాటు ఆయన నివాళులు సమర్పించారు. పునీత్ పార్దీవదేహాన్ని ఖననం చేయగా, అన్న కుమారుడు వినయ్ రాజ్ కుమార్ పునీత్ చివరి సంస్కారాలు నిర్వహించారు. పునీత్ కి ఇద్దరూ కుమార్తెలు కావడంతో వినయ్ ఆ బాధ్యత చేపట్టారు. కన్నడ స్టార్ హీరోలైన సుధీప్, యష్ అత్యంక్రియలు ముగిసే వరకు అక్కడే ఉండి, తమ ప్రియ మిత్రుడికి చివరి వీడ్కోలు తెలిపారు. 

Also read సూర్య 'జై భీమ్' రివ్యూ
పునీత్ కి అంత్యక్రియలు నిర్వహించిన కంఠీరవ స్టూడియో పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ విధించారు. అభిమానులు పునీత్ అభిమానులు సమాధి వద్దకు చొచ్చుకు వచ్చే ప్రమాదం ఉన్న తరుణంలో పోలీసులు ప్రహర కాస్తున్నారు. ఎటువంటి అనూహ్య సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పునీత్ మరణవార్త తరువాత సంయమనం పాటించి, శాంతియుతంగా ఉన్న అభిమానులకు అన్న రాఘవేంద్ర రాజ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. 

Also read Puneeth rajkumar: పునీత్ కళ్ళతో నలుగురి కంటి చూపు, మిగిలిన భాగంతో మూలకణాల ఉత్పత్తి!