Asianet News TeluguAsianet News Telugu

Puneeth rajkumar: పునీత్ కళ్ళతో నలుగురి కంటి చూపు, మిగిలిన భాగంతో మూలకణాల ఉత్పత్తి!

బెంగుళూరులోని నారాయణ నేత్రాలయ వైద్యులు పునీత్ కళ్ళను, భద్రపరచడం జరిగింది. అనంతర  ఆ కళ్లను శనివారం నలుగురు యువకులకు అమర్చినట్టు నేత్రాలయ చైర్మన్‌ డాక్టర్‌ భుజంగశెట్టి తెలిపారు.

puneeth raj kumar eyes helps to four people to get sight back
Author
Hyderabad, First Published Nov 2, 2021, 8:09 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

 సేవే పరమావధిగా బ్రతికాడు కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్.అనాథలైన పిల్లల నుండి వృద్ధుల వరకు, చివరికి మూగ జీవాల పట్ల తన బాధ్యత నెరవేర్చాడు. మరణం అనంతరం కూడా తన శరీరంలోని ముఖ్యమైన కళ్ళు ఇతరులకు ఉపయోగపడేలా నిర్ణయం తీసుకుని, గొప్ప మానవతావాది అనిపించుకున్నారు. నేత్ర దానం చేసిన Puneeth rajkumar కళ్ళను, ఆయన మరణం అనంతరం శరీరం నుండి సేకరించి భద్రపరిచారు. 
 
బెంగుళూరులోని నారాయణ నేత్రాలయ వైద్యులు పునీత్ కళ్ళను, భద్రపరచడం జరిగింది. అనంతర  ఆ కళ్లను శనివారం నలుగురు యువకులకు అమర్చినట్టు నేత్రాలయ చైర్మన్‌ డాక్టర్‌ భుజంగశెట్టి తెలిపారు. సోమవారం Bhujanga shetty వైద్య బృందంతో కలిసి మీడియాతో మాట్లాడారు. సాధారణంగా రెండు కళ్లను ఇద్దరికే అమర్చుతామని, కానీ పునీత్‌ కళ్ల విషయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఒక్కో కార్నియా (నల్లగుడ్డు)ను పై పొర, లోపలి పొరగా రెండు భాగాలుగా విభజించామని తెలిపారు. వీటిని పైపొర సమస్యతో బాధపడుతున్న ఇద్దరు యువకులకు, లోపలి పొరను ఆ సమస్య ఎదుర్కొంటున్న మరో ఇద్దరికి అమర్చామని వివరించారు.

కొత్త కంటిని శరీరం తిరస్కరించే ప్రమాదాన్ని ఇది బాగా తగ్గిస్తుందని కూడా తెలిపారు. వాడకుండా మిగిలిపోయిన తెల్లగుడ్డు భాగం ద్వారా తమ ల్యాబ్‌లో కంటి మూల కణాలను ఉత్పత్తి చేయనున్నట్టు చెప్పారు. ఎవరికైనా ప్రమాదాల్లో తెల్ల గుడ్డుకు గాయాలైతే ఆ కణాల ద్వారా చికిత్స చేయవచ్చన్నారు. ఆ విధంగా పునీత్ తన కళ్ళ ద్వారా నలుగురి జీవితాలలో వెలుగు ప్రసాదించాడు. 

అక్టోబర్ 29శుక్రవారం ఉదయం పునీత్ తన నివాసంలో వ్యాయామం చేస్తుండగా, తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనితో కుటుంబ సభ్యులు ఆయనను పక్కనే ఉన్న విక్రమ్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. పునీత్ కార్డియాక్ అరెస్ట్ కి గురైనట్లు గుర్తించిన వైద్యులు, కాపాడడం కోసం తీవ్రంగా శ్రమించారు. అతితక్కువ సమయంలోనే పునీత్ పరిస్థితి విషమంగా మారింది. 46ఏళ్ల పునీత్ కుటుంబాన్ని, కోట్ల అభిమానులను వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 

టాలీవుడ్ హీరోలతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న పునీత్ మరణం అందరినీ కుదిపివేసింది. బాలకృష్ణ, Ntr,Chiranjeevi, వెంకటేష్, ఆలీ, శ్రీకాంత్ వంటి ప్రముఖులు పునీత్ అంత్యక్రియలకు హాజరయ్యారు. పునీత్ పార్దీవ దేహానికి నివాళులు అర్పించారు. Balakrishna వంటి గంభీరమైన వ్యక్తి పునీత్ భౌతికకాయాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఆదివారం కంఠీరవ స్టూడియోలో తల్లిదంత్రుల సమాధుల పక్కనే పునీత్ అంత్యక్రియలు ఏర్పాటు చేశారు. 

Also read Puneeth Rajkumar: పునీత్‌ ఫ్యాన్స్ కి గుడ్‌ న్యూస్‌ చెప్పిన `జేమ్స్` సినిమా టీమ్‌

పునీత్ పార్దీవదేహాన్ని ఖననం చేయగా, అన్న కుమారుడు వినయ్ రాజ్ కుమార్ పునీత్ చివరి సంస్కారాలు నిర్వహించారు. పునీత్ కి ఇద్దరూ కుమార్తెలు కావడంతో వినయ్ ఆ బాధ్యత చేపట్టారు. కన్నడ స్టార్ హీరోలైన సుధీప్, యష్ అత్యంక్రియలు ముగిసే వరకు అక్కడే ఉండి, తమ ప్రియ మిత్రుడికి చివరి వీడ్కోలు తెలిపారు. 

Also read Bigg Boss Telugu 5: మానస్‌కి ధైర్యం లేదట.. బయటకు పంపిస్తే గేమెలా ఆడాలంటూ షణ్ముఖ్‌కి షాకిచ్చిన ప్రియాంక

Follow Us:
Download App:
  • android
  • ios