- Home
- Entertainment
- The Kerala Story 2 మూవీ రిలీజ్‌కు బ్రేక్.. 'ది కేరళ స్టోరీ 2'పై హైకోర్టు స్టే.. ఏం జరిగిందంటే?
The Kerala Story 2 మూవీ రిలీజ్‌కు బ్రేక్.. 'ది కేరళ స్టోరీ 2'పై హైకోర్టు స్టే.. ఏం జరిగిందంటే?
The Kerala Story 2: 'ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్' సినిమా విడుదలను కేరళ హైకోర్టు నిలిపివేసింది. కేరళని తప్పుగా చూపిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం, తదుపరి విచారణ ముగిసే వరకు సినిమాను రిలీజ్ చేయవద్దని ఆదేశించింది.

'ది కేరళ స్టోరీ 2' రిలీజ్‌కు హైకోర్టు బ్రేక్
'ది కేరళ స్టోరీ 2' సినిమాను ఫిబ్రవరి 27న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ కేరళ హైకోర్టు ప్రస్తుతానికి విడుదలను ఆపింది. ఈ సినిమా కేరళ ప్రతి ష్టను దెబ్బతీస్తుందని ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. విచారణ సందర్భంగా, కోర్టు కోసం ఒక ప్రీ-స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని నిర్మాతలను న్యాయస్థానం కోరింది. అయితే, నిర్మాతలు దీనికి నిరాకరించారు.
ది కేరళ స్టోరీ: గోస్ బియాండ్
టైటిల్‌ను సమర్థించుకున్న నిర్మాతలు
జస్టిస్ బెచు కురియన్ థామస్ విచారణను మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి ప్రారంభించారు. ఈ విచారణలో నిర్మాతలు తమ వాదనలు వినిపిస్తూ, సినిమా టైటిల్‌ను సమర్థించుకున్నారు. ఈ క్రమంలో, విచారణ పూర్తయ్యే వరకు సినిమాను విడుదల చేయవద్దని హైకోర్టు మ ధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
మూడు రాష్ట్రాలు.. ముగ్గురు మహిళల కథ
ఈ సినిమా టీజర్‌లో మూడు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు మహిళలను చూపించారు. ఇది కేవలం కేరళకు సంబంధించిన కథ కాదని, దేశవ్యాప్త కథాంశం అని సూచిస్తుంది. 'గోస్ బియాండ్' అనే ట్యాగ్‌లైన్ కూడా కథ కేరళ దాటి విస్తరించిందని చెబుతోంది. 'ది' అనే పదం దీన్ని మొదటి భాగానికి సీక్వెల్‌గా చూపిస్తుందన్నారు.

