Asianet News TeluguAsianet News Telugu

'కొరమీను' టైటిల్ పోస్టర్ విడుదల.. విడుదల చేసిన లావణ్య త్రిపాఠి.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్!

ఆసక్తికర కథతో తెలుగులో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘కొరమీను’ (Korameenu). తాజాగా ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను గ్లామర్ బ్యూటీ లావణ్య త్రిపాఠి లాంచ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది.
 

The motion poster of Korameenu is Intresting, launched by Lavanya Tripathi!
Author
First Published Oct 30, 2022, 6:52 PM IST

ఆనంద్ రవి కథానాయకుడిగా ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మిస్తున్న తాజా చిత్రం 'కోరమీను'. ఈ సినిమాకు  శ్రీపతి కర్రి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా సినిమాలోని ఆనంద్ రవి ఫస్ట్ లుక్ ను విడుదల చేయడంతో పాటు టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్‌ను ఈరోజు బ్యూటిఫుల్ హీరోయిన్ లావణ్యా త్రిపాఠి (Lavanya Tripathi) విడుదల చేశారు.
 
‘మీసాల రాజు గారికి మీసాలు తీసేశారంట! ఎందుకు?’ అంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ఆసక్తి  కలిగిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఆ పోస్టర్ ను విడుదల చేశారు. ఆనంద్ రవి ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కూడా ఓ బోట్ మీద ఆ లైన్స్ కనిపించాయి. 
‘కొరమీను’ ఫస్ట్ లుక్, టైటిల్ మోషన్ పోస్టర్ చూస్తే... సముద్ర తీర ప్రాంతంలో జరిగే కథగా అర్థం అవుతోంది. ఆకాశంలో విపరీతమైన మబ్బులు... సముద్ర తీరంలో బోలెడు పడవలు... ఆనంద్ రవి ఉన్న పడవపై వలలు... ఇలా ఆసక్తి కలిగించేలా ఫస్ట్ లుక్ ఉంది. ఒక బోట్ పై 'మీసాల రాజ్ మీసాలు ఎవరో కత్తిరించారా! ఎందుకు?'  అని ఉంది. నేపథ్య సంగీతం కూడా బావుంది. 

దర్శకుడు శ్రీపతి కర్రి చిత్రం గురించి మాట్లాడుతూ.. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేసిన లావణ్య త్రిపాఠికి థాంక్స్ చెప్పారు.  జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీ నేపథ్యంలో కథ సాగుతుందని అన్నారు. ఓ డ్రైవర్, అహంకారంతో కూడిన, బాగా డబున్న అతని యజమాని, వైజాగ్‌లో శక్తివంతమైన పోలీసు - ఈ ముగ్గురి పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. మంచి కంటెంట్ తో వస్తున్న చిత్రమిది. అందరికీ నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

కోటి పాత్రలో ఆనంద్ రవి, కరుణగా హరీష్ ఉత్తమన్, మీసాల రాజు పాత్రలో శత్రు, మీనాక్షిగా కిషోరీ దత్రక్, దేవుడు పాత్రలో రాజా రవీంద్ర, సీఐ కృష్ణ పాత్రలో గిరిధర్, ముత్యంగా 'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్, సుజాతగా ఇందు కుసుమ, వీరభద్రమ్ పాత్రలో ప్రసన్న కుమార్, కరుణ అసిస్టెంట్ పాత్రలో ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా కార్తీక్ కొప్పెర, సౌండ్ డిజైన్ గా సాయి వర్మ ముదునూరి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను  సిద్ధార్థ్ సదాశివుని వ్యవహరిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios