బాలనటుడిగా ప్రస్థానం మొదలు పెట్టి, స్టార్ హీరోగా ఎదిగిన దళపతి విజయ్ ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించారు. విజయ్ సినీ ప్రయాణంతో పాటు ఫ్యామిలీ డీటేయిల్స్ గురించి చూస్తే..?
జూన్ 22, 1974న చెన్నైలో దర్శకుడు ఎస్.ఎ. చంద్రశేఖర్, గాయని శోభ దంపతులకు జోసెఫ్ విజయ్ జన్మించారు. అభిమానులు ఆయనకు దళపతి బిరుదు ఇవ్వగా.. విజయ దళపతిగా మారాడు స్టార్ హీరో. ఈరోజు( జూన్ 22) విజయ్ తన 51వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సహా చాలా మంది ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తండ్రి చంద్రశేఖర్ దర్శకత్వంలో బాలనటుడిగా సినీ ప్రయాణం ప్రారంభించిన విజయ్, సినిమాలే తన భవిష్యత్తు అని అప్పుడే నిర్ణయించుకున్నాడు. నటనపై ఉన్న మక్కువ కారణంగా విజయ్ కాలేజీ చదువును కూడా మధ్యలోనే మానేశాడు.
విజయ్ దళపతి మొదటి సినిమా
విజయ్ తన తండ్రి చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన నలయ్య తిరుప్ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఈసినిమాకు అతని తల్లి శోభ స్క్రీన్ ప్లే రాశారు. ఆ టైటిల్ ఆధారంగా విజయ్ ఇప్పుడు ఉన్న ఎత్తులకు చేరుకుంటాడని ఎవరూ ఊహించి ఉండరు. విజయ్ తొలినాళ్ల సినిమా అభివృద్ధికి అతని తండ్రి ఎస్.ఎ.సి. కారణమని ఎవరూ కాదనలేరు.
తన మొదటి సినిమాతోనే మంచి ఆదరణ లభించకపోవడంతో విజయ్, జనాలకు పరిచయం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు చంద్రశేఖర్. విజయకాంత్‌తో కలిసి సెంథురపాండి అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆ సినిమా ద్వారా, విజయ్ గ్రామాల్లోకి కూడా చొచ్చుకుపోయాడు. రెండో సినిమాతోనే తమిళ ప్రేక్షకుల ఆదరణ పొందాడు.
పెళ్లి తరువాత వరుసగా హిట్లు కొట్టిన విజయ్
4 ఫైట్లు, 5 పాటల ఫార్ములాలో రెగ్యులర్ హీరోగా ఉన్న విజయ్‌ను దర్శకుడు విక్రమన్ స్టార్ హీరోను చేశారు. 1996లో విడుదలైన 'పూవే ఉనక్కగా' చిత్రంతో విజయ్ లోని టాలెంట్ ను బయటకు తీశారు విక్రమన్. ఇక 1998లో, బాసిల్ దర్శకత్వం వహించి సంగిలి మురుగన్ నిర్మించిన 'కాదలుక్కు ఆది' చిత్రంతో విజయ్ తమిళంలో స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. అంతే కాదు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.
విజయ్ సినిమా రంగంలో ఎదుగుతున్న సమయంలోనే పెళ్లి కూడా జరిగింది. ఎప్పటి నుంచో ఆయన ప్రేమిస్తున్న స్నేహితురాలు సంగీతను తన కుటుంబ సభ్యుల అనుమతితో ఆగస్టు 25, 1999న వివాహం చేసుకున్నాడు. వారి వివాహం తర్వాత, సంగీత కూడా విజయ్ కు సొంత కాస్ట్యూమ్ డిజైనర్ అయింది. తన భార్య వచ్చిన తర్వాత, విజయ్ ఖుషి, ఫ్రెండ్స్, యూత్, ప్రియమానవలే వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేశారు.
గిల్లి సినిమాతో తిరుగులేని స్టార్ గా మారిన విజయ్
2005లో వచ్చిన గిల్లి సినిమా విజయ్ ని తిరుగులేని స్టార్ ను చేసింది, ఈసినిమాతో ఆయన క్రేజ్ మరో స్థాయికి వెళ్లింది. తెలుగులో మహేష్ బాబు హీరోగా వచ్చిన ఒక్కడు సినిమాను తమిళంలో గిల్లి సినిమాగా రీమేక్ చేశారు. ఈసినిమాతో తమిళనాట విజయ్ క్రేజ్ ఓ రేంజ్ లో పెరగడంతో పాటు చిన్న పిల్లలు కూడా విజయ్ అభిమానులుగా మారడం ప్రారంభించారు. గిల్లి విజయ్ స్క్రీన్ చరిత్రను మార్చేసింది. విజయ్ ను స్టార్ హీరోల సరసన నిలబెట్టిన సినిమా ఇదే.
తమిళనాట రజనీకాంత్ తరువాత 100 కోట్లు వసూలు చేసిన తమిళ హీరో విజయ్. అంతే కాదు ఇతర హీరోల అభిమానుల చేత కూడా శభాష్ అనిపించుకున్న హీరో విజయ్. అంతే కాదు ఎవరు చేయలేని సాహసాలు విజయ్ ఎన్నో చేశారు. ఇక తమిళనాట హీరోలు పాటలు పాడే ట్రెండ్ కూడా విజయ్ తోనే స్టార్ట్ అయ్యిందని చెప్పాలి. ఇప్పటి వరకు "ఐ యామ్ రెడీ ఇన్ లియో, "విజిల్ ఇన్ కోడ్" వంటి ఎన్నో పాటలు ఆయన పాడారు. ఇక విజయ్ చివరి సినిమా 2026న పొంగల్ సందర్భంగా విడుదల కానుంది. తన రాజకీయ ప్రవేశం తర్వాత ఇకపై సినిమాల్లో నటించనని ప్రకటించారు దళపతి.
విజయ్ దళపతి ఆస్తుల విలువ
కధలుక్కు ఆరతి, తిరుపాచి సినిమాలకు విజయ్ రెండుసార్లు తమిళనాడు ప్రభుత్వ అవార్డును అందుకున్నారు. ఇలా అభిమానుల హృదయాలను గెలుచుకున్న విజయ్ ఇప్పుడు ఒక్కో సినిమాకు 200 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, తమిళ సినిమాలో అత్యంత ధనవంతుడైన నటుడు విజయ్, ఇటీవల ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రచురించిన జాబితా ప్రకారం విజయ్ ఆస్తుల విలువ 474 కోట్లు. రజినీకాంత్, కమల్ హాసన్, అజిత్ కుమార్ వంటి నటులు విజయ్ కంటే చాలా ఎక్కువ ఆస్తులను కలిగి ఉండటం గమనార్హం.
విజయ్ ఇప్పుడు సినిమాల నుండి విరామం తీసుకుని పూర్తి సమయం రాజకీయ రంగంలోకి ప్రవేశించాడు. అతని చివరి చిత్రం జన నాయగన్. ఈ చిత్రం జనవరి 9, 2026న పొంగల్ సందర్భంగా విడుదల కానుంది. తన రాజకీయ ప్రవేశం తర్వాత ఇకపై సినిమాల్లో నటించనని దళపతి విజయ్ ప్రకటించిన తర్వాత.. చివరి సినిమాగా పొలిటికల్ బాక్ గ్రౌండ్ తో జన నాయకన్ సినిమాను చేస్తున్నాడు విజయ్.
విజయ్ రాజకీయరంగ ప్రవేశం
గత కొన్నిసంవత్సరాలుగా విజయ్ రాజకీయ ప్రవేశం గురించి వార్తలు వైరల్ అవుతునే ఉన్నాయి. కాని ఆ విషయాన్ని విజయ్ ఎప్పుడు పట్టించుకోలేదు. కాని గ్రౌండ్ వర్క్ మాత్రం చేస్తూ వచ్చాడు. గతంలో తన తండ్రి ఓ పార్టీని రిజిస్టేషన్ చేయిస్తే దానికి తనకు ఏ సంబంధం లేదని ప్రకటించారు విజయ్. తరువాత కొంత కాలానికి విజయ్ చిన్నగా తన పొలిటికల్ ఎంట్రీ గురించి హింట్ ఇస్తూ వచ్చారు. ఆతరువాత అందరికి షాక్ ఇస్తూ సొంత పార్టీని ప్రకటించారు. ఇక సినిమాలు చేయనని కూడా విజయ్ ప్రటించారు.
ఇక విజయ్ చివరి సినిమాగా రాబోతున్న జననాయకన్ సినిమాను హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తుండగా, జననాయకన్ సినిమాలో విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, వరలక్ష్మి శరత్ కుమార్, బాబా భాస్కర్, గౌతమ్ మీనన్, నరైన్, ప్రకాష్ రాజ్ ఇలా స్టార్ కాస్ట్ ఎంతో మంది నటిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం విజయ్ చివరి చిత్రం కాబట్టి, అభిమానులలో చాలా అంచనాలు ఉన్నాయి. విజయ్ ఈ చిత్రాన్ని తన రాజకీయ వేదికగా ఉపయోగించుకుంటారని భావిస్తున్నారు.
